బీసీ జాబితాలో ఇతరులను చేర్చొద్దు
కడప రూరల్: అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీ వర్గాల్లో ఇతరులను చేర్చడానికి సాగుతున్న కుట్రలను అడ్డుకుంటామని ఏపీ బీసీ ఐక్య కార్యరణ కమిటీ తెలి పింది. ఇందుకు నిరసనగా బీసీ కమిషన్‌కు లక్ష వినతిపత్రాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపా రు. ఆ మేరకు శుక్రవారం వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆ కమిటీ నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ రాష్ట్ర కన్వీనర్ యానాదయ్య, జిల్లా చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, బీసీ మహాసభ రాష్ట్ర కన్వీనర్ అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల జాబితాలో దాదాపు 60 కులాలను చేర్చాలనే కుట్ర సాగుతోందని ఆరోపించారు.
దీనికి వ్యతిరేకంగా అభ్యం తరాలతో కమిటీ చైర్మన్ అన్నా రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఈనెల 29, 30, 31 తేదీలలో లక్ష వినతిపత్రాల సేకరణ ద్వారా బీసీ కమిషన్‌తోపాటు ప్రభుత్వానికి ఆ పత్రాలను సమర్పిస్తామన్నారు. బీసీ రిజ ర్వేషన్లను జనాభా ప్రకారం పెంచి వాటి ఫలాలను తమకే దక్కేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బలరామయ్య, శ్రీనివాసులు, ఏకే బాషా, ఖాదర్‌బాషా, రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.