రెడ్మి నోట్ 5ఏ నేడే లాంచింగ్
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ నేడు మార్కెట్లోకి రాబోతుంది. రెడ్మి 4 సిరీస్ పాపులారిటీ అనంతరం రెడ్మి 5 సిరీస్‌లో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు షావోమి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్మి నోట్ 5ఏను రెండు వేరియంట్లలో నేడు షావోమి మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత వారంలోనే రెడ్మి నోట్ 5ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 21న లాంచ్ చేయనున్నట్టు షావోమి ధృవీకరించింది. ప్రస్తుతం ఇది చైనీస్ మార్కెట్లలోకి మాత్రమే ప్రవేశించబోతుంది. మరికొన్ని నెలల్లో భారత్‌లోకి వచ్చేయనుంది. గిజ్బోట్ నివేదిక ప్రకారం రెడ్మి నోట్ 5ఏ మూడు కార్డు స్లాట్స్‌ను కలిగి ఉండబోతుంది. రెండు సిమ్ కార్డు కోసం కేటాయిస్తుండగా.. మూడోది మైక్రో ఎస్డీ కార్డుకు కేటాయించనుంది.
అంచనాల ప్రకారం రెడ్మి నోట్ 5ఏ ఫీచర్లు...
5.5 అంగుళాల హెచ్డీ 720పీ డిస్ప్లే
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్
బేసిక్ మోడల్ : క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ఎస్ఓసీ
2జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
16 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
టాప్ మోడల్ : ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 435 ఎస్ఓసీ
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
రెండు వైపుల 16 ఎంపీ సెన్సార్స్