‘వాణిజ్య’ మనీ ల్యాండరింగ్పై సిట్ కన్ను!
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి మనీ ల్యాండరింగ్ (విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించడం, తీసుకురావడం)కు పాల్పడుతున్న ఘటనలపైనా సుప్రీం కోర్టు నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి పెట్టింది.
త్వరలో జరిగే సిట్ భేటీలో ఈ అంశంపై చర్చించి, చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
హాంకాంగ్ కేంద్రంగా ఎగుమతులు, దిగుమతుల పేరిట తప్పుడు, నకిలీ పత్రాలను తయారుచేసి భారీగా సొమ్మును విదేశాలకు పంపడం, స్వదేశానికి తీసుకురావడం జరుగుతున్నట్లు డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుర్తించింది.