yadagirigutta lakshmi narasimha swamy
-
యాదగిరిగుట్ట క్షేత్రంలో వైభవంగా గిరిప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ విమానగోపుర మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈనెల 19 నుంచి 23 వరకు జరిగే మహాక్రతువుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండురోజుల్లో ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులు పూర్తికానున్నాయి. 108 మంది రుత్విక్కులతో పూజలు నిర్వహిస్తారు. దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెస్తున్నారు. ఇందుకోసం కొండపైన హోమగుండాలు కూడా సిద్ధమవుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణకు ఈనెల 23న జరిగే మహా కుంభాభిషేకం జరుగుతుంది. ఉదయం 11.34 గంటలకు నిర్ణయించిన ముహూర్తంలో ఈకార్యక్రమం జరుగుతుంది. పీఠాధిపతి వానమామలై రామానుజ జియర్‌స్వామి పర్యవేక్షణలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. కొండపైన ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు. 19 నుంచి 22 వరకు 108 మంది రుత్విక్కులతో సుదర్శన హోమం, నారసింహ హోమం నిర్వహిస్తారు. రామాయణ, భారత, భాగవత కథలను పారాయణం చేస్తారు.ప్రత్యేక వసతులు, ఏర్పాట్లు... మహాకుంభ సంప్రోక్షణకు దేశం నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేసి ఇందుకోసం ప్రత్యేక వసతులు, ఏర్పాటు చేస్తున్నారు. 23న సుమారు లక్షమంది భక్తులకు పులిహోర ప్రసాదం ఉచితంగా అందించేందుకు దేవస్థానం నిర్ణయించింది. మహాకుంభ సంప్రోక్షణతోపాటు మార్చి1 నుంచిప్రారంభమయ్యే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచార కార్యకమంలో భాగంగా దేవస్థానం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఆలేరు, భువనగిరి, శంషాబాద్, మహరాష్ట్రలోని షోలాపూర్‌లో స్వాగత తోరణాలు ఏర్పాటు ఏర్పాటు చేస్తోంది. శ్రీస్వామివారి విమాన గోపురం బంగారు తాపడం పనులకు దేవస్థానం 68కిలోల బంగారం వాడుతుంది. ç50.5 ఫీట్ల పంచతల రాజగోపురానికి చుట్టుమొత్తం10,759 చదరపు అడుగల మేర స్వర్ణతాపడం పనులు చేపట్టారు. దేవాలయం పునర్నిర్మాణంప్రారంభించినపుడే విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. ముందుగా11వేల కిలోల రాగితో రేకులను తయారు చేశారు. ఒక చదరపు అడుగు రేకుకు 6 గ్రాముల బంగారం ఖర్చు చేస్తున్నారు. ఐదు యజ్ఞకుండాలు: కొండపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు హోమ కుండాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దకుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమగుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మి హవన హోమాలు చేస్తారు. చివరి రోజైన ఈనెల 23న విమాన రాజగోపురానికి 25 కలశాలతో అభిషేకం, మూలమూర్తి హవనం చేస్తారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి విమాన గోపురానికిప్రాణం ΄ోస్తారు. ఇందులో 108 మంది పారాయణదార్లు పాల్గొంటారు. వివి«ద్ర పాంతాలనుంచి రుత్వికులు వస్తారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.మహాకుంభాభిషేక, సంప్రోక్షణ వివరాలు19వ తేదీ బుధవారం: ఉదయం గం. 7.45కు భగవద్ అనుజ్ఞ స్వస్తి వాచన, శ్రీ విశ్వక్సేనారాధాన, పుణ్యాఃవాచన, రక్షాబంధన, బుత్విగ్వరణం, మృత్సంగ్రహణ, పర్యగ్నీకరణ, తిరువీధి సేవ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధనతో ఆరంభం అవుతాయి. సాయంత్రం 6:00 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు వారణానువాక హోమం, జలాధివాసం, నిత్యపూర్ణాహుతి, నివేదన, తీర్ధప్రసాద గోష్ఠి, తిరువీధి సేవ, ఆలయంలోకి వేంచేపు జరుగుతాయి. గురు, శుక్ర వారాలలో వివిధ కార్యక్రమాల అనంతరం 22 వ తేదీ శనివారం తిరువీధిసేవ,చతుస్థానార్చన, విమాన అధిష్టాన పరివార విశేష హోమం, ఏకాశీతి కలశ స్నపనం, మూల మంత్రమూర్తి మంత్ర హావనం, నిత్యపూర్ణాహుతి నివేదన, నీరాజన మంత్ర పుష్పం, శాత్తుమరై, సాయంత్రం 6:00 గంటలకు నిత్య పూర్ణాహుతి నివేదన, తీర్ధ ప్రసాద గోష్ఠి తిరువీధి సేవ ఆలయంలోకి వేంచేపుతో ముగుస్తాయి. ఈనెల 19 నుంచి 23 వరకు పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం జరిపి దివ్యవిమాన గోపురాన్ని శ్రీ స్వామివారికి అంకితం చేస్తారు. 23వ తేది ఉదయం 11.54 గంటలకు స్వర్ణవిమానగోపురానికి కుంభాభిషేకం చేస్తారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యవిమానం బంగారు తాపడంలో 40 రకాల విగ్రహాలు బంగారు పూతతో చెక్కారు. విమాన గోపురంపై బంగారు రేకులపై పంచనారసింహ క్షేత్రంలో స్వామివారి వివిధ రూపాలను చెక్కారు. శ్రీవిష్ణుమూర్తి దశావతారాలు, నర్సింహస్వామి వారి వివిధ రూపాలను వివిధ ఎత్తులతో చెక్కారు. అలాగే స్వామివారి గరుడ విగ్రహాలు నాలుగు, సింహాలు 8 ఇలా మొత్తం స్వర్ణతాపడంపై ΄÷ందుపరిచారు. కాగా దేశంలోనే అతి పెద్ద స్వర్ణ విమాన గోపురంగా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారి విమానగోపురంతోపాటు ఆలయంపై ఉన్న 39 కలశాలకు కూడా బంగారు తాపడం చేశారు. ఈ సందర్భంగా రోజూ 2000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తారు.ఏర్పాట్లు పూర్తిశ్రీ లక్ష్మి నర్సింహస్వామి దేవాలయం విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి అయ్యాయి. దేవస్థానం పీఠాధిపతి పర్యవేక్షణలో మహాకుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 108 మంది రుత్విక్కులు ప్రత్యేక పూజలు చేస్తారు. హోమగుండాలు ఏర్పాటు చేశాం. రామాయణ, మహాభారత, భాగవత ప్రబంధాల ప్రవచనాలు పారాయణ చేస్తారు. భక్తుల వసతుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏ. భాస్కర్‌రావు,దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి, యాదగిరిగుట్ట– యంబ నర్సింహులు,సాక్షి ప్రతినిధి, యాదాద్రి. -
Yadagirigutta : వైభవంగా సాగుతున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
Yadagirigutta : జగన్మోహిని అవతారంలో నారసింహుడు (ఫొటోలు)
-
యాదాద్రి : మత్స్య అవతారంలో దర్శనమిచ్చిన నరసింహస్వామి (ఫొటోలు)
-
విద్యుద్దీపాల వెలుగులతో యాదాద్రి క్షేత్రం.. (ఫొటోలు)
-
కనుల పండువగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
-
మత్స్యావతారం పుష్పాలంకృతం
-
యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-
యాదగిరిగుట్ట : కల్యాణ వైభోగమే
-
దివ్య..యాదాద్రి
యాదగిరికొండను సందర్శించిన వైటీడీఏ బృందం ఆలయ పరిసరాల పరిశీలన చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధ్యయనం యాదగిరికొండ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం వైటీడీఏ అధికారులు సందర్శించారు. ఈ సదర్భంగా వారు ఆలయ పరిసరాల్లో కలి యతిరిగారు. సంగీత భవనం, విష్ణు పుష్కరిణి, శ్రీచక్రకాంప్లెక్స్, గర్భాలయం, దక్షిణ ప్రాకార మండపం తదితర ప్రాంతాలను పరిశీలించి చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులపై అధ్యయం చేశారు. కొండపై చేపట్టనున్న పనులుకొండపైన గల 14 ఎకరాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ 20 అంశాలతో కూడిన ప్రణాళిక ఇచ్చారని వైటీడీఏ వైఎస్ చెర్మైన్ తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆయన ఆండాలు నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండపై చేపట్టనున్న పనుల వివరాలను వెల్లడించారు. తొలుత గర్భాలయం చుట్టూ 5 ఎకరాల స్థలంలో తిరుమాడ వీధులు, ఆలయ ప్రాకారం నిర్మించిన తర్వాత విష్ణు పుష్కరిణిని విశాలంగా తయారు చేస్తామన్నారు. ఆలయాన్ని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకుండా చుట్టూ ఉన్న గోడలను తీసివేసి వాటిస్థానంలో రాతి కట్టడాలను నిర్మిస్తామని చెప్పారు. కొండపైన వీఐపీలు, భక్తులకు సంబంధించి 7వేల కార్లు నిలిపేవిధంగా పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా వీఐపీలకు గెస్టు హౌస్‌లు, మూడున్నర ఎకరాలలో భక్తుల సౌకర్యార్థం గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. భక్తులు కొండపైన బస్సు దిగిన వెంటనే ముందుగా ఆలయానికి రావడానికి ముందుగా మొక్కులు చెల్లించుకుని తలనీలాలు తీయించుకునే వారికోసం కల్యాణ కట్టలోకి వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని, అక్కడి నుంచి నేరుగా క్యూలైన్లలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు, కల్యాణ కట్ట భవనం కింది భాగంలో అన్నదానం ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షమంది పట్టే విధంగా కల్యాణ మండపం, ఈశాన్య లేదా ఆగ్నేయ దిశలో రథ మండపం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొండకింద భాగంలో గిరి ప్రదక్షిణం చేసే వారికోసం ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్, వివాహాల కోసం కల్యాణ మండపాలను కొండకింద నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా గుట్టకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి అందులో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని, రాయగిరి కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజి గోపాల్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్కిటెక్టు అధికారులు, ఆనంద్‌సాయి, రాజు, దేవస్థానం చెర్మైన్ నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆర్అండ్బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పది రోజుల్లో పనులు ప్రారంభం యాదగిరికొండపై చేపట్టనున్న అభివృద్ధి పనులన్నీ మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మూడు సంవత్సరాలలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ధృడ సంకల్పంతో ఉన్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. -
ఇక.. చకచకా
యాదగిరికొండ/యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. బుధవారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అదే విధంగా ఆలయ బృహత్ ప్రణాళిక కోసం వేసిన రెండు కమిటీలు (కిషన్‌రావుతో కూడిన కమిటీ, స్థల సేకరణకు మరో కమిటీ) చకచకా పనులు పూర్తి చేస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ పూర్తి చేసుకుని ఆలయానికి సంబంధించిన ప్రణాళికతో ఆర్కిటెక్టులు, స్థపతులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరో వారం, పది రోజుల్లో ఆర్అండ్బీ శాఖ నాలుగు లేన్ల రోడ్డు పనులు ప్రారంభించనుంది. ఎవరిపనులను వారికి అప్పగించిన సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ దాదాపు పూర్తయ్యింది. దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం కోసం ఆర్కిటెక్ట్‌లు, స్థపతులు, వైటీడీఏ అధికారులు వేచి చూస్తున్నారు. ఆలయాన్ని పూర్తి విశాలంగా చేయాలని సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెలుస్తోంది. అటానమస్‌తో పెరగనున్న ఆదాయం గుట్ట దేవస్థానం త్వరలో అటానమస్‌గా చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచా రం. దీంతో ఆలయ రూపురేఖలు మారిపోతాయని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గుట్ట దేవస్థానం ఆదాయం ప్రతి యేటా సుమారు 100 కోట్లు వస్తోంది. అటానమస్‌గా చేసి అభివృద్ధి పరిస్తే రూ. 500 కోట్ల ఆదాయం సమకూరుతుం దని నిపుణులు చెబుతున్నారు. భక్తులకు వసతి సౌకర్యాలు పెరగడంతోపాటు వసతి గదులు, దు కాణాలు, అర్చనలు, అభిషేకా లు, నిత్యకల్యాణాలు, దర్శనాలు వీటి ద్వా రా ఆదాయం చాలా వరకు పెరుగుతుందని దేవస్థానం అధికారుల సైతం చెబుతున్నారు. మొదటి రోజు రిజిస్ట్రేషన్లు.. యాదగిరిగుట్ట అభివృద్ధికి 2 వేల ఎకరాల భూసేకరణలో భాగంగా మొదటి దశ ఓ కొలిక్కి ఇచ్చింది. బుధవారం కొందరి రైతుల నుంచి వైటీడీఏ(యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంది. వైటీడీఏ కార్యదర్శి, డిప్యూటీ కలెక్టర్ ఎం.రమేశ్‌రెడ్డి, భువనగిరి ఆర్డీఓ మధుసూదన్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ఉదయాన్నే యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. గుండ్లపల్లి రెవెన్యూ కిందికి వచ్చే డాక్టర్ రచ్చ యాదగిరి, రచ్చ సురేష్, రచ్చ శ్రీనివాస్ కుటుంబానికి చెందిన 15ఎకరాల పదమూడున్నర గుంటల భూమికి సం బంధించిన మొట్టమొదటి డాక్యుమెంట్‌ను పరిశీలించారు. అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రచ్చ యాదగిరి కుటుంబ సభ్యులు, వైటీడీఏ కార్యదర్శి రమేశ్ రెడ్డి సంతకాలు చేశారు. బుధవారం మొత్తంగా గుండ్లపల్లికి చెందిన 16 మంది రైతులు, దాతర్‌పల్లికి చెందిన ఇద్దరి రైతులనుంచి 80 ఎకరాల ముప్పయిఐదున్నర గుంటల భూమిని వైటీడీఏకు రిజిస్ట్రేషన్ చేశారు. సంబంధిత రైతులకు నష్టపరిహారం కింద 8 కోట్ల 37లక్షల రూపాయలు చెల్లించారు. కాగా, మరో 50 ఎకరాలు రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని, వివాదం లేని 28 ఎకరాలు, 19 ఎకరాలు అసైన్మెంట్ భూమి, మరో 50 ఎకరాలు మొత్తం 157 ఎకరాల భూమిని రెండురోజుల్లో కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఇక వేగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదటి దశలో దాతర్పల్లి, గుండ్లపల్లి గ్రామాల నుంచి అంగీకరించిన రైతులతో భూములను రిజి స్ట్రేషన్ చేసుకునేందుకు భూ సేకరణ కమిటీ, వైటీడీఏ ప్రణాళిక రూపొందించాయి. మొదటి దశలో దాతర్పల్లి గ్రామంలో 127 ఎకరాలు, గుండ్లపల్లి గ్రామంలో 192 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోనుంది. ఎట్టిపరిస్థితుల్లో 300 ఎకరాలు రైతుల నుంచి త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం 33 డాక్యుమెంట్లు సిద్ధం చేశారు. సంబంధిత రైతులకు వెంటనే నష్టపరిహారం నగదు కూడా అందజేయనున్నారు. వాయిదా పడుతూ వచ్చినా ... భూ సేకరణ కమిటీ అధికారులు రెండు వారాల క్రితం గుట్టలో విస్తృతంగా మలిదశ చర్చలు జరిపార. గుండ్లపల్లికి చెందిన 35 మంది రైతులు, దాతర్‌పల్లికి చెందిన 15 మంది రైతులతో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. వీరిలో 20 మంది వరకు రైతులు దేవస్థానం అభివృద్దికి తమ భూ ములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. వీరిలో కొందరు దేవస్థానం అభివృద్ధికి తమ భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. వారి భూములను వైటీడీఏకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వారం రోజులుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా, వివిధ కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. రెండు రోజుల క్రితం డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం.రమేశ్‌రెడ్డిని వైటీడీఏకు కార్యదర్శిగా నియమించడంతో రిజిస్ట్రేషన్ల కార్యక్రమం ప్రారంభమైంది.