yellampalli
-
‘ఎల్లంపల్లి’ ఎత్తిపాయె!
ప్రాజెక్టు రిపోర్టు ►జలాశయం పూర్తయినా నెరవేరని లక్ష్యం ►సాగునీటికి ఎదురుచూస్తున్న 17 మండలాలు ►లక్ష్యానికి దూరంగా లక్ష ఎకరాలకు సాగునీరు ►పావలా వంతు ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి లేదు ►4,364 ఎకరాల భూసేకరణే అసలు సమస్య.. ►ప్రధాన కాల్వలు, ఉప కాల్వల పనులకు బ్రేక్ ఈ లక్ష్యం ఎప్పటికి నెరవేరేను? ►1,65,700 ఎకరాలు ఎల్లంపల్లి కింద ఉమ్మడి కరీంనగర్‌లోని చొప్పదండి, వేముల వాడ, కరీంనగర్, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, నియోజక వర్గాల్లోని 1,65,700 ఎకరాలకు నీరివ్వాలనేది లక్ష్యం. ఈ ఏడాదీ నీరందేది కష్టమే! ►17మండలాలు, 171 గ్రామాలు ఈ ప్రాజెక్టు నీటి కోసం తీవ్ర వర్షాభావ ప్రాంతాలుగా గుర్తిం చిన 17 మండలాల పరిధిలోని 171 గ్రామాల ప్రజలు ఎదు రుచూస్తున్నారు. ఈ ఏడాది కూడా నీరందించే పరిస్థితి లేదు. భూ సేకరణ.. ఇంకా పూర్తి కాలేదు.. ►24,591 ఎకరాలు రిజర్వాయర్ సాగు నీటికి కావాల్సిన నిర్మాణానికి 24,591 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 20,227 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇంకా 4,364 ఎకరాలకుపైగా సేకరించాలి. మొదట దశ లక్ష్యం మాత్రం పూర్తి..! ► 24,980 ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో 24,980 ఆయకట్టుకు నీరందుతోంది. మంథని మంచినీటి పథకానికి 2 టీఎంసీలు, ఎన్టీపీసీకి 6.50 టీఎంసీల నీటిని దీని ద్వారా ఇస్తున్నారు. ప్రతిపాదిత ఆయకట్టు 1,65,700 ఎకరాలకు నీరందించాలంటే ఇంకా 4,364 ఎకరాలు భూసేకరణ చేపట్టా ల్సి ఉంది. ఇందులో పైపులైన్లు, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువల నిర్మాణం చేపట్టాలి. ఇందులో ఎక్కువ శాతం పూర్తి వర్షాభావ మండలాలైన వేముల వాడ, చందుర్తి, కోనరావుపేటలోనే ఎక్కువ భూమి సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ధరలకు, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసంతో పలు ప్రాంతాల్లో రైతుల తమ భూములను ఇచ్చేం దుకు విముఖత చూపుతున్నారు. దీంతో భూసేకరణ చివరి నిమి షంలో కత్తిమీద సాములా మారగా, సత్వరమే ప్రధాన, ఉప కాల్వలను పూర్తి చేసి నీరందించాలనిరైతులు కోరుతున్నారు. పంపుహౌస్ లు, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూట రీలో, మైనర్ కాలువల నిర్మాణానికి భూ సేకరణ సమస్యగా తయారైంది. మొదటి దశలో.. 24,980 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడం తోపాటు మంథని మంచినీటి పథకానికి రెండు టీఎంసీలు, ఎన్టీపీసీకి 6.50 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు. రెండో దశలో.. రెండో దశపైనే రైతులు ఆశలు పెట్టుకు న్నారు. సజావుగా భూ సేకరణ పూర్తయి ఉంటే ఇప్పటికే నీరందించే పరిస్థితి ఉం డేది. పరిహారం విషయంలో ప్రభుత్వం మెట్టుదిగకుంటే రెండో దశ కష్టమే. ఈ నిర్మాణాలు పూర్తి.. ఇప్పటివరకు20,227 ఎకరాలు సేకరించారు. ఇందులో మెయిన్ రిజర్వాయ ర్‌తోపాటు సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పంపుహౌస్‌లు, పైపు లైన్లు, కాలువలు నిర్మించారు. ఎల్లంపల్లి జలశయాలు, పంపుహౌస్‌లు, కాలువల వ్యవస్థను ప్రధాన ప్యాకేజీ, ప్యాకేజీ1, 2, 3లుగా విభజించారు. ఇందులో ప్రధాన ప్యాకేజీ అంటే జలాశయం పరిధిలో ఉండే 15 రిజర్వాయర్లు, పంపుహౌస్‌లకు సంబంధించి 700 ఎకరాలు, ప్యాకేజీ –1 కింద కరీంనగర్ జిల్లా పరిధి గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్–2, చొప్పదండి, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, వేములవాడరూరల్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల,పెగడపల్లి, జగిత్యాల, మల్యాల మండలాల పరి«ధిలో 1,059 ఎకరాలు, ప్యాకేజీ–2 కింద జగిత్యాల జిల్లా మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో 2,052 ఎకరాలు, ప్యాకేజీ–3 కింద రాజన్న సిరిసిల్ల చందుర్తి, రుద్రంగి వేములవాడ రూరల్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల, మల్యాల మండలాల పరిధిలో 556 ఎకరాలు సేకరించాల్సి ఉంది. -
ఆకాశానికి ఎగిరిన గంగ
-
తాజా మేజర్లకూ పరిహారం
ఆరువేల మందికిపైగా లబ్ధి ఒక్కొక్కరికి రూ.2లక్షలు చెల్లింపు జిల్లా పర్యటనలో సీఎం బిజీబిజీ అధికారులతో సమీక్ష, ఏరియల్ సర్వే రెండు రోజులు ఉండాలని వచ్చిన సీఎం ప్రమాదం లేదని తెలిసి తిరుగుపయనం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మిడ్‌మానేరు, ఎల్లంపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో గత ప్రభుత్వాలు చాలా జాప్యం చేసినయ్. 2008 వరకు ఉన్న మేజర్లకు మాత్రమే సాయం అందిస్తామన్నయ్. నిర్వాసితులు మాత్రం ఈరోజు వరకు మేజర్లయిన వారందరికీ ఆర్థిక సాయాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. అట్లా చేస్తే మిడ్‌మానేరులో 4,231, ఎల్లంపల్లిలో 1447 మందికి లబ్ధి చేకూరుతుంది. వాళ్లకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఇస్తే ప్రభుత్వంపై రూ.114 కోట్లు భారం పడుతుంది. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి వాళ్లకు చెల్లిస్తాం. గండిపెల్లి, గౌరవెల్లిలోనూ ఈ సమస్య ఉన్నందున వాళ్లకూ ఈ ప్యాకేజీని వర్తింపజేస్తాం – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేసేందుకు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ మిడ్‌మానేరు, ఎల్లంపల్లి భూనిర్వాసితులు చేస్తున్న డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఆయా ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన కుటుంబాల్లో తాజాగా మేజర్లయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు. తాజా నిర్ణయం వల్ల దాదాపు ఆరువేల మందికిపైగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వీరిలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 1447 మంది, మిడ్‌మానేరు పరిధిలో 4,231 మంది లబ్ధి పొందనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వంపై రూ.114 కోట్ల భారం పడనుంది. గౌరవెల్లి, గండిపెల్లి బాధితులకు సైతం ఈ ప్యాకేజీని వర్తింపజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అదనంగా మరో 500 మందికి లాభం చేకూరే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో మేజర్లయిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం చెల్లించనున్నారు. సాధ్యమైనంత తొందర్లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ర్రూం ఇవ్వలేం... మిడ్‌మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ర్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న హామీని అమలు చేయలేమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గతేడాది జూన్ 18న వేములవాడ పర్యటనకు వచ్చిన కేసీఆర్ మిడ్‌మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. అట్లా చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో కేసీఆర్ తాజాగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ‘ఆరోజు నాకు అవగాహన లేదు. మిడ్‌మానేరు బాధితులకు ప్లాట్లు ఇచ్చారట. రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కల్పించారట. ఈ విషయాన్ని అధికారులు చెప్పిండ్రు. మళ్లీ వాళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే డూప్లికేషన్ సమస్యతోపాటు ఆడిట్పరంగా ఇబ్బంది వస్తుందన్నారు. అందుకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేకపోతున్నా. మిడ్‌మానేరు బాధితులు పెద్ద మనుసుతో నన్ను క్షమించాలి’ అని కోరారు. 5గంటల పర్యటన.. వరదలు, వర్షాల పరిస్థితిపై అంచనా వేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్ ఆద్యంతం బిజిబిజీగా గడిపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చేందుకు షెడ్యూల్ ఖరారైనప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు వచ్చారు. ఉదయం 11.45 గంటలకు ఎల్ఎండీకి చేరుకున్న సీఎంకు మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఎల్ఎండీ అతిథిగృహంలో ఐదు నిమిషాలు ఆగిన కేసీఆర్ అక్కడినుంచి నేరుగా కలెక్టరేట్‌కు వచ్చారు. అప్పటికే జిల్లాకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే.జోషి, ముఖ్యకార్యదర్శి బీఆర్.మీనా, కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయల్‌డేవిస్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. వారితో కలిసి దాదాపు అరగంటకుపైగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుని మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కలెక్టరేట్ హెలిప్యాడ్ గ్రౌండ్‌కు చేరుకుని అప్పటికే సిద్ధంగా ఉన్న హెలికాప్టర్లో మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో కలిసి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తిరిగి సాయంత్రం 4గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడారు. 4.45 గంటల సమయంలో రోడ్డు మార్గం ద్వారా గజ్వేల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరారు. కేసీఆర్ రెండు రోజులపాటు కరీంనగర్‌లోనే మకాం వేయాలని వచ్చినట్లు తెలిపారు. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ భవన్‌లోనే బస చేయాలనుకున్నారు. మంగళవారం ఆదిలాబాద్, బుధవారం నిజామాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులను పరిశీలించడంతోపాటు ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని భావించారు. అయితే వరద ఉధృతి తగ్గడంతోపాటు ప్రమాదం కూడా పూర్తిగా తప్పిందని అధికారులు చెప్పడంతో ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్లిపోయారు. ‘ఒకట్రెండు రోజులు ఇక్కడే ఉండాలని ప్రిపరై వచ్చిన. కానీ ప్రమాదం తప్పిపోయింది. ఇక ఇబ్బంది లేదని తెలిసి హైదరాబాద్ వెళుతున్నా. అవసరమైతే మళ్లీ వస్తా’ అని వెల్లడించారు. -
ముంపు ముంగిట్లో కుక్కలగూడూర్
గ్రామ శివారుకు చేరుకున్న ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ సమీప గ్రామాలకు నిలిచిపోనున్న రాకపోకలు ఉపాధి కోల్పోనున్న గీత కార్మికులు పూర్తిస్థాయి ముంపుగా ప్రకటించాలని గ్రామస్తుల డిమాండ్ బసంత్‌నగర్ : రామగుండం మండలం కుక్కలగూడుర్ గ్రామం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు గుప్పిట్లోకి వెళుతోంది. గతకొద్ది రోజులుగా ఎల్లంపల్లి ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్ లోనికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ సామర్థ్యానికి అనుగుణంగా అధికారులు ఈసారి నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో బ్యాక్ వాటర్ గురువారం కుక్కలగూడుర్ గ్రామ శివారుకు చేరింది. గ్రామ శివారులోని ఉన్న బుగ్గ ఒర్రె పూర్తిగా బ్యాక్ వాటర్‌తో నిండిపోయి గ్రామంలోని రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండితే బ్యాక్ వాటర్ మరింత పెరిగి గ్రామంలోకి వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. వరద నీటి కారణంగా ఇళ్లలోకి విష సర్పాలు, ఇతర జంతువులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నిలిచిపోనున్న రాకపోకలు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో కుక్కలగూడుర్తోపాటు సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. ధర్మారం, వెల్గటూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రామగుండం, గోదావరిఖనికి వెళ్లే వారు కుక్కలగూడుర్ గ్రామ శివారు నుంచి మద్దిర్యాల మీదుగా వెళ్తుంటారు. ప్రస్తుతం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ బ్రిడ్జిపైకి చేరింది. ప్రాజెక్ట్‌లోకి ఇంకా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో వాహనదారులు బసంత్‌నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. గీత ఉపాధికి దెబ్బ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో కుక్కలగూడుర్ గ్రామానికి చెందిన గీత కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. గ్రామంలో మొత్తం 150 వరకు గీత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కులవృత్తిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ శివారులోని బుగ్గ ఒర్రె నిండిపోవడం, సగానికి పైగా తాటి చెట్లు ఒర్రె ఒడ్డును ఆనుకుని ఉండటంతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ అనువుగా ఉన్న చెట్లను గీసి కల్లు తెచ్చినా, రాకపోకలు నిలిచిపోయిన కారణంగా అంతగా గిరాకీ ఉండదని గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలి – బొంకూరి శంకర్, సర్పంచ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు కింద గ్రామంలో కేవలం 117 ఇళ్లను మాత్రమే తీసుకుని పరిహారం చెల్లించారు. గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఐదేళ్లుగా పోరాడుతున్నం. వర్షాలు ఎక్కువైతే గ్రామం చుట్టూ వరద నీరు చేరే అవకాశం ఉంది. ఇప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా ఊరును ముంపు గ్రామంగా తీసుకుని పరిహారం అందించాలి. -
రామగుండం ప్లాంట్‌కు ఎల్లంపల్లి నుంచి నీరు
కరీంనగర్‌లోని రామగుండం స్టేజ్-1 విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఏటా 2టీఎంసీల నీటి కేటాయింపులను చేస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ పర్యటన తిరిగొచ్చిన చీఫ్ ఇంజనీర్ విజయ్‌ప్రకాశ్‌కు ఇరిగేషన్ శాఖ ఈఎన్సీగా పూర్తి బాధ్యతలు కట్టబెట్టగా, ఎస్సారెస్పీ చీఫ్ ఇం జనీర్ శంకర్‌కు క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్‌గా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.