yv rao
-
వైవీ రావు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వైవీ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: వాహనదారులకు అలర్ట్! విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. -
‘ఈనాడు ఇటువంటి వార్తలు రాయడం బాధాకరం’
సాక్షి, విజయవాడ: ఈనాడు లాంటి పత్రిక ఇటువంటి వార్తలు రాయడం బాధాకరమని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ దారులకు పెన్షన్ కష్టాలని ఈనాడులో వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. ఈనాడుతో పాటు మరో పత్రిక కూడా 5వ తేదీ వరకు జీతాలు రావడం లేదని రాసింది.. కానీ ఉద్యోగుల జీతాలు 3వ తేదీనే వచ్చాయని వెల్లడించారు. తప్పుడు వార్తలు రాయడాన్ని వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. ఉద్యోగులను, పెన్షన్ దారులను కొన్ని పత్రికలు తప్పు తోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాసి ప్రజల్లో చులకన కావద్దని సూచించారు. 3 లక్షల 70 వేల మంది పింఛన్ దారుల్లో చాలామందికి పెన్షన్ వచ్చిందని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వల్ల కొంతమందికి ఒకటి రెండు రోజులు ఆలస్యమైందన్నారు. దానిని పట్టుకుని పెన్షన్ దారులకు పెన్షన్ కష్టాలంటూ ఈనాడు తప్పడు వార్తలు రాయడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మద్య దూరం పెంచాలన్న ఉద్దేశంతోనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులలో విశ్రాంత ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇళ్ల స్థలాలు లేని విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఉద్యోగులకు అడగకుండానే అన్ని సౌకర్యాలను సీఎం జగన్ కల్పిస్తున్నారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జీతాలు అందరికి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ జేఎసీ ప్రధాన కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ కష్టమని ఈనాడులో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈనాడులో వచ్చిన వార్త అవాస్తవమని, విశ్రాంత ఉద్యోగులలో చాలా మందికి పెన్షన్ వచ్చిందన్నారు. జీతాలు, పెన్షన్ విషయంలో పత్రికలు విజ్ఞత పాటించి వార్తలు రాయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతి అని వాస్తవాలను ఉద్యోగులు, పెన్షన్ దారులు గ్రహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని, ఇటు వంటి వార్తలను తాము ఖండిస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి. జయబాబు మాట్లాడుతూ... 3 లక్షల 70 వేల మంది పెన్షన్ దారులు ఉన్నారని వాళ్లకు పెన్షన్ కష్టమని ఈనాడులో వార్త రాశారన్నారు. ఈనాడులో రాసిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికే చాలా మంది విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యోగులను,పెన్షన్ దారులను తప్పు తోవ పట్టించే విధంగా వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
విజయవాడ:ఉషా కార్డియాక్ సెంటర్ పై ఓ ఛానల్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ ఆస్పత్రి ఎండీ వై.వీ.రావు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన నర్సయ్య అనే రోగి శనివారం చనిపోతే.. మూడు రోజుల క్రితమే ఆ పేషెంట్ మరణించాడని ఆ ఛానల్ తప్పుడు కథనాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 5 గంటలకు తీసిన ఈసీజీ రిపోర్ట్ కూడా తమ వద్ద ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ పేషెంట్ ను అయిదురోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన అనంతరం రూ.7 వేలు బిల్లు మాత్రమే వేశామన్నారు. ఆ ఛానల్ సిబ్బంది పేషెంట్ బంధువులను బెదిరించి తప్పుడు సమాచారం చెప్పించారన్నారు. ఛానల్ పాపులారటీ కోసం తప్పడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. -
ఆదుకోకుంటే నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది. ప్రభు త్వ లోపభూయిష్ట విధానాలే ఆర్టీసీ నష్టాలకు కారణమని, సంస్థను ఆదుకోవాలనే డిమాం డ్తో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో సమ్మె చేస్తామని ఈయూ గౌరవాధ్యక్షుడు, ఎంఎల్సీ పి.జె.చంద్రశేఖరరావు, అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్లు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్లోని ఆర్టీసీ ఈయూ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంఘం ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ విలేకరుల సమావేశంలో వివరించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణంతో యాజమాన్యం కార్మికులకు చెందిన సీసీఎస్, ఎస్బీటీ, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ ట్రస్టుల డబ్బు వాడుకొందని తెలిపారు. కార్మికులకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వకపోతే ఈ నెల 2 నుంచి సమ్మె చేయడానికి సిద్ధపడ్డామని చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రవాణా మంత్రులు ఆర్టీసీని ఆదుకుంటామని, 20 రోజుల్లో రూ.775 కోట్లు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేసినట్లు తెలిపారు. సంస్థ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఈ నెల 2న సమ్మె నోటీసిచ్చినట్లు చెప్పారు. సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలూ ప్రారంభించలేదని తెలిపారు. దీంతో సమ్మె నోటీసు కాలపరిమితి 41 రోజులు వచ్చే నెల 11కు పూర్తవుతున్నందున తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మెను జయప్రదం చేసేందుకు వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్ షాపుల వద్ద సమ్మె సన్నాహక సభలు నిర్వహిస్తామని పద్మాకర్ తెలిపారు. ఆర్జీసీకి ప్రభుత్వ బకాయిలు తక్షణం చెల్లించాలని, ప్రొడక్షన్ యూని ట్లలో అవగాహన ఒప్పందం వెంటనే అమలుచేయాలని, పే స్కేల్, డీఏ వంటి డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్టు యూనియన్ రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు ‘సాక్షి’కి తెలిపారు.