'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు' | some channel telecasted fake news on usha cardiac centre, says YV Rao | Sakshi
Sakshi News home page

'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

Published Sat, Aug 30 2014 7:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

విజయవాడ:ఉషా కార్డియాక్ సెంటర్ పై ఓ ఛానల్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ ఆస్పత్రి ఎండీ వై.వీ.రావు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన నర్సయ్య అనే రోగి శనివారం చనిపోతే..  మూడు రోజుల క్రితమే ఆ పేషెంట్ మరణించాడని ఆ ఛానల్ తప్పుడు కథనాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 5 గంటలకు తీసిన ఈసీజీ రిపోర్ట్ కూడా తమ వద్ద ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ పేషెంట్ ను అయిదురోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన అనంతరం రూ.7 వేలు బిల్లు మాత్రమే వేశామన్నారు.

 

ఆ ఛానల్ సిబ్బంది  పేషెంట్ బంధువులను బెదిరించి  తప్పుడు సమాచారం చెప్పించారన్నారు. ఛానల్ పాపులారటీ కోసం తప్పడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement