సాక్షి, చిత్తూరు : టీటీడీ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారినే ప్రోత్సహిస్తోందని నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు యానాదయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీడీ అధికారులు ద్వంద్వ నీతి పాటిస్తున్నారని ఆరోపించారు. 2016లో తిరుమల కల్యాణకట్టలో నిరసన తెలిపిన వారిని సస్పెండ్ చేశారని గుర్తుచేశారు.
అయితే ఇప్పుడు శ్రీవారి ఆలయంలో నిరసన తెలిపిన అర్చకులపై ఎందుకు చర్యలు తీసుకోరని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. మొదట్లో ఆలయంలో నిరసన తెలపాలని అధికారులే ప్రోత్సహించారన్నారు. క్షురకులకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటూ అధికారులపై మండిపడ్డారు.
అధికారుల్లో నిజాయితీ ఉంటే శ్రీవారి ఆలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment