wrong information
-
చిలుకూరు ఆలయంపై తప్పుడు ప్రచారం
-
మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లను తగ్గుముఖం పట్టించేందుకు ఒకపక్క తాము అహర్నిశలు శ్రమిస్తుంటే మరోపక్క ఎడిటర్స్ గిల్డ్ ఇండియా మీడియా సంస్థ అగ్గికి ఆజ్యం పోసిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదనంగా ఎన్.శరత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త కూడా ఈజీఐ పై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. మణిపూర్‌లో కుకీ, మెయిటీ తెగల మధ్య జరిగిన అల్లర్లు చిలికి చిలికి గాలివానై తర్వాతి దశలో పెను ప్రళయంగా మారి దారుణ మారణకాండకు దారితీశాయి. అల్లర్ల సమయంలో జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సింది పోయి తప్పుడు కథనాలను ప్రచురించి అల్లర్లకు మరింత చెలరేగడానికి కారణమయ్యారని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదు చేసింది మణిపూర్ ప్రభుత్వం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శనివారం ప్రచురించిన కథనం ప్రకారం మణిపూర్ ప్రభుత్వం అల్లర్ల సమయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లు స్పష్టమయ్యిందని.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలా ప్రజలపట్ల సమానంగా వ్యవహరించకుండా ఒక పక్షంవైపే నిలిచిందని ఆరోపించింది. ఈ ఆరోపణలు అసత్యమైనవని చెబుతూ మొదట రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. #WATCH | The State government has filed an FIR against the members of the Editors Guild who are trying to create more clashes in the state of Manipur, says CM N Biren Singh. pic.twitter.com/gm2RssgoHL — ANI (@ANI) September 4, 2023 ఇది కాకుండా ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనానికి వ్యతిరేకంగా ఇంఫాల్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త ఎం.శరత్ సింగ్ ఆగస్టు 7 నుంచి 10 లోపు మణిపూర్ వచ్చిన సీమా గుహ, సంజయ్ కపూర్, భారత్ భూషణ్‌లతో పాటు ఎడిటర్స్ గిల్డ్ ఆ ఇండియా ప్రెసిడెంట్ పైన కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నివేదికలో ఉన్నఅనేక తప్పిదాలను సాక్ష్యాధారాలతో సహా ఎఫ్ఐఆర్లో ఏకరువు పెట్టారు. ఎఫ్ఐఆర్లో మే 3న నిప్పుల్లో కాలుతోన్న మణిపూర్ అటవీ శాఖాధికారి గృహం ఫోటోకు కింద 'తగలబడుతున్న కుకీ గృహం' అని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిందని పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా అదే రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను జతచేశారు. ఆ స్టేషన్ ఎస్ఐ జంగ్ఖొలాల్ కిప్జెన్ మాట్లాడుతూ ఇది కుకీలు నివాసం కాదని అల్లర్ల సమయంలో నిరసనకారులు తగలబెట్టిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇల్లని స్పష్టం చేశారు. దీంతో నాలుక్కరుచుకున్న ఎడిటర్స్ గిల్డ్ తమ తప్పును అంగీకరిస్తూ సెప్టెంబర్ 2న ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంటూ.. అసలు వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. There was an error in a photo caption in the report released on Sep 2. The same is being rectified and updated report will be uploaded on the link shortly. We regret the error that crept in at the photo editing stage — Editors Guild of India (@IndEditorsGuild) September 3, 2023 అంతకు ముందు ఎడిటర్స్ గిల్డ్ ఇచ్చిన నివేదిక ప్రకారం మయన్మార్ మిలటరీ తిరుగుబాటు కారణంగా అక్కడి నుండి వలస వచ్చిన వారితో కలిపి మణిపూర్ ప్రభుత్వం కుకీలను కూడా వలసదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కుకీలకు వ్యతిరేకంగా వ్యవహరించి మణిపూర్ ప్రభుత్వం అత్యధికులు ఆగ్రహానికి కారణమైందని రాసింది. ఈ విషయాన్ని కూడా శరత్ సింగ్ ఎఫ్ఐఆర్లో ప్రస్తావిస్తూ అక్రమ వలసదారులకు సంబంధించి ఈజీఐ కీలక సమాచారాన్ని ప్రచురించలేదని 2001తో పోలిస్తే సెన్సస్ 169 శాతం పెరిగిందని.. దీనిపై వారు కథనాన్ని ప్రచురించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇటీవల ఎలక్షన్ కమీషన్ ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని సుమారు 1,33,553 డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లుగా వారు గుర్తించారని తెలిపారు. కొండ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేవలం 10 శాతం అభివృద్ధి ఐదులను మాత్రమే వినియోగిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనం కూడా అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులలో దాదాపు 40 శాతం గిరిజనులు నివసించే కొండప్రాంతాలకే వెచ్చింస్తోందని తెలిపారు.. ఇలా అడుగడుగునా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనేక తప్పుడు కథనాలను ప్రచురించి పజాలను ఏమార్చి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని శరత్ సింగ్ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది. State Government had stated on the floor of the Assembly in 2021 regarding the budget allocation for the Valley and Hills across all departmental works. A committee was formed to check the fund inflow over the last 10 years, the methodology was also explained. There has been a… pic.twitter.com/w8MuIumve9 — Rajkumar Imo Singh (@imosingh) August 24, 2023 ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
వికీపీడియాలో పచ్చ దొంగలు
-
బీసీజీపై వికీపీడియాలో దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) వాస్తవ సమాచారం నెటిజన్లకు తెలియకుండా టీడీపీ మద్దతుదారులు వికీపీడియాలో ఆ పేజీని ఎడాపెడా మార్చివేశారు. రెండురోజుల్లోనే 12 సార్లు అందులోని సమాచారాన్ని మార్చి అది వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిల కంపెనీ అని, బఫూన్ కన్సల్టెన్సీ అని తప్పుడు సమాచారాన్ని జోడించారు. బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు వికీపీడియా పేజీని చూడగా ఈలోపే దాన్ని ఇష్టానుసారం మార్చి ఆ సంస్థపై దుష్ప్రచారానికి పూనుకున్నారు. బీసీజీ సమాచారాన్ని పూర్తిగా మార్చివేయడంతో ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వికీపీడియా యాజమాన్యం తప్పుడు సమాచారాన్ని సరిచేసింది. (చదవండి: ముగ్గురి నోట అదే మాట!) -
గీత దాటి వ్యవహరిస్తున్నారు- ఆమంచి
సాక్షి, ఒంగోలు: పోలీసు శాఖలోని పలువురు స్పెషల్ బ్రాంచి సిబ్బంది తమది కాని వ్యవహారాల్లో సైతం తలదూర్చడంతో పాటు ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్ చాంబర్లో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వడంతో పాటు రాతపూర్వకంగా ఎస్బీ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ బ్రాంచి సిబ్బంది అంటే జిల్లా పోలీసు ఉన్నతాధికారికి కళ్లు, చెవులు, ముక్కు వంటి వారన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టుల్లో పనిచేస్తున్న వారు గీత దాటి మరీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన వ్యక్తులు నేటికీ ఎస్బీలో కొనసాగుతూ ప్రభుత్వంపై తప్పుడు తరహాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అప్పటి ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ జిల్లాలో అరాచకంగా వ్యవహరించినందునే ఆయన్ను బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆయన టీడీపీకి తొత్తుగా పనిచేశారని, ప్రభుత్వం మారినా ఇంకా ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన సిబ్బందే ఆ వ్యవస్థలో కొనసాగుతుండటం అభ్యంతరకరమన్నారు. ఇటీవల తిమ్మసముద్రంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేస్తే దాన్ని తప్పుడు పద్ధతిలో ఎస్బీ సిబ్బంది రిపోర్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చీరాల ఏరియా వైద్యశాలలో వైఎస్సార్ సీపీ నాయకులు చికిత్స పొందుతూనే ఉన్నారన్నారు. ఎస్బీ డీఎస్పీ రాంబాబు, సీఐ కె.వెంకటేశ్వరరావు, మరికొంతమంది సిబ్బంది వ్యవహారం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మంత్రి లెటర్ హెడ్లపై దుష్ప్రచారం ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకంతో కూడిన లెటర్ హెడ్లు ఫోర్జరీ అయ్యాయంటూ నానా యాగీ చేసిందీ ఎస్బీ సిబ్బందేనని ఆమంచి గుర్తు చేశారు. ఫోర్జరీ అయితే మంత్రి ఫిర్యాదు చేయాలని, అంతే తప్ప కలర్ జిరాక్స్‌లపై ఫోర్జరీ సంతకాలంటూ దుష్ప్రచారం చేసిన వారిలో ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన బ్రిగేడ్‌లే ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లల్లో సాక్షాత్తు స్పెషల్ బ్రాంచి సిబ్బంది తనిఖీల పేరుతో సృష్టించిన హంగామాపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని ఆమంచి వివరించారు. తాను స్పెషల్ బ్రాంచి వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టడం లేదని, అదే విధంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా తప్పు పట్టడం లేదన్నారు. కేవలం కొంతమంది స్పెషల్ బ్రాంచిలో చేస్తున్న కుట్రపూరిత మోసాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానని, తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు. ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ బాగా పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లడం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న స్టీఫెన్ రవీంద్ర, డీజీపీ గౌతం సవాంగ్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లనున్నట్లు ఆమంచి పేర్కొన్నారు. ఆమంచి వెంట వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, కర్నేటి రవికుమార్, తులసి, మునగపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు. -
వాట్సాప్‌లో వదంతులు
టీ.నగర్: పుదుక్కోటై జిల్లా పొన్నమరావతి ప్రాంతంలో గురువారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు వాట్సాప్‌లో ఒక వర్గానికి చెందిన మహిళల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. కొందరు పొన్నమరావతి బస్టాండ్‌లో రాస్తారోకో చేపట్టారు. దుకాణాలను మూసివేయాల్సిందిగా హెచ్చరించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సెల్వరాజ్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని చెప్పడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోసారి శుక్రవారం ఉదయం ఉద్రిక్తత కొనసాగింది. పొన్నమరావతి సహా 30కి పైగా గ్రామాల్లో అన్ని దుకాణాలు మూతబడ్డాయి. అక్కడక్కడా రోడ్లపై చెట్లు నరికి దారికి అడ్డంగా వేశారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సులను నడపనీయకుండా ప్రజలు అడ్డగించి రాస్తారోకో చేపట్టారు. వేలాది మంది చీపురు కట్టలు, కర్రలు చేతబట్టి ర్యాలీగా బయలుదేరి పోలీసు స్టేషన్ చేరుకున్నారు. వాట్సాప్‌లో వదంతులు రేపిన వ్యక్తులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అదే సమయంలో పోలీసు స్టేషన్, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. ఇందులో ముగ్గురు పోలీసులు సహా 10 మందికి గాయాలయ్యాయి. ఉద్రిక్తత పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు పోలీసులు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీ చార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. 10 నిమిషాల తర్వాత వారు మళ్లీ పోలీసు స్టేషన్ ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న తిరుచ్చి సర్కిల్ డీఐజీ లలితా లక్ష్మి సంఘటనా స్థలం చేరుకుని విచారణ జరుపుతున్నారు. 144వ సెక్షన్ అమలు:ఇలావుండగా పొన్నమరావతిలో ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టర్ అక్కడ 144వ సెక్షన్ విధించారు. -
వక్రభాష్యం
సాక్షి, సంగారెడ్డి: అన్నదాతల విషాదంతంపై అధికారులు అపహాస్యమాడుతున్నారు. రైతన్న ఆత్మహత్యలపై కట్టు కథలు అల్లుతున్నారు. ఆత్మహత్యల వెనక అన్నీ వ్యవసాయేతర కారణాలేనని వక్రభాష్యం చెప్పేస్తున్నారు. ఆర్డీఓ/సబ్ కలెక్టర్ చెర్మైన్‌గా, డీఎస్పీ, ఏడీఏలు సభ్యులుగా ఉండే విచారణ కమిటీ బాధితలను కలుసుకుని వాస్తవాలను వెలికి తీయాల్సి ఉండగా.. ఆ బాధ్యతను తహశీల్దార్లపై పడేశారు. తహశీల్దార్లు కనీసం బాధిత కుటుంబాలను సంప్రదించకుండా ఆఫీసుల్లో/ చెట్ల కింద కూర్చొని ఇష్టమొచ్చినట్లు నివేదికలు రాసేస్తున్నారు. నేతలు, బినామీలకు కోట్ల రూపాయల అక్ర మ ప్రయోజనం కలిగించడానికి ఎంతటికైనా తెగించే అధికార ‘గుణం’ రైతు ఆత్మహత్యలపై విచారణ విషయానికొచ్చేసరికి కఠినంగా వ్యవహరిస్తూ ‘సారు యమ స్ట్రిక్టు’ అనిపించుకుంటున్నారు. సదాశివపేట మండలంలో చోటు చేసుకున్న రైతు ఆత్మహత్యలపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం జరిపిన పోస్టుమార్టం ఇలాంటిదే. మండలంలో 16 మంది రైతు లు ఆత్మహత్యకు పాల్పడితే ఇద్దరి కుటుంబాలు మాత్రమే పరిహారానికి అర్హులని సిఫారసు చేశారు. మిగిలిన 14 బాధి త కుటుంబాల అర్జీలను నిర్దయగా తోసిపుచ్చారు. అప్పుల భారాన్ని మోయలేక అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడితే .. అసలవి ‘రైతు ఆత్మహత్యలే కాదు..’ అని నివేదికల్లో స్పష్టం చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులు, కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని తేల్చేశారు. ఈ ఆత్యహత్యలపై గతంలో సమర్పించిన నివేదికల సారాన్ని సంక్షిప్త నివేదిక రూపంలో సదాశివపేట తహశీల్దార్ కార్యాలయం సంగారెడ్డి ఆర్డీఓకు సమర్పించింది. మొక్కుబడిగా ఉన్న ఈ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. అందులో పేర్కొన్న అంశాలపై నిర్ధారణ కోసం కొన్ని బాధిత కుటుంబాలను వారి ఇళ్ల వద్దే కలుసుకుంది. బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడితే అధికారులెవరూ తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతే పునర్విచారణ కోసం మాత్రమే ఇటీవల వచ్చి వెళ్లారని స్పష్టం చేశారు. అధికారుల విచారణ నివేదికలతో పోల్చితే బాధిత కుటుంబాల ఆవేదనల మధ్య అసలు పొంతనే లేకుండా పోయింది. అధికారుల నివేదికలు, బాధిత కుటుంబాల గోడు మధ్య వ్యత్యాసం ఇది.. తిరస్కరించిన ఇతర కేసులు ఇవే : కొర్మాని పాపయ్య(పొట్టిపల్లి), తెనుగు సురేష్(మాచిరెడ్డిపల్లి), బర్ల శ్రీనివాస్(ముబారక్పూర్), ఎర్రగొల్ల మల్లేషం(ఆత్మకూర్), జీ అంజయ్య(చందాపూర్), వెండికోలు పద్మమ్మ(మద్దికుంట), అనసుజ(సదాశివపేట), శాంతమ్మ(సదాశివపేట), న్యాయకోటి రాజు(సదాశివపేట). జీఓ 421తో 420 ఆటలు ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు 2004 జూన్ 1న జీవో 421 జారీ అయ్యింది. బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారంతో పాటు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద అప్పులు తీర్చడానికి రూ.50 వేలను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. ఆర్డీఓ/సబ్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఎస్పీ, ఏడీఏలు సభ్యులుగా ఉండే కమిటీ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి నిర్ధారించిన తర్వాత ఈ పరిహారం మంజూరు చేయాలి. ఆత్మహత్మకు పాల్పడిన రైతు కుటుంబం ఆ విషాదం నుంచి బయటపడడానికి స్థానిక తహశీల్దార్, మండల వ్యయసాయ అధికారి సహకరించాలని బాధిత కుటుంబం భవిష్యత్తులో వ్యవసాయం ద్వారా జీవనాధారం పొందేలా అండగా ఉండాలి. అవసరమైన మేరకు పంట మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరుల్లో మార్పులను సూచించి ఆ కుటుంబ జీవనాధారాన్ని పునరుద్ధరించాలి. 421 జీవోలోని ఈ ఆదేశాలను అధికారులు విస్మరిస్తున్నారు. మొక్కుబడిగా నివేదికలు ఇచ్చి బాధిత కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు.