మేడ్ ఇన్ ఇండియా యుఫోరియా స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్ : వైయు బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా యుఫోరియా ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. పూర్తిగా భారత్‌లోనే తయారుచేసిన ఈ ఫోన్ ధర రూ.6,999 అని వైయు వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. లక్ష ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఈ నెల 21-23ల మధ్య వీటి విక్రయాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్ 4జీని కూడా సపోర్ట్ చేస్తుంది.