సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 49మంది ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. అయితే ఖైదీల విడుదల వివాదాస్పదంగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు పంపిన 149మంది జాబితాలో 100మందిని ప్రభుత్వం తిరస్కరించడమే కాకుండా ఖైదీల విడుదలను టీడీపీ నేతల సిఫార్సులను పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విడుదల కానున్నవారిలో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రాగిపిండి సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం రాజారెడ్డి హత్యకేసులో మరో 12మందిని విడుదల చేసిన విషయం విదితమే. కాగా 1998లో వైఎస్ రాజారెడ్డిని ప్రత్యర్థులు బాంబులు వేసి వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు.
Comments
Please login to add a commentAdd a comment