వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితం
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద బుధవారం వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవ్వరు గాయపడలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులందరిని రక్షించారు. వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వోల్వో బస్సును రహదారిపై నుంచి పక్కకు తప్పించారు. ప్రయాణికులు మరో బస్సులో తమ తమ గమ్యస్థానాలకు పయనమవుతున్నారు.