Young farmers
-
జట్టు కట్టారు.. లాభాల గుట్టు పట్టారు
వ్యవసాయ రంగంలో లాభాల గుట్టు పట్టాలన్న ఓ యువరైతు ఆలోచన తోటి రైతులను సైతం జట్టు కట్టేలా చేసింది. ఒక్కొక్కరుగా చేయి కలుపుతూ ఆ రైతులంతా దళారులను తరిమికొట్టి.. సాగులో లాభాల పంట పండిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాంకేతిక పద్ధతుల్ని అవలంబిస్తూ.. తమకు అవసరమైన సదుపాయాలను తామే సమకూర్చుకుంటున్నారు. పొలం బడుల్లో ప్రగతి దారులు పరుచుకుంటున్న ఆ రైతులను చూడాలంటే.. నెల్లూరు జిల్లా లేగుంటపాడు వెళ్లాల్సిందే..! సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి చెందిన రైతులు 2016లో చేయిచేయి కలిపి సంఘటితమయ్యారు. ఎంబీఏ చదివిన యువరైతు భూపేష్‌రెడ్డితో కలిసి నాబార్డు సహకారంతో రైతు ఉత్పత్తిదారులు సంఘం (ఎఫ్‌పీవో) తరఫున ప్రగతి యువ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలుత 20 ఎకరాల పొలంతో 100 మంది రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు కాగా.. ఆ తర్వాత కోవూరు మండలంతో పాటు ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు, జగదేవీపేట, కొత్తూరు, లేబూరు, కొడవలూరు మండలంలోని తలమంచి గ్రామ రైతులు కూడా వారితో జత కలిశారు. ఇలా దాదాపు 2,500 మంది పండ్లు, పూలు, కూరగాయలు సాగు చేసే రైతులు ఎఫ్‌పీవోలో సభ్యులుగా చేరారు. ఒక్కో సభ్యుడు రూ.100 చొప్పున సభ్యత్వ రుసుం, షేర్ క్యాపిటల్ రూ.వెయ్యి వంతున చెల్లించి దాదాపు రూ.25 లక్షల వరకు సమకూర్చుకున్నారు. ఆ సొమ్ముతో వసతుల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. సభ్యుల్లో అత్యధికులు కౌలు రైతులే కావటం విశేషం. అల్లికల కోసం అరటి నార తీస్తున్న రైతులు యంత్రాల బాటపట్టి.. ఉద్యాన శాఖ, నాబార్డు ద్వారా సబ్సిడీ రుణం పొంది రవాణా వాహనాన్ని, తూకంలో మోసపోకుండా విద్యుత్ తూకం యంత్రాలను, వీడర్లను సమకూర్చుకున్నారు. అంతేకాకుండా కలెక్షన్ సెంటర్లు, సోలార్ కోల్డ్ రూమ్, సోలార్ డ్రయ్యర్, పోర్టబుల్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను సైతం సమకూర్చుకున్నారు. సోలార్ కోల్డ్ రూమ్ నిర్మాణానికి దాదాపు రూ.14.5 లక్షల వ్యయం కాగా.. ప్రభుత్వం రూ.11 లక్షల సబ్సిడీ ఇచ్చింది. రైతులకు కొత్త వంగడాలు అందించడం, గిట్టుబాటు ధరకే పంట ఉత్పత్తులు అమ్ముకునేలా అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ పంట ఉత్పత్తులకు ధర లేకపోయినా కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేసి ధర వచ్చినప్పుడే మార్కెట్‌కు పంపిస్తున్నారు. జేఎల్‌జీ గ్రూపులకు రుణ సదుపాయం ఐదుగురు చొప్పున రైతులను జాయింట్ లయబిలిటీ గ్రూపులుగా (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి అధికారులు వారికి రుణాలు అందేలా సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 500 గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపునకు రూ.5 లక్షల వరకు పెట్టుబడుల కోసం రుణం మంజూరు చేయిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు గ్రీన్హౌస్ టెక్నాలజీ అందించేందుకు కృషి జరుగుతోంది. 10 సెంట్ల విస్తీర్ణంలో సైతం రూ.లక్ష వ్యయంతో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉపయోగించి పంటల సాగు చేసేలా కృషి చేస్తున్నారు. పచ్చి మిర్చి గ్రేడింగ్ చేస్తున్న రైతులు విదేశాలకు ఎగుమతులు చేసే లక్ష్యంతో.. రైతులకు అన్ని అవసరాలు తీర్చడంతో పాటు రైతులే సొంతంగా మార్కెటింగ్ చేసుకునే స్థాయికి చేరుకున్నాం. ఆధునిక పద్ధతులతో సేంద్రియ పంటలు పండించే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ సహకారంతో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు సోలార్ కోల్డ్ స్టోరేజ్‌లు, మార్కెటింగ్ కోసం వారాంతపు సంత ఏర్పాటు చేసుకున్నాం. విదేశాలకు ఎగుమతులు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం – భూపేష్‌రెడ్డి , రైతు ఉత్పత్తిదారుల సంఘ రూపకర్త ఆధునిక పద్ధతులతో సాగు రైతులంతా ఐకమత్యంతో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరాం. మాకు పంటల సాగుపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆ«ధునిక పద్ధతులతో సాగు చేస్తున్నాం. ఏటా భూసార పరీక్షలు చేయించి అవసరమైన ఎరువులు మాత్రమే వాడుతున్నాం. దీనివల్ల పంటల దిగుబడి పెరిగి వ్యయం తగ్గింది. – రాజశేఖర్, యువ రైతు, లేగుంటపాడు చదవండి: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో నవ్వులు పూయించిన తాత.. వీడియో వైరల్.. -
సాగుకు చదువుల దన్ను
ఒకపక్క– వ్యవసాయాన్ని నామోషీగా భావించి, ఐదారువేల జీతానికే పల్లెలను వదిలి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత.. మరోపక్క– ఉన్నత చదువులు చదివి, లక్షల్లో వేతనం వస్తున్నా.. అందులో లభించని తృప్తిని మట్టిని నమ్ముకుని పొందాలనే తపనతో ఉద్యోగాలొదిలి పల్లెబాట పడుతున్నారు మరికొందరు. పచ్చని పంట పొలాల్లో.. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతూ సంతృప్తి చెందుతున్న చదువుకున్న యువకుల ‘సాగు’ లాభాల పంట పండిస్తోంది. సాక్షి, జగిత్యాల: ఉద్యోగాలు వదిలి కొందరు, ఉన్నత చదువులు చదివి ఇంకొందరు వ్యవసాయంలోకి దిగుతున్నారు. దాని అనుబంధ రంగాల్లోనూ వస్తున్న కొత్త టెక్నాలజీని ఈ యువ రైతులు అందిపుచ్చుకుంటూ ముందంజలో ఉంటున్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు సైతం చెబుతూ, వారిని తమ మార్గంలోకి మళ్లేలా ప్రయత్నిస్తున్నారు. ఆయా రంగాల్లోని యువ రైతులు సంయుక్తంగా తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే చేరవేసేలా మార్కెటింగ్ కూడా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ‘సోషల్’ సాగు అంతర్గాంకు చెందిన వామన్‌రెడ్డి బీటెక్ చదివాడు. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో కూరగాయల సాగును చేపట్టాడు. వీటి సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక చేయి సరిగ్గా పనిచేయకున్నా.. తానే అన్ని పనులూ చేసుకుంటాడు. కూరగాయలను స్వయంగా మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల మనుసు గెలుచుకుంటున్నాడు. రైతులు ఎక్కడ మోసపోయినా అక్కడ గళమెత్తడం కూడా వామన్‌రెడ్డి ప్రత్యేకత. రైతులను చైతన్యం చేసేందుకు ఫేస్బుక్, వాట్సాప్‌లను ఉపయోగిస్తున్నాడు. వారికి సస్యరక్షణ, ఆధునిక సాగు పద్ధతులపై సలహా సూచనలతో పాటు చైతన్యవంతుల్ని చేసేలా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు. బంగారు నాటుకోడి గుడ్డు హైదరాబాద్‌లో బీటెక్ చదివిన సుభాష్ది జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామం. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. మంచి జీతమే వస్తున్నా.. ఆ జీవితం తృప్తిగా లేకపోవడంతో సొంతూరు తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం నాటుకోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. అందరూ కొత్తలో ఇదేం పనని ఆశ్చర్యపోయినా.. ఈ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను ప్రత్యేక పద్ధతుల్లో పిల్లలుగా మారుస్తున్నాడు. నాటుకోళ్లను అందరి మాదిరిగా షెడ్లలో కాకుండా, మామిడి, జామ తోటల్లో పెంచుతూ, డిమాండ్‌ను బట్టి కిలో రూ.250–రూ.300కి విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ‘పాడి’తో జోడీ లక్ష్మీపూర్‌కు చెందిన సురేశ్ హైదరాబాద్‌లో ఉంటూ బీటెక్ చదివాడు. కానీ ఎప్పటికైనా స్వయం ఉపాధి కల్పించుకుని తన కాళ్లపై తాను నిలబడాలనేది అతని లక్ష్యం. ఆ మక్కువతోనే స్వగ్రామంలో 30 ఆవులతో డెయిరీ ఫారాన్ని ప్రారంభించాడు. తొలుత నలుగురి భాగస్వామ్యంతో ఫారం నిర్వహించగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం సురేశ్ ఒక్కడే వినూత్న ఆలోచనలతో ఫారం నిర్వహిస్తూ ఏడాదిలోనే లాభాల బాట పట్టించాడు. ఇప్పుడు ఆవులతో పాటు గేదెల డెయిరీ కూడా నిర్వహించి నేరుగా వినియోగదారులకు పాలు విక్రయించేలా వ్యూహరచన చేస్తున్నాడు. ‘ఇంజనీరింగ్’ సేద్యం లక్ష్మీపూర్‌కు చెందిన స్వామిరెడ్డి ఇంజనీరింగ్ చదివాడు. తల్లిదండ్రులు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని అంటుంటే.. తాను వ్యవసాయం చేస్తానంటూ సేద్యంలోకి దిగాడు. ఇప్పుడు నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడులు సాధిస్తుంటే ఆ తల్లిదండ్రులే మురిసిపోతున్నారు. పసుపు పంటకు డ్రిప్‌తో పాటు ప్రతీ పనికి ఆధునిక పరికరాలను ఉపయోగించడం స్వామిరెడ్డి ప్రత్యేకత. వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి, డ్రైవర్ అవసరం లేకుండా తానే డ్రైవింగ్‌చేస్తూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అలాగే, తాను ఆచరించే ఆధునిక సాగు పద్ధతులపై ఇతర రైతులకూ అవగాహన కల్పిస్తుంటాడు. -
సోషల్ మీడియా ఎఫెక్ట్.. యువరైతుకు కేసీఆర్ ఫోన్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా ఒక రైతును ముఖ్యమంత్రి దగ్గరకు చేర్చింది. ఆ రైతు సమస్యను ఒకే రోజులో పరిష్కరించేలా చేసింది. వ్యవసాయ భూమిని కోల్పొయిన యువ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్ తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్ ఇతరులకు పట్టా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. 11 నెలలుగా సమస్య అలాగే ఉందని, రైతుల వేదన సీఎంకు చేరే వరకూ షేర్ చేయాలని రైతు విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. ఆ ఫేస్బుక్ పేజీని చూసిన సీఎం.. నేరుగా రైతుకు ఫోన్ చేసి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా న్యాయం చేస్తానని సీఎం భరోసా ఇచ్చారు. అధికారులను ఆదేశించానని గంటలో మీ ఇంటికి వచ్చి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ హుటాహుటిన ఆ రైతు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. నందులపల్లిలో శరత్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. భూమిని శరత్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే రైతు బంధు కింద రూ.30,000 కూడా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడెకరాల భూమిని ఇతరుల పేరుపై మార్పిడి చేసినట్టు ఫిర్యాదు వచ్చిందని, రైతులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. రైతు బంధు పథకం కూడా బాధిత రైతుకు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు. -
యువ రైతులకు దూరవిద్యలో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగంలో నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులను రైతులకు వివరించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ నడుం బిగించింది. దూర విద్య ద్వారా యువ రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ఈ కోర్సును ప్రారంభించనుంది. ‘తెలంగాణ యువ రైతు సాగుబడి’ పేరుతో ఈ దూరవిద్య సర్టిఫికేట్ కోర్సును అందిస్తారు. రైతుల్లో ఆర్థిక పరిపుష్టిని పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. యూనివర్సిటీతోపాటు ఇతర వ్యవసాయ అనుబంధ శాఖలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. -
యవసాయం
పంతంగి రాంబాబు ఏ ఆలోచనైతే మన ముందున్న సమస్యలను సృష్టించిందో అదే ఆలోచనతో ఈ సమస్యలను పరిష్కరించలేం. - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రైతులకు జీవన భద్రత లేకుండా చేసి నిలువునా అన్నదాతల ఉసురు తీస్తున్న ‘ఆలోచనా తీరు’ను సమూలంగా మార్చుకోకుండా వ్యవసాయ సంక్షోభాన్ని కూకటి వేళ్లతో పెకలించడం అసాధ్యమని చాటి చెబుతున్నారు కొత్త తరం యువ రైతులు. వీళ్లంతా ఉన్నత చదువులు చదువుకొని పెద్ద జీతాల ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు. అటువంటి ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయంపై కొత్త ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు. ఆలోచనల్లో స్పష్టత, ఆచరణలో క్రమశిక్షణ ఉంటే అప్పుల్లేని, ఆత్మహత్యల్లేని వ్యవసాయం సాధ్యమేనని చాటుతున్నారు. నేడు ‘జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం’. జమీందారీల పీడ విరగడ చేయడంతోపాటు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచిన అలనాటి నేత, దివంగత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినమైన డిసెంబరు 23ను ఏటా ఈ దినోత్సవాన్ని ’(కిసాన్ దివస్) జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా... బతుకు భరోసానిచ్చే ఈ సరికొత్త తరం అన్నదాతల అమూల్యమైన స్వీయానుభవాల మూటలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను రైతును.. రైతులకు ఆదాయ భద్రత, వినియోగదారులకు విషం లేని సహజాహారం అందించడం... ఇవే మా లక్ష్యాలు. సీఏ చదువుకొని 18 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. ఎంబీఏ చదివి క్రిసిల్‌లో ఐదేళ్లు పనిచేసిన నా చిన్ననాటి క్లాస్మేట్ ఆయుష్ శర్మతో కలిసి మా గురువు ఎస్.రాఘవన్ మాటసాయంతో వ్యవసాయంలోకి దిగాం. నాలుగేళ్లుగా పనిచేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు, పండ్లను పండించడం.. పండించిన పంటను నేరుగా వినియోగదారుడికి అమ్మటం ద్వారా రైతుకు స్థిరంగా ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నందించడం.. ఇదీ మేం చేస్తున్నది. 2011లో కర్ణాటక రాయచూర్‌లో 140 ఎకరాలను, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద 110 ఎకరాలను సాగులోకి తెచ్చాం. కొందరు రైతులతో 15 ఏళ్ల ఒప్పందం మేరకు ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నాం. కూరగాయలు, పండ్లను హైదరాబాద్‌లో 2014 ఉగాది నుంచి ‘ఐ యామ్ ఫార్మర్’ పేరిట నాగోల్‌లో దుకాణం పెట్టి వినియోగదారులకు విక్రయిస్తున్నాం. 2020 నాటికి హైదరాబాద్ పరిసరాల్లోని 75 వేల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలన్నది లక్ష్యం. నగరానికి రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని వంద శాతం అందించడం కోసం ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాం. - మొక్కపాటి సత్యరఘు (99085 85734) ‘ఐ యామ్ ఫార్మర్’, నాగోల్, హైదరాబాద్ కలిసిపనిచేస్తే.. ఎంబీఏ చదివి 18 ఏళ్ల పాటు అనేక ఉద్యోగాలు చేసి.. రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయదారుడిగా స్థిరపడ్డాను. బాస్మతి ధాన్యం, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలను సాగు చేసి నేరుగా వినియోగదారులకు మామూలు ధరలకే అమ్ముతున్నా. ఎకరమున్నరలో రూ. లక్షకు పైగా నికరాదాయం సాధించాను. ఎకరంలో రూ.2 లక్షల నికరాదాయం పొందే అవకాశం ఉంది. పంటలతోపాటు కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకాన్ని కూడా చేపడితే చిన్న రైతులు ఆదాయ భద్రతను పొందడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా గ్రహించా. ఈ ఏడాది 10 మంది చిన్న రైతులను కూడగట్టుకొని 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరిస్తున్నా. 5 గ్రామాల్లో 5 వేల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నది నా లక్ష్యం. రైతులు ప్రణాళిక ప్రకారం, ఉమ్మడి బాధ్యతతో కలిసి పని చేస్తే సహకార పద్ధతిలో మంచి ఫలితాలు సాధించవచ్చు. - సూర్య రోషన్‌రాజు(99630 53337) కమ్మెట, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా ఉద్యోగాన్ని మించిన ఆదాయం.. బీసీఏ చదువుకొని పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఉద్యోగం చేస్తూనే ఏడాదిన్నర నుంచి ఆరున్నరెకరాలను బండవాదారం వద్ద కౌలుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ వద్ద శిక్షణ పొందా. ధాన్యంతో పాటు కూరగాయలు, పండ్లు పండిస్తూ నేరుగా వినియోగదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇస్తున్నా. మరో నలుగురు రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పించి, వాళ్లు పండించే కూరగాయలు కూడా అమ్మిస్తున్నా. కాలేజీ కుర్రాళ్లతో ఖాళీ సమయాల్లో రోజూ కూరగాయలను డోర్ డెలివరీ చేయిస్తున్నా. ప్రస్తుతం ఆర్నెల్లు బ్రేక్ తీసుకొని పూర్తిస్థాయిలో వ్యవసాయంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నా. ప్రకృతి వ్యవసాయం, మార్కెటింగ్ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఉద్యోగాన్ని మించిన ఆదాయం వస్తుందన్న నమ్మకమూ కలిగింది. - జాన్ ఇజ్రాయిల్ (98668 02448) బండమాదారం, మేడ్చల్ మండలం, రంగారెడ్డి జిల్లా ఆహారమే ఔషధం! దేశ విదేశాల్లో 15 ఏళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. చార్టర్డ్ ఎకౌంటెంట్ గాంధీరాజు, ఫార్మసీ వ్యాపారి నర్సింహరాజుతో కలిసి మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ముగ్గురం కలిసి కొంపల్లి సమీపంలో 50 ఎకరాల్లోని 15 ఏళ్ల మామిడి తోటను దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నాం. అంతరపంటగా వరి కొంత మేరకు సాగు చేస్తున్నాం. పిట్టలవానిపాలెం మండలం అల్లూరులోనూ ఏడెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నాం. రసాయనాలు వాడకుండా పండించిన ఆహారం అమృత సమానమైనది. మెడికల్ షాపులకు మందులు కొనడానికొచ్చే వారికి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారంలో ఉండే ఔషధ విలువల ప్రభావం గురించి చెబుతున్నాం. - గోపరాజు వర్మ (98663 26478), కొంపల్లి, రంగారెడ్డి జిల్లా