YSR Health Clinics
-
రాష్ట్రంలో వైద్యసేవలు ఇంత మెరుగుపడ్డాయి అంటే కారణం సీఎం వైఎస్ జగన్
-
పట్టణ ప్రాంతాల్లోని పేదలకు అందుబాటులో డాక్టర్ వైయస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు
-
ఐదు రోజుల్లో ఇలా.. విజయవంతంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వైఎస్సార్ విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా ఈ నెల 21 నుంచి రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం ట్రయల్ రన్ జోరుగా కొనసాగుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే 26 జిల్లాల్లోని 3,160 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఐదు రోజుల్లో 89,705 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి ఉచితంగా మందులిచ్చారు. చదవండి: AP: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు పక్షవాతంతో, నరాల బలహీనతలతో నడవలేని వారి ఇళ్లకు డాక్టర్లు, వైద్య సిబ్బం ది స్వయంగా వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం ప్రతి పీహెచ్సీలో ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లను నియమించింది. 104 మొబైల్ మెడికల్ యూనిట్‌తో సహా సిబ్బంది, డాక్టర్‌తో పాటు ఆశా వర్కర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల్లో.. ♦ఓపీల ద్వారా 37,309 మందికి సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు. ♦జ్వరంతో బాధపడుతున్న 11,247మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ♦3,540 మంది గర్భిణులకు యాంటినేటల్ కేర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. ♦607 మంది బాలింతలకు, వారి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ♦2,956మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ♦ఇక జీవనశైలి జబ్బులతో పాటు అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న 34,046 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ♦మరోవైపు.. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్ కిట్లను వైఎస్సార్ విలేజ్ ♦క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ట్రయల్ రన్ అమలును ప్రత్యేక యాప్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తనను తెలుసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ట్రయల్ రన్లో ఎదురయ్యే ఇబ్బందుల ఆధారంగా వాటిని సరిచేసుకుని ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విధానంపై పల్లెల్లోని అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. జగన్‌బాబుకు రుణపడి ఉంటాం నేను బీపీ, షుగర్, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాను. రెండు మూడుసార్లు ప్రైవేట్ ఆçస్పత్రిలో చూపించుకున్నాను. వెళ్లినప్పుడల్లా రూ.4వేలకు పైగా అవుతోంది. ఈసారి మా విలేజ్ క్లినిక్‌లో డాక్టర్‌కి చూపించాను. పరీక్షించి మందులిచ్చారు. ఊర్లోనే డాక్టర్ వైద్యం చేయడం మాలాంటి వృద్ధులకు మంచిది. సీఎం జగన్ బాబుకు రుణపడి ఉంటాం. – సన్యాసిదేవుడు, గన్నవరం, అనకాపల్లి జిల్లా మాలాంటి వారికి ఒక వరం సీఎం పుణ్యాన ఉచితంగా వైద్యం చేయడంతోపాటు ఇంటి వద్దకే వైద్యుడు రావడం సంతోషంగా ఉంది. మాలాంటి బీద వారికి ఫ్యామిలీ డాక్టర్ పథకం ఒక వరం. ఇప్పటివరకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాల్సిన బాధలేదు. – లక్ష్మీదేవి, ముద్దినాయనపల్లి, అనంతపురం జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్కు మంచి ఆదరణ ఈ పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ వస్తోంది. ఇందుకు ఉద్యోగులుగా మా సహకారం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అందిస్తాం. ఇప్పటివరకు పేదలు అప్పులుచేసి పట్టణాల్లో వైద్యం చేయించుకునేవాళ్లు. ఇప్పుడొక ఎంబీబీఎస్ డాక్టర్ నేరుగా ఇంటివద్దే వైద్యం అందించడం గొప్ప విషయం. ప్రజల్లో దీనిపై అవగాహన కలి్పస్తాం. – జక్కల మాధవ, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ప్రజారోగ్యానికే అత్యధిక ప్రాధాన్యత
-
Andhra Pradesh: వడివడిగా నిర్మాణాలు
నా పాదయాత్ర సమయంలో గ్రామాల దుస్థితి చూసి ఆవేదన కలిగింది. అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించకూడదు. నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండరాదు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. ఎఫ్ఎస్టీపీ (మురుగు వ్యర్థాల శుద్ధి) ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలపైనా దృష్టి సారించాలని సూచించారు. అమూల్ పాల సేకరణ చేస్తున్న జిల్లాలు, ప్రాంతాలకు అనుగుణంగా బీఎంసీయూలను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్ కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీటి సరఫరా తదితరాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మురుగు నీటి శుద్ధి ప్రణాళిక జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెసింగ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించారు. నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్ల నుంచి చెత్త సేకరణ ప్రారంభం కాగా ప్రస్తుతం 61.5 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడాలని, మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉన్న దాదాపు 582 ప్రాంతాలను ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించి బయో, వెట్ ల్యాండ్ ట్రీట్మెంట్, వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ తదితర విధానాల్లో రూపొందించిన శుద్ధి ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి కావాలని, నిర్వహణపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రూ.50 కోట్ల చెక్కును ఏపీ అధికారులకు అందిస్తున్న తమిళనాడు అధికారులు వైఎస్సార్ జలకళ.. వైఎస్సార్ జలకళ పురోగతిపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గు అప్పగించి వాటి ద్వారా రైతుల పొలాల్లో బోర్లు తవ్వాలని సూచించారు. బోరు తవ్విన వెంటనే మోటారు కూడా బిగించాలని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ.. గత సర్కారు హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికి వదిలేశారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు విస్తారంగా వర్షాలు కురిశాయని, అప్పటికే అధ్వానంగా ఉన్న రోడ్లు దీంతో బాగా దెబ్బతిన్నాయన్నారు. క్రమం తప్పకుండా చేపట్టాల్సిన నిర్వహణను గత సర్కారు విస్మరించడంతో అన్ని రహదారులకు ఒకేసారి మరమ్మతులు, నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉత్పన్నమైందన్నారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ రూపొందించి ఏ దశలోనూ నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేనాటికి మౌలిక సదుపాయాల కల్పనపై ధ్యాస పెట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విధానం తేవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్‌కుమార్, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
Andhra Pradesh: వేగం పెంచండి
క్యాన్సర్ రోగులకు సమగ్రంగా వైద్యం అందించడంపై మరింత శ్రద్ధ పెట్టాలి. నాలుగైదు విడతల్లో చికిత్స (కీమోథెరపీ) అందించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ వ్యాధిని నయం చేయగలం. అయితే గత ప్రభుత్వంలో ఒకటి రెండు సార్లు చికిత్స అందించి వదిలేసే వారు. దీంతో కొన్నాళ్లకు మళ్లీ వ్యాధి తిరగబెట్టేది. పేదలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే మనందరి ప్రభుత్వం క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద పూర్తి స్థాయిలో ఎన్ని విడతల్లో వైద్యం అవసరమైతే అన్ని విడతల్లోనూ ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గ్రామాలు, వార్డుల్లోని ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చేపట్టిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయ్యాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. పీహెచ్‌సీల్లో నాడు–నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని, డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయని చెప్పారు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం 2022 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పగా.. వీటి నిర్మాణాలు మరింత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయని, అత్యవసర పనులు ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన 16 మెడికల్ కాలేజీల్లో పనుల ప్రగతిని అధికారులు వివరించారు. ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖ జిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. ఈ కేసులను త్వరగా పరిష్కరించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇవికాకుండా 9 చోట్ల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. క్యాన్సర్ రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించడాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. నిరంతర ప్రక్రియగా వైఎస్సార్ కంటి వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద ఇంతకు ముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోని వారికి కంటి పరీక్షలు చేయించాలని సీఎం ఆదేశించారు. కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని, దీనికోసం ఒక వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కంటి వెలుగు కార్యక్రమం అమలు ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మందికి కంటి అద్దాలు ఇచ్చామని తెలిపారు. 60 ఏళ్ల పైబడ్డ 13,58,173 మందికి పరీక్షలు చేశామన్నారు. ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి ఇచ్చామని, మరో 1,00,223 మందికి శస్త్ర చికిత్సలు చేయించామని వివరించారు. మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా కంటి వెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయని తెలిపారు. త్వరిత గతిన హెల్త్ హబ్స్ ఏర్పాటు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. మొత్తం 16 చోట్ల ఏర్పాటయ్యే హెల్త్ హబ్స్‌కు సంబంధించి, ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా త్వరగా ఆ పని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణనీయంగా పెరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు ► 2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న 1059 వైద్య ప్రక్రియలు 2019 జూన్ తర్వాత 2,446కు పెంపు. ► 2019 జూన్‌కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న 919 కవరేజీ ఆస్పత్రులు.. ఆ తర్వాత 1,717కు పెంపు. ► కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి ► 2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు 1,570 మందికి లబ్ధి కలిగితే.. ప్రస్తుతం 3,300 మందికి లబ్ధి. ► బధిర, మూగ వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు. ► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు. ఇప్పటి వరకు 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ.439.4 కోట్లు చెల్లింపు. ► శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఇల్లు గడవడం కోసం రోజుకు రూ.225 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్, వ్యాక్సినేషన్ పరిస్థితి ఇలా.. ► మొత్తం పాజిటివ్ కేసులు 3,366 ► పాజిటివిటీ రేటు 0.7 శాతం ► పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12 ► పాజిటివిటీ రేటు 2 కంటే ఎక్కువగా ఉన్న జిల్లా 1 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 23,457 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311 ► డిసెంబర్ 15 నాటికి ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు మొత్తం 140 ► సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు 1,17,71,458 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు 2,17,88,482 ► మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు 3,35,59,940 ► మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 -
Andhra Pradesh: పట్టణ ప్రజలకు ఆరోగ్య భరోసా
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై జబ్బున పడ్డ సర్కారీ వైద్యానికి సీఎం వైఎస్ జగన్ చికిత్స చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో పాటు, ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత ప్రజలకు సర్కార్ వైద్యాన్ని చేరువ చేయడం కోసం ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్మాణం వడివడిగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 259 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండేవి. పెరిగిన పట్టణ జనాభా, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’లుగా మార్చడంతో పాటు, కొత్తగా 301 క్లినిక్‌ల ఏర్పాటుకు గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ వైపు సొంత భవనాలు సమకూరుస్తూనే.. ఆగస్టు 15 నుంచి తాత్కాలిక భవనాల్లో వైద్య సేవలను ప్రారంభించింది. 30 వేల మందికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ లెక్కన గత టీడీపీ ప్రభుత్వం 50 వేల జనాభాకు ఒకటి చొప్పున పట్టణ ప్రాథమిక కేంద్రాలు కేవలం 73 మున్సిపాలిటీల్లో 259 మాత్రమే ఉండేవి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు వైద్యం కోసం పడుతున్న అగచాట్లను సీఎం వైఎస్ జగన్ సర్కార్ గుర్తించింది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి పట్టణాల్లో 30 వేల జనాభాకు ఒకటి చొప్పున వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. గుంటూరు రెడ్డిపాలెంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ సొంత భవనాల నిర్మాణం వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లకు సొంత భవనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్న సొంత భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. సొంత భవనాలు 205 ఉండగా, వీటిలో 150 భవనాలకు ఇప్పటికే మరమ్మతు పనులు పూర్తయ్యాయి. మిగిలిన భవనాల మరమ్మతులు వివిధ దశల్లో ఉన్నాయి. 355 క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉండగా, 345 భవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. వీటిలో 343 భవనాల నిర్మాణానికి స్థలాలు సేకరించి, శంకుస్థాపనలు చేశారు. ఈ భవనాల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఒక్కో భవనానికి రూ.80 లక్షలు ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.80 లక్షలు, సొంత భవనాల మరమ్మతులకు ఒక్కోదానికి రూ.10 లక్షలు వెచ్చిస్తోంది. కొత్తగా నిర్మించే భవనాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రోగులు వేచి ఉండే గది, అవుట్ పేషెంట్, ప్రసూతి, డ్రెస్సింగ్, లేబోరేటరి, ఫార్మసీ గదులు, ఆపరేషన్ థియేటర్, కౌన్సెలింగ్ హాల్, మహిళలు, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు ఉండేలా నిర్మిస్తున్నారు. సేవలు ఇలా.. ► ప్రతి వార్డుకు రెండు కిలోమీటర్ల దూరం లోపు లేదా 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది. ► గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండే వారు. ► గతంలో 73 మున్సిపాలిటీల్లో మాత్రమే పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో అందుబాటులోకి వచ్చాయి. ► ఇప్పటికే ఉన్న 61 మంది డాక్టర్లకు అదనంగా ప్రభుత్వం 499 మందిని నియమించింది. ► గతంలో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పది పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డెలివరీలు సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ► వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లలో 65 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. ► ఇప్పటికే 206 రకాల మెడిసిన్స్‌ను ప్రభుత్వం క్లినిక్‌లలో అందుబాటులో ఉంచింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం 32 రకాల ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. నవంబర్‌కు పూర్తి నవంబర్ ఆఖరుకు వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళుతున్నాం. పనుల్లో నాణ్యత లోపించకుండా చూస్తున్నాం. – డాక్టర్ వి.చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్, మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చదవండి: హ్యాట్సాఫ్ టు సీయం జగన్ ఏపీలో అందరికీ ఆరోగ్య ధీమా -
Andhra Pradesh: ఊరికి ఆరోగ్య రేఖ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం డిసెంబర్‌లోగా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 7,112 మంది మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించనుంది. ఇప్పటికే 2,920 క్లినిక్‌లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు. ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్మెంట్ను అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే 10,032 విలేజ్ క్లినిక్‌లలో ఏఎన్ఎంలు 24 గంటలూ అందుబాటులో ఉన్నారు. హెల్త్ అసిస్టెంట్‌తో పాటు ఆశా వర్కర్లు క్లినిక్‌లో ఉంటారు. చదవండి: భూ సర్వేపై 26 నుంచి శిక్షణ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ అనుసంధానం విలేజ్ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలు, ల్యాబ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. తద్వారా టెలి మెడిసిన్ వైద్య సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. మండలానికి రెండు పీహెచ్‌సీలను అందుబాటులోకి తేవడమే కాకుండా ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి డాక్టర్లు ఉంటారు. ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్ క్లినిక్స్‌కు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్ ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం స్పష్టంగా ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్లినప్పుడు చికిత్సకు ఆరోగ్య శ్రీ కార్డులోని వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యం అదించడానికి ఉపయోగపడుతుంది. చదవండి: లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు ఇవీ – గర్భిణులకు, చిన్నారుల సంరక్షణకు అవసరమైన వైద్య సేవలు – నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు – బాల్యం, కౌమార దశ ఆరోగ్య సంరక్షణ సేవలు – కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు – అంటు వ్యాధుల నిర్వహణ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు – తీవ్రమైన సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్ అవుట్ పేషెంట్ కేర్ – అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ – సాధారణ ఆఫ్తాల్మిక్ (కంటి సమస్యలు), ఈఎన్టీ సమస్యల కోసం జాగ్రత్తలు – ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ – వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు – కాలిన గాయాలకు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు – మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ వైద్య రంగంలో పెనుమార్పులు గ్రామాల్లోని ప్రజలు తమ ఊరు దాటి వెళ్లకుండా ఉన్న ఊరిలోనే వైద్య చికిత్సలు అందించేందుకు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. దీంతో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక బాధ్యతగా ప్రభుత్వ రంగంలోనే వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కానున్నాయి. ఒక్కో విలేజ్ క్లినిక్‌లో అవుట్ పేషెంట్ రూమ్, ఎగ్జామినేషన్ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్ హాల్, ఏఎన్ఎం క్వార్టర్స్ ఉంటాయి. 14 రకాల ప్రాథమిక పరీక్షలు ఇవీ... ► హిమోగ్లోబిన్, గర్భవతులకు యూరిన్ పరీక్ష, ఇతర యూరిన్ టెస్టులు, బ్లడ్ షుగర్, మలేరియా, హెచ్ఐవీ, డెంగీ, కంటి పరీక్షలు, అయోడిన్ సాల్ట్ పరీక్షలు, వాటర్ టెస్టింగ్, హెపటైటిస్ బి, ఫైలేరియా, ర్యాపిడ్ టెస్ట్, కఫం పరీక్షలు. -
ఏపీలో మొదలైన వైద్యవిప్లవం
నాణ్యమైన వైద్యం పొందాలన్నా, వైద్య విద్య చదవాలన్నా దీర్ఘకాలంగా పొరుగు రాష్ట్రాలమీద ఆధార పడుతున్నాం. కానీ వైద్యానికి పెద్ద పీట వేస్తూ ఆ దిశగా సాగు తున్న అభివృద్ధి చిరకాల సమస్యలకు చరమగీతం పాడనుంది. ఏపీలో 8,000 కోట్ల రూపాయలతో కొత్తగా 16 మెడికల్ కళాశాలల నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం. ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 2,410 సీట్లు, మరో 20 ప్రైవేటు కాలేజీల్లో 2,800 సీట్లు, వెరసి 5,210 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త వైద్య కళాశాలలతో ఏటా మరో రెండు వేల మంది చదువుకునే అవకాశం కలగనుంది. తాజాగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీసు కున్న నిర్ణయం వైద్యవిద్యా యజ్ఞానికి మరింత మేలు చేకూరుస్తుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యు యేషన్ (ఎంబీబీఎస్) సీట్లు ఎన్నుంటాయో, వాటికి సమానంగా పీజీ సీట్లు కూడా పెంచుకొవచ్చనేది ఆ నిర్ణయ సారాంశం. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,275 పీజీ సీట్లు పెరుగుతాయి. కొత్తగా ఏర్పాటవుతున్న కళాశాలల్లో మరో 2,000 పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొత్త మెడికల్ కళాశాలలతో 32 విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో బాటు ప్రతీ కళాశాలకు ఒక 500 పడకల అనుబంధ ఆసుపత్రి ఏర్పాటవుతుంది. అంటే మరో 8,000 పడకలు పెరుగుతాయి. కోవిడ్ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని ప్రతీ అనుబంధ ఆసు పత్రిలో ఒక ఆక్సిజెన్ స్టోరేజ్ ప్లాంటు, ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణం అవుతాయి. 2023 నాటికి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తోంది. కొత్త కాలేజీల వల్ల 12 వేల మందికి శాశ్వత ఉపాధి లభిస్తుంది. సీనియర్ వైద్యులకు ప్రొఫెసర్ల హోదా, వైద్యులు, వైద్యబోధకుల నియామకాలతో పాటు నర్సింగ్, లాబ్ టెక్నీషియన్, ఐటీ, ఎలక్ట్రికల్ వంటి ఉద్యోగాలు కూడా భర్తీ అవుతాయి. కోవిడ్ మహమ్మారి వేళ మన దేశంలో వైద్య సౌకర్యాల్లో బేలతనాన్ని కళ్లారా చూశాం. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టరు ఉండాలి. కానీ దేశంలో 1,457 మందికి ఒక అల్లోపతి డాక్టర్ ఉన్నారు. వైద్య సదుపాయాల కల్పనలో మనదేశం ప్రపంచంలో 67వ స్థానంలో ఉంది. ఇంకా మన అవసరాలకు ఆరు లక్షల మంది వైద్యులు, ఇరవై లక్షల మంది నర్సులు కావాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవే టుల్లో 31 మెడికల్ కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ కొత్త 16 కళాశాలలు అందుబాటులోకి వస్తే వీటి సంఖ్య 48కి చేరుతుంది. ఇంతవరకూ ఉన్న వెనుకబాటుతనాన్ని సవరించుకుంటూ దేశంలోనే వైద్యవసతుల్లో అత్యున్నత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగనుంది. ఇవే కాకుండా ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం దక్కాలనే దీర్ఘదృష్టితో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఎన్నో సంస్కరణలు తెస్తున్నారు. గ్రామాల్లో 10,111 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు కాగా, 1,692 కోట్ల వ్యయంతో 854 కొత్త క్లినిక్స్ నిర్మాణం జరుగుతోంది. జ్వరమొస్తే డోలీ కట్టుకుని మైళ్ళ దూరం నడిచి ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న ఏజెన్సీవాసుల కోసం 246 కోట్ల వ్యయంతో 5 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు జరుగుతోంది. ఇకపై రాష్ట్రంలో ప్రతీ మండలంలో రెండు పీహెచ్ సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి డాక్టర్లు ఉండేటట్టు మార్పులు జరుగుతున్నాయి. పట్టణాల్లో పేదల వైద్యం కోసం ఇప్పటికే 560 యూహెచ్‌సీ (అర్బన్ హెల్త్ క్లినిక్)లు ఏర్పాటైనాయి. 355 కోట్లతో వాటికి 355 కొత్త భవనాలు, 265 పీహెచ్‌సీల మరమ్మతులకు 61.5 కోట్లు వ్యయం చేస్తోంది. ప్రస్తుతమున్న 11 మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రులను 3,820 కోట్లలో ఆధునీకరిస్తున్నారు. 682 కోట్ల రూపాయలతో 52 ఏరియా ఆస్పత్రులు, 528 కోట్ల రూపాయలతో 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధి జరుగుతోంది. 13 కోట్ల రూపాయలతో రెండు మాతా శిశు సంరక్షణా కేంద్రాల మంజూరీ జరిగి, నిర్మాణాల కోసం సిద్ధమౌతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే ఏపీలో అందరికీ కార్పొరేట్ వైద్యం సంకల్పం నెరవేరనుంది. - చిలుకూరి శ్రీనివాసరావు వ్యాసకర్త ఉపాధ్యాయుడు