Yippee noodles
-
‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’
మెప్పుల కోసం గొప్పలు చెప్పుకోవడం ఎవరి పేటెంట్ హక్కూ కాదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు పెద్ద కంపెనీల మసాలా గొడవ ఇది. 2013 నుంచీ సాగుతోంది. ఐ.టి.సి. కంపెనీ ‘ఇప్పీ’ నూడుల్స్ ప్యాకెట్ మీద ‘మేజిక్ మసాలా’ అని ఉంటుంది. నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ మీద ‘మేజికల్ మసాలా’ అని ఉంటుంది. ఈ కారణంగానే నెస్లే మీద ఐ.టి.సి. కేసు వేసింది. తమ ‘మేజిక్’ నే ‘మేజికల్’గా నెస్లే కాపీ కొట్టిందని ఐ.టి.సి ఆరోపణ. ‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’ అనే వాదనకు ‘మేము మేజిక్ అని పెట్టిన మూడేళ్లకు వాళ్లు మేజికల్ అని పెట్టుకున్నారు’ అని తన వాదన వినిపించింది. కోర్టుకు ఆ వాదన సంతృప్తికరంగా అనిపించలేదు. ‘మేజిక్ మసాలా, మేజికల్ మసాలా అని చెప్పుకొనే గొప్పలపై ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదని అంటూ కేసును కొట్టేసింది. బిజినెస్ అన్నాక కాపీలు తప్పవు. కోర్టు వెళ్లడం కన్నా కొత్తదారిలోకి వెళ్లడం కొన్నిసార్లు లాభదాయకంగా ఉంటుంది. కానీ.. పెద్ద కంపెనీలు కదా.. తాడో పేడో అనుకుంటాయి.(కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..) చదవండి: 'ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’ -
అప్పుడు మ్యాగీ.. ఇప్పుడు యిప్పీ!
అలీగఢ్: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం అంశం మరుగునపడ్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో ప్రముఖ నూడుల్స్ బ్రాండ్ ‘యిప్పీ’ శాంపుల్స్లోనూ నిషేధిత సీసం(లెడ్) పరిమితికి మించి ఉందని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఉన్న వివిధ షాపుల నుంచి సేకరించిన యిప్పీ నూడుల్స్‌ను పరీక్షించిన యూపీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ(ఎఫ్‌డీఏ) ఈ మేరకు నిర్ధారించింది. ‘యిప్పీ’ ప్రముఖ దేశీయ సంస్థ ఐటీసీకి చెందిన నూడుల్స్ బ్రాండ్. సీసం పరిమితి 1 పీపీఎం లోపు ఉండాల్సి ఉండగా, యిప్సీలో అది 1.057పీపీఎంగా ఉందని తమ పరీక్షల్లో తేలిందని అలీఘడ్ డివిజన్ ఎఫ్‌డీఏ డివిజన్ హెడ్ చందన్ పాండే ఆదివారం తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి నిషేధిత పదార్ధాలు ఉన్న విషయం మొదట యూపీలోనే వెల్లడి కావడం విశేషం. అయితే, మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాన్ని ఇటీవల బాంబే హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. మ్యాగీ నూడుల్స్‌ను మరోసారి పరీక్షించాలని ఆ కోర్టు ఆదేశించింది.