యాదగిరికొండను సందర్శించిన
వైటీడీఏ బృందం
ఆలయ పరిసరాల పరిశీలన
చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై
అధ్యయనం
యాదగిరికొండ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం వైటీడీఏ అధికారులు సందర్శించారు. ఈ సదర్భంగా వారు ఆలయ పరిసరాల్లో కలి యతిరిగారు. సంగీత భవనం, విష్ణు పుష్కరిణి, శ్రీచక్రకాంప్లెక్స్, గర్భాలయం, దక్షిణ ప్రాకార మండపం తదితర ప్రాంతాలను పరిశీలించి చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులపై అధ్యయం చేశారు. కొండపై చేపట్టనున్న పనులుకొండపైన గల 14 ఎకరాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ 20 అంశాలతో కూడిన ప్రణాళిక ఇచ్చారని వైటీడీఏ వైఎస్ చెర్మైన్ తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆయన ఆండాలు నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండపై చేపట్టనున్న పనుల వివరాలను వెల్లడించారు. తొలుత గర్భాలయం చుట్టూ 5 ఎకరాల స్థలంలో తిరుమాడ వీధులు, ఆలయ ప్రాకారం నిర్మించిన తర్వాత విష్ణు పుష్కరిణిని విశాలంగా తయారు చేస్తామన్నారు.
ఆలయాన్ని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకుండా చుట్టూ ఉన్న గోడలను తీసివేసి వాటిస్థానంలో రాతి కట్టడాలను నిర్మిస్తామని చెప్పారు. కొండపైన వీఐపీలు, భక్తులకు సంబంధించి 7వేల కార్లు నిలిపేవిధంగా పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా వీఐపీలకు గెస్టు హౌస్‌లు, మూడున్నర ఎకరాలలో భక్తుల సౌకర్యార్థం గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. భక్తులు కొండపైన బస్సు దిగిన వెంటనే ముందుగా ఆలయానికి రావడానికి ముందుగా మొక్కులు చెల్లించుకుని తలనీలాలు తీయించుకునే వారికోసం కల్యాణ కట్టలోకి వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని, అక్కడి నుంచి నేరుగా క్యూలైన్లలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు, కల్యాణ కట్ట భవనం కింది భాగంలో అన్నదానం ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
లక్షమంది పట్టే విధంగా కల్యాణ మండపం, ఈశాన్య లేదా ఆగ్నేయ దిశలో రథ మండపం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొండకింద భాగంలో గిరి ప్రదక్షిణం చేసే వారికోసం ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్, వివాహాల కోసం కల్యాణ మండపాలను కొండకింద నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా గుట్టకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి అందులో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని, రాయగిరి కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజి గోపాల్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్కిటెక్టు అధికారులు, ఆనంద్‌సాయి, రాజు, దేవస్థానం చెర్మైన్ నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పది రోజుల్లో పనులు ప్రారంభం
యాదగిరికొండపై చేపట్టనున్న అభివృద్ధి పనులన్నీ మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మూడు సంవత్సరాలలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ధృడ సంకల్పంతో ఉన్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు.
దివ్య..యాదాద్రి
Published Sat, Jul 18 2015 12:54 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement