yanadayya
-
చరిత్రలో తొలిసారి నాయీ బ్రాహ్మణులకు టీటీడీ బోర్డులో చోటు
కడప కార్పొరేషన్: సీఎం వైఎస్ జగన్‌కి నాయీ బ్రాహ్మణులు ఆజన్మాంతం రుణపడి ఉంటారని ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు సిద్దవటం యానాదయ్య అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక హెడ్‌పోస్టాఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యానాదయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా టీటీడీ పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు అవమానం.. నేడు అందలం
తిరుపతి తుడా: గతంలో చంద్రబాబు తీరుతో నాయిబ్రాహ్మణులు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారని నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ సిద్దవటం యానాదయ్య చెప్పారు. అవమానాలన్నీ దిగమింగి జగనన్నను సీఎంగా గెలిపించుకోవడంతో ఇప్పుడు గౌరవ ప్రదమైన స్థానంలో నిలిపారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా సుందరయ్యనగర్‌లో బుధవారం నాయిబ్రాహ్మణులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని తీర్మానించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ నేత చిమటా రమేష్, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తొండమల్ల పుల్లయ్య, కుల సంఘాల నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యానాదయ్య మాట్లాడుతూ తిరుమలలో పీస్ రేట్‌పై పనిచేసే 241 క్షురకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారని, జగనన్న తోడు పథకం ద్వారా క్షురకులకు రూ.10 వేల చొప్పున రూ.58 కోట్లు, దేవాలయాల్లో పనిచేసే మంగళ వాయిద్యకారులకు గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచిన విషయాన్ని ప్రస్థావించారు. నాయిబ్రాహ్మణుల రాజకీయ ఎదుగుదలకు ఇప్పుడే అడుగులు పడ్డాయని.. భవిష్యత్తులో నాయిబ్రాహ్మణులకు మరింత ప్రాధాన్యం పెరగాలంటే జగనన్న వెంట నడవాలని యానాదయ్య పిలుపునిచ్చారు. నాయిబ్రాహ్మణులంతా మూకుమ్మడిగా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేస్తున్నట్టు ఈ సందర్భంగా వారు మీడియాతో చెప్పారు. -
‘ద్వంద్వ నీతి పాటిస్తున్న టీటీడీ అధికారులు’
సాక్షి, చిత్తూరు : టీటీడీ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారినే ప్రోత్సహిస్తోందని నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు యానాదయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీడీ అధికారులు ద్వంద్వ నీతి పాటిస్తున్నారని ఆరోపించారు. 2016లో తిరుమల కల్యాణకట్టలో నిరసన తెలిపిన వారిని సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు శ్రీవారి ఆలయంలో నిరసన తెలిపిన అర్చకులపై ఎందుకు చర్యలు తీసుకోరని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. మొదట్లో ఆలయంలో నిరసన తెలపాలని అధికారులే ప్రోత్సహించారన్నారు. క్షురకులకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటూ అధికారులపై మండిపడ్డారు. అధికారుల్లో నిజాయితీ ఉంటే శ్రీవారి ఆలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
బీసీ జాబితాలో ఇతరులను చేర్చొద్దు
కడప రూరల్: అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీ వర్గాల్లో ఇతరులను చేర్చడానికి సాగుతున్న కుట్రలను అడ్డుకుంటామని ఏపీ బీసీ ఐక్య కార్యరణ కమిటీ తెలి పింది. ఇందుకు నిరసనగా బీసీ కమిషన్‌కు లక్ష వినతిపత్రాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపా రు. ఆ మేరకు శుక్రవారం వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆ కమిటీ నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ రాష్ట్ర కన్వీనర్ యానాదయ్య, జిల్లా చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, బీసీ మహాసభ రాష్ట్ర కన్వీనర్ అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల జాబితాలో దాదాపు 60 కులాలను చేర్చాలనే కుట్ర సాగుతోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా అభ్యం తరాలతో కమిటీ చైర్మన్ అన్నా రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఈనెల 29, 30, 31 తేదీలలో లక్ష వినతిపత్రాల సేకరణ ద్వారా బీసీ కమిషన్‌తోపాటు ప్రభుత్వానికి ఆ పత్రాలను సమర్పిస్తామన్నారు. బీసీ రిజ ర్వేషన్లను జనాభా ప్రకారం పెంచి వాటి ఫలాలను తమకే దక్కేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బలరామయ్య, శ్రీనివాసులు, ఏకే బాషా, ఖాదర్‌బాషా, రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.