Y S Vijayamma
-
‘ఉత్తమ్’ ఎత్తులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుప్పి గంతులు చూస్తుంటే నవ్వొస్తోంది. ఎవరి కార్యక్రమాలకైనా జనాన్ని రాకుండా అడ్డుకోగలిగినా, వారి గుండెల్లో ఉండే అభిమానాన్ని దూరం చేయగలుగుతారా’... ఇది ఓ కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్య. హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో గురువారం జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్ నానా తిప్పలు పడుతున్నారు. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను, ఇతర వర్గాలప్రజలను రెచ్చగొడుతున్నారు. విజయమ్మను చూసేందుకు, కలిసేందుకు నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి మండలాల నుంచి మేళ్లచెర్వుకు తరలివెళ్లేందుకు కార్యకర్తలు, ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, వీరెవరికీ వాహనాలు అద్దెకు ఇవ్వొద్దని ట్యాక్సీ ఓనర్లు, ఆటో యూనియన్ నాయకులను పోలీస్స్టేషన్లకు పిలిపించి మరీ బెదిరించారు. ఈ వ్యవహారాలను గమనించిన కాంగ్రెస్‌కే చెందిన ఓ నాయకుడు చేసిన పై వ్యాఖ్య నిజమేననిపిస్తోంది. హుజూర్నగర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్.. విజయమ్మ పర్యటనను రాజకీయ కోణంలో చూస్తూ, వ్యక్తిగత ఎజెండాతోనే ఈ వ్యవహారమంతా నడుపుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో తన ఆధిపత్యానికి ఎవరైనా అడ్డుతగులుతున్నారని అనిపిస్తే వారిని ఏదో విధంగా భయపెట్టడం, లొంగదీసుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నాడన్న విమర్శలూ లేకపోలేదు. కోదాడ ఎమ్మెల్యే, ఇతర అన్ని పార్టీల నాయకులు కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఉత్తమ్ వేధింపులపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇపుడు హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వస్తున్న తమ నాయకురాలిని అడ్డుకోవాలని చూడడం ఆయన రాజకీయ ఎజెండాలో భాగమేనని వైఎస్సార్ సీపీ వర్గాలు దుయ్యబట్టాయి. ‘మంత్రి స్థాయిలో ఉండి, ఆయన మరీ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. చివరకు ట్రాక్టర్లు ఉన్న ఓనర్లూ బెదిరించారు. ఇదేం సంస్కృతి’.. అని గరిడేపల్లి మండలానికి చెందిన వైఎస్సార్ నాయకులు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తనకు వైఎస్సార్ సీపీ నుంచి గట్టిపోటీ ఉంటుందన్న ఆందోళనతోనే ఇలా, పార్టీ ముఖ్యనాయకుల కార్యక్రమాలను అడ్డుకునేలా కుట్రలు పన్నుతున్నాడని, దా నికి తెలంగాణ అంటూ ముసుగు కప్పుతున్నాడని మరికొందరు పేర్కొన్నారు. అసలు తెలంగాణకు అనుకూలంగా ఏనాడూ మాట్లాడని మంత్రి, ఇపుడు కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించగానే తెలంగాణ అంటూ ప్రేమ ఒలకబోస్తున్నాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆయన కావాలనే కొందరు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుకుని బలవంతంగా వారితో ప్రెస్మీట్లు పెట్టించి మాట్లాడించారని కూడా ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో పాతిక మందిదాకా సీమాంధ్ర మంత్రులతోనే నిత్యం పర్యటనలు పెట్టించిన మంత్రి ఉత్తమ్‌కు విజయమ్మను అడ్డుకోవాలని పిలుపునిచ్చే నైతిక హక్కు ఎక్కడిదని వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. మొత్తానికి మంత్రి ఉత్తమ్ కేవలం తన వ్యక్తిగత ఎజెండాతో, లేనిపోని ప్రకటనలతో రెచ్చగొడుతూ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారన్న విమర్శలు బాగా వ్యక్తమయ్యాయి. -
నేడు వైఎస్ విజయమ్మ పర్యటన
హుజూర్నగర్ : తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువులో పర్యటించనున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలలో ఒకేరోజు 28 సెం.మీ. అత్యధిక వర్షపాతం మేళ్లచెరువు మండలంలో నమోదైంది. మండలవ్యాప్తంగా 17వేల ఎకరాలలో పత్తి, 2500 ఎకరాలలో మిర్చిపంట దెబ్బతింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు వర్షాలకు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ విజయమ్మ రైతులను పరామర్శించి వారిలో మనోధైర్యం కల్పించడంతోపాటు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించేందుకు ఈ పర్యటనకు వస్తున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన నుంచి నేరుగా కోదాడ మీదుగా వయా రామాపురం క్రాస్‌రోడ్డు నుంచి నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలం యతిరాజపురంతండాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. దొండపాడు వద్ద కూడా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. అక్కడ నుంచి మేళ్లచెరువు మండల కేంద్రానికి చేరుకొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం హుజూర్నగర్ మీదుగా హైదరాబాద్‌కు వెళతారు. -
పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: వైఎస్ విజయమ్మ
-
పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: వైఎస్ విజయమ్మ
భారీ వర్షాల కారణంగా పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. బుధవారం వైఎస్ విజయమ్మ విజయనగరం జిల్లాలో ముంపునకు గురైన పూసపాటిరేగ మండలం కొవ్వాడ, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆమె పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె మట్లాడుతూ... పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు..ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలి ఆమె డిమాండ్ చేశారు. రైతుల తరపున అసెంబ్లీలో పోరాడతామన్నారు. అలాగే రైతులందరు ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తిని సంగతిని ఈ సందర్బంగా వైఎస్ విజయమ్మ రైతులకు వెల్లడించారు. కోర్టు అనుమతిస్తే వైఎస్ జగన్ నేరుగా వచ్చి రైతులను పరామర్శిస్తారని ఆమె తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారందరికి పక్కా ఇళ్లు కట్టిస్తారని ఆమె బాధితులకు భరోసా ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం నిరంతరం శ్రమించారని వైఎస్ విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు.వైఎస్ జగన్ కూడా ఆ మహానేత మార్గంలోనే నడిచి ఆయన స్వప్నాలను సాకారం చేస్తారని చెప్పారు. -
సమైక్య చైతన్యం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ప్రజా చైతన్యం వెల్లువెత్తుతోంది. రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు దీక్ష కొనసాగిస్తున్నారు. సోమవారం కర్నూలులోని కృష్ణదేవరాయల సర్కిల్లో మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశాయి. వేలాది మందితో కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, చౌక దుకాణాల డీలర్లు, విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా ట్రెజరీ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. కర్నూలు రజక సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్లో బట్టలు ఉతికి నిరసన తెలిపారు. ఆ తర్వాత రిలే దీక్షలు చేపట్టారు. వివిధ ప్రజా సంఘాలు రాష్ట్ర విభజనను నిరసిస్తూ ర్యాలీలు నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి వేషధారణ ఆకట్టుకుంది. నంద్యాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. డోన్‌లో వైఎస్ఆర్సీపీ నాయకులు సమైక్యాంధ్రపై గడపగడపకు వెళ్లి ప్రజల్లో చైతాన్యం తీసుకొస్తున్నారు. సీమ గర్జన పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక విద్యార్థి, ప్రజా సంఘాలు 5వేల మందితో ర్యాలీ నిర్వహించారు. కోడుమూరులో జర్నలిస్టులు, సమైక్యాంద్ర నినాదాలతో హోరెత్తించారు. ఆళ్లగడ్డలో ముస్లిం మైనార్టీ నాయకులు, జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని మెయిన్‌బజార్ నుంచి పాతబస్టాండ్ మీదుగా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. పత్తికొండలో సమైకాంధ్రకు మద్దతుగా జూనియర్ కళాశాల, జిల్లా ఉన్నత పరిషత్ విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, కార్మిల్ సోసైటీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీ చేసి ప్రధాన రోడ్డుపై కబడ్డీ ఆడారు. వైఎస్.విజయమ్మ దీక్షకు మద్దతుగా పత్తికొండలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్యయకర్త కోట్ల హరి చక్రపాణి రెడ్డితో పాటు మరో 9 మంది దీక్షలో కూర్చొన్నారు. ఎమ్మిగనూరులో బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో పురోహితులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప సర్కిల్లో హోమంను నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు చేపట్టిన రిలే దీక్షలకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కోడలు నిరుపమ పూలమాలలు వేసి మద్దతు పలికారు. ఆత్మకూరులోనూ వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి.