కరీంనగర్‌లోని రామగుండం స్టేజ్-1 విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఏటా 2టీఎంసీల నీటి కేటాయింపులను చేస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది.
ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ పర్యటన తిరిగొచ్చిన చీఫ్ ఇంజనీర్ విజయ్‌ప్రకాశ్‌కు ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీగా పూర్తి బాధ్యతలు కట్టబెట్టగా, ఎస్సారెస్పీ చీఫ్ ఇం జనీర్ శంకర్‌కు క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్‌గా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.