ys rajareddy murder
-
సుధాకర్‌రెడ్డిని నేనే బయటకు తీసుకొచ్చా: సతీష్ రెడ్డి
కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకరరెడ్డిని తానే బయటకు తీసుకొచ్చానని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్.వి.సతీష్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సతీష్‌రెడ్డి, సుధాకరరెడ్డి ఆరోపణలెదుర్కొంటున్న సంగతి తెల్సిందే. శుక్రవారం ఓ చానెల్లో జరిగిన చర్చలో పాల్గొన్న సతీష్ రెడ్డి ఈ మేరకు వెల్లడించారు. చంద్రబాబును ప్రాధేయపడి, పలుమార్లు విజ్ఞప్తులు చేసి సుధాకరరెడ్డిని బయటకు తీసుకొచ్చానని సతీష్‌రెడ్డి వెల్లడించారు. అంతేకాదు వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిన వెంటనే తాను శుక్రవారం ఉదయం డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశానని సతీష్‌రెడ్డి బయటపెట్టారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
వివాదాస్పదంగా మారిన ఖైదీల విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 49మంది ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. అయితే ఖైదీల విడుదల వివాదాస్పదంగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు పంపిన 149మంది జాబితాలో 100మందిని ప్రభుత్వం తిరస్కరించడమే కాకుండా ఖైదీల విడుదలను టీడీపీ నేతల సిఫార్సులను పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విడుదల కానున్నవారిలో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రాగిపిండి సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం రాజారెడ్డి హత్యకేసులో మరో 12మందిని విడుదల చేసిన విషయం విదితమే. కాగా 1998లో వైఎస్ రాజారెడ్డిని ప్రత్యర్థులు బాంబులు వేసి వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు. -
వైఎస్ రాజారెడ్డిని చంపించింది బాబే
-
వైఎస్ రాజారెడ్డిని చంపించింది బాబే: భూమన
ఆంధ్రప్రదేశ్‌లో అసలు సిసలు ఫ్యాక్షనిస్టు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఫ్యాక్షన్‌పై చంద్రబాబు మాటలు వింటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ తాత వైఎస్ రాజారెడ్డిని చంపించింది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. రాజారెడ్డిని చంపిన హంతకులను చంద్రబాబు తన నివాసంలో 30 రోజుల పాటు ఉంచుకున్నారని అన్నారు. పథకం ప్రకారమే కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డి హత్య జరిగిందని, ఆయన గన్ లైసెన్సును రెన్యువల్ చేయకపోవడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని భూమన అన్నారు. టెర్రరిస్టు యాక్టివిటీకి చంద్రబాబు కిరీటధారి అని మండిపడ్డారు. అవసరాల కోసం వైఎస్ఆర్ కుటుంబాన్ని చంద్రబాబు గతంలో వాడుకున్నారన్నారు. 1981లో వైఎస్ఆర్ దయతోనే అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబుకు పదవి వచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబు కిరాతకాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.