Young Engineer
-
ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు!
పాడైపోయిన కూరగాయలు.. వ్యవసాయ వ్యర్థాలకూ... సౌరశక్తికీ మధ్య సంబంధం ఏమిటి? మామూలుగా ఆలోచిస్తే అసలేం కనిపించదు. కానీ... కార్వే మైగుయి అనే 27 ఏళ్ల ఫిలిప్పీన్స్ ఇంజనీర్ మాత్రం.. ఈ రెండింటి సాయంతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ తయారు చేశాడు! ఫలితం... ఇంటి కిటికీలు మొదలుకొని భవనాలకు బిగించే అద్దాల వరకూ.. అన్నీ సౌరశక్తి ఘటకాలే.. విద్యుదుత్పత్తి కేంద్రాలే! సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ వ్యర్థాలను, కుళ్లిపోయిన కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేస్తే వంటకు వాడుకోగల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల్లోంచి వేరు చేసిన ఓ వినూత్న పదార్థం.. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను పీల్చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని కార్వే మైగుయికి మాత్రమే తట్టింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ కేవలం కంటికి కనిపించే దృశ్యకాంతినే ఒడిసిపడతాయి. మైగుయి తయారు చేసిన పదార్థపు పొరను గాజు కిటికీలకు బిగిస్తే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్న మాట. నీడ ఉన్నా సరే.. భవనాల గోడను తాకి ప్రతిఫలించే అతినీలలోహిత కిరణా లను ఈ పదార్థం ఉపయోగించుకుం టుంది. ఈ ఆలోచనకు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి పోటీ జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది. వెలుగునిచ్చే పదార్థం... భూమిపై అయస్కాంత ధ్రువ ప్రాంతాల్లో రాత్రివేళ చిత్ర విచిత్రమైన రంగులు కొన్ని కనిపిస్తుంటాయి. అరోరా అని పిలిచే ఈ దృగ్విషయమే అతినీలలోహిత కిరణాలను ఒడిసిపట్టే వ్యవస్థ తయారీకి స్ఫూర్తి అని కార్వే మైగుయి తెలిపారు. సేంద్రియ పదార్థాల్లో ఉండే వెలుగునిచ్చే పదార్థం (బయోల్యూమినిసెన్స్)ను వేరు చేయడం ద్వారా తాను అరోరా రెన్యూ వబుల్ ఎనర్జీ అండ్ యూవీ సీక్వెస్ట్రేషన్ (ఔరియస్)ను తయారు చేశానని డైసన్ అవార్డు అందు కున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్వే వివరించారు. మిణుగురు పురుగులు కూడా ఈ బయో ల్యూమినిసెన్స్ కారణంగానే చీకట్లో వెలుగులు చిమ్ముతాయి. వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన కాయగూరల్లోంచి ఈ బయోల్యూమినిసెన్స్ పదార్థపు పొర అతినీల లోహిత కిరణాల శక్తిని మాత్రమే శోషించుకుంటాయి. ఆ శక్తిని దృశ్యకాంతిగా మార్చి విడుదల చేస్తాయి. పొర లోపల ఈ కాంతి వెనక్కు, ముందుకు ప్రతిఫలిస్తూ.. ఒక చివరకు చేరతాయి. ఆ ప్రాంతంలో సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తే ఆ కాంతి డీసీ విద్యుత్‌గా మారుతుంది. రెగ్యులేటరీ సర్క్యూట్ల సాయంతో వోల్టేజీని నియంత్రిం చుకుంటూ ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసు కోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు. ఎన్నో లాభాలు నగరాల్లో అతినీలలోహిత కిరణాల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకూ కారణమైన ఈ కిరణాలను సద్వినియోగం చేసుకొనేం దుకు ఈ ఔరియస్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఎంతో కొంత అదనపు ఆదాయం లభించేలా చేయవచ్చు. సాధా రణ సోలార్ ప్యానెల్స్‌ను ఎప్పుడూ సూర్యుడికి అభిము ఖంగా ఉంచాల్సి ఉండగా.. ఈ కొత్త వ్యవస్థలో ఆ అవసరం ఉండ దు. కాంక్రీట్ గోడలు, ఫుట్‌పాత్‌లపై పడ్డ సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను కూడా ఔరియస్ వాడుకోగలగడం దీనికి కారణం. దాదాపు 9 రకాల పంటల నుంచి బయోల్యూమినిసెన్స్ పదార్థాన్ని వేరు చేయవచ్చని కార్వే గుర్తించారు. ఉపయోగించే పదార్థాలన్నీ చౌకగానే లభ్యమవుతున్న కారణంగా ఔరియస్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తాము ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలి రంగులతో కూడిన పదార్థాన్ని వెలికితీస్తున్నామని, నీలి రంగుకు ప్రత్యామ్నా యాన్ని కనుక్కోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుం దని కార్వే మైగుయి వివరించారు. వాహనాలపై కూడా ఔరియస్ను వాడుకోవచ్చని తెలిపారు. -
ఎట్టకేలకు ‘విక్రమ్’ గుర్తింపు
వాషింగ్టన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు సెప్టెంబర్ 7న ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ జాడలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎట్టకేలకు గుర్తించింది. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను గుర్తించగలిగామని నాసా ప్రకటించింది. ఈ మేరకు నాసా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 22న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్–2 నింగికి ఎగిరిన విషయం మనకు తెలిసిందే. నెలల ప్రయాణం తర్వాత సెప్టెంబర్‌లో జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్–2 నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది. అయితే సెప్టెంబర్ 7న చివరిక్షణంలో విక్రమ్ ల్యాండర్‌తో సమాచార సంబంధాలు తెగిపోయాయి. నెమ్మదిగా ల్యాండ్ అవడానికి బదులు కొంత ఎత్తు నుండి కుప్ప కూలిపోయినట్లు నాసా నిర్థారించింది. చంద్రయాన్ –2 విక్రమ్ ల్యాండర్‌ను నాసా అంతరిక్ష నౌక లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) గుర్తించిందని, వివరాల కోసం ఫొటోలు చూడాల్సిందిగా నాసా మంగళవారం ఒక ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన పదిరోజులకు అంటే సెప్టెంబర్ 17న ఎల్ఆర్ఓ తీసిన కొన్ని ఛాయాచిత్రాలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్ 26న విడుదల చేసిన ఈ ఫొటోలను అదే ప్రాంతపు ఇతర ఫొటోలతో పోల్చి చూసి ల్యాండర్ జాడలను గుర్తించాలని నాసా ప్రజలను ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన చెన్నై మెకానికల్ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ (33) తన ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు విక్రమ్ కూలిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నారు. అక్టోబర్ 3న నాసా, ఎల్ఆర్వో, ఇస్రో ట్విట్టర్ హ్యాండిళ్లను ట్యాగ్ చేసిన షణ్ముగ కొన్ని ఫొటోలను జత చేస్తూ ‘విక్రమ్ ల్యాండర్ ఇదేనా (ల్యాండింగ్ ప్రాంతానికి కిలోమీటర్ దూరం)?.. జాబిల్లి మట్టిలో కూరుకుపోయిందా?’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ‘విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతమిదే కావచ్చు. శకలాలు ఇక్కడే పడి ఉండవచ్చు’ అంటూ మరికొన్ని వివరాలు, ఫొటోలను జత చేసి నవంబర్ 17న మరో ట్వీట్ చేశాడు. 750 మీటర్ల దూరంలో... షణ్ముగ ముందు విక్రమ్ కుప్పకూలిందన్న ప్రాంతానికి వాయవ్య దిశలో 750 మీటర్ల దూరంలో శకలాలను గుర్తించాడని, భారీ ఫొటోలో ఈ శకలం ప్రకాశవంతమైన పిక్సెల్‌గా కనిపించిందని నాసా వివరించింది. షణ్ముగ ఈ సమాచారాన్ని నాసాకు అందించడంతో ఎల్ఆర్ఓ కెమెరా సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టి శకలాల గుర్తింపులో విజయం సాధించింది. షణ్ముగ సమాచారం ఇచ్చిన తరువాత ఎల్ఆర్ఓ అక్టోబర్ 14, 15, నవంబర్ 11 తేదీల్లో ఆ ప్రాంతాన్ని మళ్లీ ఫొటోలు తీసిందని తెలిపింది. ఈ కొత్త పరిశీలనల ద్వారా విక్రమ్ ల్యాండర్ ముందుగా నిర్ణయించిన సాఫ్ట్‌ల్యాండింగ్ ప్రాంతం నుంచి ఆగ్నేయంగా సుమారు 2,500 అడుగుల దూరంలో కూలిందని, శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నాసా తెలిపింది. విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించారని ధ్రువీకరించిన నాసా ఇందుకు సంబంధించి షణ్ముగకు కృతజ్ఞతలు తెలిపింది. సమాచారమిచ్చినందుకు ధన్యవాదాలని ఎల్ఆర్ఓ ప్రాజెక్టు డిప్యూటీ, సైంటిస్ట్ అయిన జాన్ కెల్లెర్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. -
మోటారు బైక్‌లను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్ళింది
ఆనందపురం(భీమిలి): ఓ యువ ఇంజినీర్ స్నేహితులతో కలసి విహారయాత్ర వెళ్లాడు. అక్కడ వారితో మధురానుభూతులను పంచుకుంటూ ఉల్లాసంగా గ డిపాడు. ఆ క్షణాలను నెమర వేసుకుంటూ సాయంత్రం తిరిగి బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. కానీ.. ఇంటికి చేరక ముందే ఆ యువ ఇంజినీర్‌ను లారీ రూపంలో మృత్యువు కబళించి తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని భీమిలి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలివి. నగరంలోని ఎంవీపీకాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఫిరోజ్ (20) వరంగల్ నిట్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కళాశాలకు సెలవు ఇవ్వడంతో ఇటీవల తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తన పాత స్నేహితులను కలుసుకుని అందరితో కలసి విహార యాత్రకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు పది మంది స్నేహితులతో కలసి బైక్‌లపై భీమిలి తీరంలో ఉన్న దివీస్ జెట్టీ వద్దకు వెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు స్నేహితులందరూ ఉల్లాసంగా గడిపి తిరిగి ఎంవీపీకాలనీకి ప్రయాణమయ్యారు. భీమిలి క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకునే సరికి అబ్దుల్ ఫిరోజ్ బైక్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టి సుమారు 10 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో అబ్దుల్ ఫిరోజ్‌తో పాటు మోటార్ బైక్ వెనుక వైపు కూర్చున్న మరో ఇంజినీరింగ్ విద్యార్థిని హాన్షిత (19) తీవ్రంగా గాయపడ్డారు. ఆమె విజయవాడలో చదువుతు న్నారు. సంఘటన విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది వారిద్దరిని మధురవాడ సమీపంలోని గాయత్రి ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అప్పటికే అబ్దుల్ ఫిరోజ్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. హాన్షితకు మెరుగైన వైద్యం అందించడానికి నగరంలోని కేర్ ఆస్పత్రికి బంధువులు తరలించారు. ప్రమాదంలో ద్విచక్రవాహనం తుక్కు తుక్కు అయింది. సంఘటన జరిగిన ప్రాంతాన్ని సీఐ గోవిందరావు పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును సీఐ ఆర్.గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ భీమిలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న అవుట్ పోస్టును ఎత్తి వేయడంతో నేరాలతో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని వివరిస్తూ ‘శివారులో భద్రతెంత’అనే శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అక్కడ సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ లేక ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటికైనా అధికారులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రమాదానికి కారణమైంది అదే లారీ ఆనందపురం జంక్షన్ వద్ద ఈ ఏడాది మే 5న జరిగిన ప్రమాదానికి కారణమైన లారీయే.. మం గళవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైంది. అప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్బీ కానిస్టేబుల్ రాధాకృష్ణ మృతి చెం దారు. అప్పటి.. ఇప్పటి సంఘటనలను పరిశీలిస్తే.. మోటారు బైక్‌లను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకొని పోవడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. -
యువ ఇంజనీర్‌ను బలిగొన్న వేధింపులు
- సెలవు మంజూరు చేయమన్నందుకు మెమో..మనస్తాపంతో ఆత్మహత్య - ఈఈని సస్పెండ్ చేయాలని బంధువుల రాస్తారోకో వెల్గటూరు: ఆయనో యువ ఇంజనీర్.. ఏడాదిన్నర క్రితం టీఎస్పీఎస్ ద్వారా పంచాయతీరాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఏఈగా నియమితుడయ్యాడు. ఎంతో ఆనందం గా ఉద్యోగంలో చేరిన అతడికి.. ఉన్నతాధి కారుల నుంచి వేధింపులు మొదలవ్వడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. సెలవు మంజూరు చేయమని కోరితే.. మెమో జారీ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ముందు రోజే భార్యకు, సదరు అధికారికి సూసైడ్ నోట్‌ను మెయిల్ చేశాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లికి చెందిన దేవి శ్రీకాంత్(30) బుధ వారం తన పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. దేవి శ్రీకాంత్ ఆసిఫాబాద్ జిల్లా డివిజన్ పంచాయతీ రాజ్ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్. మంచిర్యాల క్యాంప్ ఆఫీస్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ఉద్యోగంలో చేరిన శ్రీకాంత్‌కు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. చిన్న తప్పును కూడా వేలెత్తి చూపడం.. సంజాయిషీ అడగటం తనను మానసికంగా కుంగదీసిందని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 8 నుంచి 10 వరకు మూడు రోజులు ఉద్యోగానికి వెళ్లకుండా అదృశ్యమయ్యాడు. కుటుంబçసభ్యులు వెతికి పట్టుకుని తిరిగి ఉద్యోగంలో చేర్పించారు. తన మానసిక పరిస్థితి సరిగా లేనందున మూడురోజులు విధులకు హాజరు కాలేదని, ఆ మూడు రోజులు సెలవు మంజూరు చేయాలని 11న నిర్మల్ జిల్లా ఈఈ రఘువీరారెడ్డికి విన్నవించాడు. ఆయన లీవ్ మంజూరు చేయకపోగా.. అనుమతి లేకుండా ఎందుకు వెళ్లావో వివరణ ఇవ్వాలని మెమో జారీ చేశారు. దీంతో మరింత కుంగిపోయిన శ్రీకాంత్ విధులకు వెళ్లకుండా ఆ రోజునే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు అప్పటి నుంచి వెతుకుతున్నా జాడ దొరకలేదు. అధికా రుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటు న్నానని డీఈకి, భార్యకు ఈ నెల 22న సూసైట్ నోట్‌ను మెయిల్ చేశాడు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అదే రోజున వెల్గటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. బంధువుల రాస్తారోకో.. ఈఈ రఘువీరారెడ్డి వేధింపుల వల్లే శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ధర్మారం– జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేశారు. ఈఈని సస్పెండ్ చేయాలని, అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతవర్గానికి చెందిన ఈఈ.. దళితుడనే కారణంగానే శ్రీకాంత్‌ను వేధించాడని, అతడిని శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ ముద్దం ప్రకాశ్ డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్ రావు హామీ ఇవ్వగా.. బంధవులు ఆందోళనను విరమించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!
-
మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!
గత సంవత్సరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఓ యువ ఇంజనీరు చూపించిన ప్రతిభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతడిని ఎంతగానో ప్రశంసించారు. కానీ.. మోదీ సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త 2000 రూపాయల నోట్లకు నకిలీనోట్లను ముద్రించినందుకు పోలీసులు అతడిని పంజాబ్‌లోని మొహాలీలో అరెస్టుచేశారు. అతడి వద్ద రూ. 42 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ వర్మ అనే ఈ యువ ఇంజనీరుతో పాటు, అతడి బంధువు విశాఖా వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్‌పాల్‌లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు ముగ్గురూ ప్రజల వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లు తీసుకుని, తాము ముద్రించిన 2000 రూపాయల నోట్లను కమీషన్ పద్ధతిలో ఇస్తున్నారు. కొత్త నోట్లు ఇచ్చినందుకు వాళ్ల దగ్గర 30 శాతం కమీషన్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఇంతా చేస్తే.. వాళ్లిచ్చేది దొంగనోట్లు. ఆ విషయం తెలియక ఇప్పటికి ఎంతమంది వాళ్ల బుట్టలో పడ్డారో తెలియదు. వీళ్లు ముగ్గురూ కేవలం వీవీఐపీలు మాత్రమే వాడాల్సిన ఎర్రబుగ్గతో అత్యాధునికమైన సరికొత్త ఆడి ఎస్‌యూవీలో వెళ్తుండగా తాము ఆపి తనిఖీ చేశామని మొహాలీ నగర ఎస్పీ పర్మీందర్ సింగ్ చెప్పారు. అప్పుడే ఈ 42 లక్షల దొంగనోట్లు పట్టుబడ్డాయన్నారు. ఈ గ్యాంగులో మరో ఇద్దరు ఉన్నారని, కానీ ఆ ఇద్దరూ పారిపోయారని పోలీసులు చెప్పారు. మోదీ ఎందుకు మెచ్చుకున్నారు.. అభినవ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటుచేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అతడు తయారుచేశాడు. వాటి సాయంతో అంధులు కర్రకు ముందు ఏముందో కూడా తెలుసుకోవచ్చు. గోతులు గానీ, రాళ్లు గానీ ఏవైనా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఆ ఆవిష్కరణ చేసినందుకు మోదీ ఇతడిని జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలో అభినందించారు. కానీ, చండీగఢ్‌లోని తన కార్యాలయంలో ఇప్పుడు అతడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు చెప్పారు.