Yousuf Raza Gilani
-
పాక్ మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలాని కరోనా వైరస్(కోవిడ్-19) బారిన పడ్డారు. శనివారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో యూసఫ్ రజా గిలాని తనయుడు కాసీం గిలానీ.. ‘‘మా నాన్న ప్రాణాలను విజయవంతంగా ప్రమాదంలో పడేసిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ)కు ధన్యవాదాలు. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ ఫలితం వచ్చింది’’ అంటూ ట్విటర్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూసఫ్ రజా గిలానీ గురువారం రావల్పిండిలో ఎన్ఏబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనని.. ఈ విషయంలో తనకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని అంతకుముందు న్యాయమూర్తికి విన్నవించారు. అయితే జడ్జికి ఇందుకు నిరాకరించడంతో ఆయన స్వయంగా ఎన్ఏబీ ఎదుట హాజరయ్యారు. (పాక్ క్రికెట్లో కరోనా కలకలం) ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఆయన తనయుడు కాసీం గిలానీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో గిలానీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన సయ్యద్ యూసఫ్ రజా గిలాని 2008 నుంచి 2012 వరకు పాక్ 18వ ప్రధానిగా కొనసాగారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆయన ప్రధాని పదవికి అర్హుడు కాదంటూ తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో ఇప్పటివరకు 1,32,405కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 2551 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే. Thank you Imran Khan’s govt and National Accountibilty Burearu! You have successfully put my father’s life in danger. His COVID-19 result came postive. pic.twitter.com/VxiEXFOkZA — Kasim Gilani (@KasimGillani) June 13, 2020 -
మాజీ పీఎం కొడుకు కిడ్నాప్ సుఖాంతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కుమారుడు అలీ హైదర్ గిలానీ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. అప్ఘానిస్థాన్ లో తాలిబాన్ తీవ్రవాదుల చెర నుంచి అతడిని మంగళవారం విడిపించారు. ఘాజ్ని ప్రావిన్స్ లో అమెరికా, అప్ఘానిస్థాన్ సైనిక బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అతడిని విడిపించినట్టు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడేళ్ల క్రితం హైదర్ గిలానీ కిడ్నాపయ్యాడు. ముల్తాన్ లో 2013, మే 9న సాయుధులు అతడిని కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో అతడి ఇద్దరు అనుచరులను దుండగులు కాల్చిచంపారు. కిడ్నాప్ కు గురైన సమయంలో సాధారణ ఎన్నికల్లో ముల్తాన్ అభ్యర్థిగా ఆయన ఉన్నారు. హైదర్ గిలానీకి విముక్తి లభించిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) బిలావల్ భుట్టో జర్దారి ట్విటర్ ద్వారా తెలిపారు. తన కుమారుడి విడుదల గురించి యూసఫ్ రజా గిలానీకి అప్ఘానిస్థాన్ లోని పాక్ రాయబారి ఫోన్ చేసి చెప్పారు. -
అప్పటి పాక్ ప్రధాని మా ఇంటికొచ్చారు: హెడ్లీ
ముంబై: ముంబై బాంబు పేలుళ్లు జరిగిన కొన్నివారాల తర్వాత అప్పటి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ తన ఇంటికి వచ్చారని 26/11 ఘటనలో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ముంబై ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షికాగో జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాది హెడ్లీని విచారిస్తున్న నేపథ్యంలో మూడోరోజైన శుక్రవారం అతను ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ముంబైలో దాడులు జరిగిన నెల తర్వాత మా నాన్న సయ్యద్ సలీం చనిపోయారు. అయితే ఆయన అంత్యక్రియలకు అప్పటి పాక్ ప్రధాని గిలానీ వచ్చారనడం అవాస్తవం. మా నాన్న మరణించిన కొన్ని వారాల తర్వాత గిలానీ పాక్‌లో ఉన్న మా ఇంటికి వచ్చి పరామర్శించారు. లష్కరేతో నాకు సంబంధాలుండటం నాన్నకు ఇష్టం ఉండేది కాదు’ అని హెడ్లీ చెప్పాడు. తనకు చిన్నప్పటి నుంచీ భారత్ అంటే ద్వేషమన్నాడు. 1971లో భారత్-పాక్ యుద్ధంలో తాను చదువుకుంటున్న స్కూల్‌పై భారత్ బాంబు దాడికి పాల్పడగా.. పలువురు ప్రాణాలు చనిపోయారని, అందుకే భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే లష్కరేలో చేరానన్నాడు.