YSR Health Clinics To Come Up in Andhra Pradesh | Details Inside - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఊరికి ఆరోగ్య రేఖ

Published Mon, Aug 23 2021 2:09 AM | Last Updated on Mon, Aug 23 2021 4:50 PM

Construction of Rural YSR Health Clinics will be completed by December - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం డిసెంబర్‌లోగా బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన 7,112 మంది మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమించనుంది. ఇప్పటికే 2,920 క్లినిక్‌లలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు. ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్‌ మెడికిల్‌ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే 10,032 విలేజ్‌ క్లినిక్‌లలో ఏఎన్‌ఎంలు 24 గంటలూ అందుబాటులో ఉన్నారు. హెల్త్‌ అసిస్టెంట్‌తో పాటు ఆశా వర్కర్లు క్లినిక్‌లో ఉంటారు. చదవండి: భూ సర్వేపై 26 నుంచి శిక్షణ 



ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ అనుసంధానం 
విలేజ్‌ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలు, ల్యాబ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. తద్వారా టెలి మెడిసిన్‌ వైద్య సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. మండలానికి రెండు పీహెచ్‌సీలను అందుబాటులోకి తేవడమే కాకుండా ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరేసి డాక్టర్లు ఉంటారు. ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్‌ క్లినిక్స్‌కు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్‌ ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం స్పష్టంగా ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్లినప్పుడు చికిత్సకు ఆరోగ్య శ్రీ కార్డులోని వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యం అదించడానికి ఉపయోగపడుతుంది. చదవండి: లోకేశ్‌ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష

12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు ఇవీ
– గర్భిణులకు, చిన్నారుల సంరక్షణకు అవసరమైన వైద్య సేవలు 
– నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు
– బాల్యం, కౌమార దశ ఆరోగ్య సంరక్షణ సేవలు
– కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు
– అంటు వ్యాధుల నిర్వహణ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు
– తీవ్రమైన సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్‌ అవుట్‌ పేషెంట్‌ కేర్‌
– అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ
– సాధారణ ఆఫ్తాల్మిక్‌ (కంటి సమస్యలు), ఈఎన్‌టీ సమస్యల కోసం జాగ్రత్తలు
– ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ
– వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు
– కాలిన గాయాలకు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు
– మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ 

వైద్య రంగంలో పెనుమార్పులు
గ్రామాల్లోని ప్రజలు తమ ఊరు దాటి వెళ్లకుండా ఉన్న ఊరిలోనే వైద్య చికిత్సలు అందించేందుకు వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. దీంతో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్‌ పరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తే, ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం సామాజిక బాధ్యతగా ప్రభుత్వ రంగంలోనే వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కానున్నాయి. ఒక్కో విలేజ్‌ క్లినిక్‌లో అవుట్‌ పేషెంట్‌ రూమ్, ఎగ్జామినేషన్‌ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్‌ ఉంటాయి.

14 రకాల ప్రాథమిక పరీక్షలు ఇవీ...
► హిమోగ్లోబిన్, గర్భవతులకు యూరిన్‌ పరీక్ష, ఇతర యూరిన్‌ టెస్టులు, బ్లడ్‌ షుగర్, మలేరియా, హెచ్‌ఐవీ, డెంగీ, కంటి పరీక్షలు, అయోడిన్‌ సాల్ట్‌ పరీక్షలు, వాటర్‌ టెస్టింగ్, హెపటైటిస్‌ బి, ఫైలేరియా, ర్యాపిడ్‌ టెస్ట్, కఫం పరీక్షలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement