Zero budget
-
సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!
కాళ్లకు చక్రాలుంటే బావుణ్ణు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేశమంతా చుట్టేయవచ్చు. ఈ కోరిక చాలామందికే ఉంటుంది. తమిళనాడుకి చెందిన సరస్వతి అయ్యర్ మాత్రం ఈ మాటను నిజం చేస్తోంది. నిజం చేయడమంటే కాళ్లకు చక్రాలు కట్టుకోలేదు కానీ కాళ్లకు పని చెబుతోంది, చక్రాలున్న వాహనాల్లో హిచ్‌హైకింగ్ (ఆ దారిలో వెళ్లే వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ వెళ్లడం) చేస్తూ పర్యటిస్తోంది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఆ మూలకు అటూ ఇటూ పర్యటించేసింది. ఉమన్ సోలో ట్రావెల్ ఒక ట్రెండ్‌గా మారిన ఈ రోజుల్లో సోలో ట్రావెల్‌తోపాటు జీరో బడ్జెట్ ట్రావెల్ కూడా సాధ్యమేనని నిరూపించింది సరస్వతి అయ్యర్.జీవితాన్ని చదివేస్తోంది!సరస్వతి అయ్యర్ రెండేళ్ల కిందట ఉద్యోగం నుంచి విరామం తీసుకుంది. ఉద్యోగం చేయడానికి పుట్టలేదు, ఇంకా ఏదో సాధించాలనుకుంది. దేశమంతా చుట్టి వచ్చిన తర్వాత తన గురించి తాను సమీక్షించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రయాణం కట్టింది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమె దగ్గర ఉన్నది రెండు జతల దుస్తులు, ఒక గుడారం, ఫోన్ చార్జింగ్ కోసం ఒక పవర్ బ్యాంక్. ఈ మాత్రం పరిమితమైన వనరులతో ఆమె పర్వత శిఖరాలను చూసింది. మారుమూల గ్రామాలను పలకరించింది. దేవాలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. బస కోసం ఆలయ్ర ప్రాంగణాలు, ఆశ్రమాలు, ధర్మశాలలను ఎంచుకుంది. భోజనం కూడా అక్కడే. ఎక్కడైనా శ్రామికులు పని చేస్తూ కనిపిస్తే వారితో కలిసి పని చేస్తోంది. వారితో కలిసి భోజనం చేస్తోంది. పొలంలోనే గుడారం వేసుకుని విశ్రమిస్తోంది. ఈ పర్యటన ద్వారా ఆమె ఇస్తున్న సందేశం మహిళలు సోలో ట్రావెల్ చేయగలరని నిరూపించడం మాత్రమే కాదు. మనదేశంలో మహిళలకు ఉన్న భద్రతను చాటుతోంది. ఒక సాహసం చేయాలంటే అది అంత ఖరీదైనదేమీ కాదని. అలాగే... ఒక పర్యటన జీవిత దృక్పథాన్ని మార్చేస్తుందనే జీవిత సత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది సరస్వతి అయ్యర్.(చదవండి: నృత్యం చిత్తరువు అయితే..!) -
కొత్త ప్రయోగంతో...
‘‘జీరో బడ్జెట్‌తో ‘గండ’ సినిమాని తీసి, వినూత్న ప్రయోగానికి తెరతీశాం. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాని అందరూ ఆదరించాలి’’ అని వారణాసి సూర్య అన్నారు. ఈజీ మూవీస్ బేనర్‌పై వారణాసి సూర్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘గండ’ మూవీ రేపు(శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వారణాసి సూర్య మాట్లాడుతూ–‘‘మా ఈజీ మూవీస్ సంస్థ త్వరలో ఓ పెద్ద సంస్థతో కలిసి కొత్త ్ర΄ాజెక్ట్స్ చేయనుంది. అలాగే విజయ్ జెడని దర్శకుడిగా పరిచయం చేస్తూ మరో జీరో బడ్జెట్ సినిమా చేయబోతున్నాం. ఇండస్ట్రీలో కేవలం పింఛన్‌పై ఆధారపడిన చిన్న నిర్మాతలకు మా సంస్థ ద్వారా సాయం చేయాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. -
Natural Farming: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు
సమస్త జీవకోటి భారాన్ని మోసేది నేల. గతం నుండి మన తరానికి సంక్రమించిన వారసత్వ సంపద నేల. నేలను సారవంతంగా ఉంచే కారకాలు అపరిమితమైనవి కాదు, పరి మితమైనవి. విచ్చలవిడిగా భూమిని వాడిపడేస్తే... అది త్వరలోనే వట్టిపోతుంది. మనం ఈ భూమి మీద నివసిస్తున్నట్లే భవిష్యత్తు తరాలూ మనుగడ సాగించాలంటే... వారికి పనికి రాని నేలను కాక... సజీవమైన భూమిని అప్పగించాల్సిన బాధ్యత మనదే. మనుషుల నిర్లక్ష్యం, పేరాశ కారణంగా సాగు భూమి నిస్సారమైపోతోంది. నేల సేంద్రియ కర్బన పదార్థాలను కోల్పోయి పంటల సాగుకు పనికి రాకుండా పోతున్నది. వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనాలను వాడటం వల్ల నేల నిస్సారమవుతున్నది. అధిక మొత్తంలో రసాయనాలు వాడిన ఫలి తంగా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు తిన్న జీవజాలం అనారోగ్యం పాలవుతుంది. కన్న తల్లి పాలు కూడా పంటలపై చల్లే రసాయనాల కారణంగా విషతుల్య మవుతున్నాయని రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్ ఇంద్రసోని పాల్ తెలిపారు. విషతుల్యమైన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పిల్లల రోగ నిరోధక శక్తి నశిస్తుందనీ, తెలివితేటలు, జ్ఞాపకశక్తి దెబ్బతింటాయనీ ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. అందుకే వ్యవసాయ విధానం ప్రకృతికి దగ్గరగా ఉండాలనే నినాదం ఇప్పుడు ఊపందుకుంది. అందులో భాగంగా నేలలోని సారం దీర్ఘకాలం మన గలిగే నిర్వహణ పద్ధతులు ప్రచారం చేస్తున్నారు. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం అని తాత్వికతతో వ్యవసాయాన్ని సాగించాలి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికీ, పర్యావరణాన్ని సుస్థిరమైనదిగా తయారు చేయ డానికీ, రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికీ, సహజ వనరు లను ఉపయోగించి మంచి ఫలసాయం సాధించడానికీ, ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా ‘రైతు సాధికార సంస్థ’ ద్వారా జీరో–బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి బహుళ లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. రైతుల సాగు ఖర్చులను తగ్గించడం, రైతుల దిగుబడిని మెరుగుపరచడం, వారి నష్టాలను తగ్గించడం, లాభదాయ కమైన ధరలను పొందడం ద్వారా వారి నికర ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అధిక ధర కలిగిన కృత్రిమ ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు ఉపయోగించకుండా ప్రకృతికి అనుగుణంగా గోమూత్రం, గో పేడ, వేప ఆకులు, స్థానిక వనరులతో... ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివాటిని తయారుచేసుకుని వ్యవసాయంలో ఉపయోగించడానికి ప్రోత్సహిస్తోంది. ఇందువల్ల నేలలో జీవ పదార్థం అధికమవ్వడమే కాక మొత్తంగా భూసారం పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మానవ ఆరోగ్యమే కాక, నేల ఆరోగ్యాన్నీ కాపాడవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) – ఎ. మల్లికార్జున, ప్రకృతి వ్యవసాయ శిక్షకుడు -
కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మన మూవీస్
-
ఖర్చు లేని సాగుకు రూ.వేల కోట్ల అప్పు!
సాక్షి, అమరావతి : పెట్టుబడి లేని వ్యవసాయం (జీరో బడ్జెట్ ప్రకృతి సాగు) ముసుగులో అప్పులు చేస్తూ రైతులకు శిక్షణలు, సదస్సులు, ఈవెంట్ల పేరుతో ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కాజేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రకృతి సాగు కోసం శిక్షణలు, భోజనాలు, సామర్థ్యం పెంపు పేరుతో కేంద్రం నుంచి వివిధ పథకాల కింద అందే రూ.100 కోట్లను వ్యయం చేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని వ్యవసాయ శాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు. కేంద్రం అనుమతి కోసం ప్రతిపాదనలు రాష్ట్రంలో వచ్చే ఆరేళ్లలో పెట్టుబడి లేని ప్రకృతి సాగు కోసం రూ.16,000 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనా వేశారు. వివిధ సంస్థల నుంచి ఈమేరకు అప్పులు చేయనున్నారు. చంద్రబాబు గతంలో అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రకృతి సాగు కోసం కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి అప్పు చేసేందుకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో రూ.2,046 కోట్ల అప్పు కోసం వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపడంపై ఆర్థికశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటూ శిక్షణలు, సదస్సుల కోసం రూ.వేల కోట్ల అప్పులు చేయడం తగదని సూచించింది. ఈ అప్పుల వల్ల ఎలాంటి ఉత్పాదకత, సంపద సమకూరడం లేదని పేర్కొంది. ప్రాజెక్టులో దేనికి ఎంత వ్యయం చేస్తారు? ఎన్ని ఎకరాల్లో ప్రకృతి సాగు చేపడతారు? తదితర వివరాలను పేర్కొనక పోవడంపై అభ్యంతరం తెలిపింది. అసలు ఈ కార్యక్రమం అమలుకు ఏదైనా వ్యవస్థ ఉందా? లేక అదనపు పోస్టులు కావాలంటారా? అని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. అయితే బ్యాంకు నుంచి అప్పు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఒత్తిడి తేవడంతో గత్యంతరం లేక తొలిదశలో రూ.2,046 కోట్ల రుణానికి అనుమతిస్తూ గత బుధవారం జీవో జారీ చేసింది. అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని జీవోలో పేర్కొన్నారు. మొత్తం రూ.2,046 కోట్ల విలువైన ప్రాజెక్టులో కేఎఫ్‌డబ్ల్యూ రూ.1,650 కోట్లను రుణంగా ఇవ్వనుంది. రూ.85 కోట్లను గ్రాంటుగా మంజూరు చేయనుంది. మిగతా రూ. 311 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద భరించనుంది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధిని 2024 వరకు ప్రతిపాదించారు. మరి రసాయన ఎరువుల అవసరం ఏముంది? ఏపీలో లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్‌తో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని, రైతులు పెద్ద ఎత్తున ఈ పథకంలో చేరుతున్నారంటూ ప్రతిపాదనలను పంపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎరువులు, పురుగుమందుల కోటాను తగ్గించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యవసాయశాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయంలోకి మారిస్తే రసాయన ఎరువులు అవసరం ఏముందని కేంద్రం ప్రశ్నిస్తే ఏం చేయాలని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం పేరుతో రైతులను బస్సుల్లో తరలిస్తూ శిక్షణ కింద రూ.వందల కోట్లను స్వచ్చంధ సంస్థలకు దోచి పెడుతూ కమీషన్లు కాజేస్తున్నారని వ్యవసాయ శాఖ ఉద్యోగులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
జీరో బడ్జెట్ వ్యవసాయం జీరోనే
రైతుకి భూమికి ఉన్న అనుబంధం తెలిసినవారు వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ఆ అనుబంధం తెలియని వాడు చంద్రబాబునాయుడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితిలో తనకు వ్యవసాయంపై మాట్లాడటానికి ఆహ్వానం వచ్చిందని రకరకాల చిందులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి ప్రపంచ వేదికల మీద చెప్పిన అబద్ధాలు సామాన్య జనానికికూడా అర్థమవుతోంది. ఇప్పటికే 60 వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో పాలేకర్ విధానంలో వ్యవసాయంలో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదం. అయితే ఎక్కడ ఉన్నారో చూపిస్తే అది ఎంత వరకు నిజమో తెలుస్తుంది. ఆవు ఉన్న ప్రతీ రైతు సహజసేద్యం చేస్తున్నట్లు లెక్కలు చూపించి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2029కి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పాలేకర్ సేద్యంలో తీసుకెళ్ళడానికి ప్రణాళిక. దానికి దాదాపు రూ. 16,000 కోట్లు అప్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇది రైతులకు మేలు చేసే కార్యక్రమం కాదు అన్నది నిస్సందేహం. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి వెళుతున్నానని, మోదీకన్నా నేనే గొప్పవాడినని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం ఆయనకు అలవాటే, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. దాని పక్క చాలా హాల్స్ ఉంటాయి. దానిలో ఎప్పుడూ ఏదో ఒక సెమినార్లు, మీటింగ్‌లు అనేక విషయాలపై జరుగుతుంటాయి. వీటికి ఎవరైనా తమ సొంత ఖర్చులపై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదేదో ఏపీ ముఖ్యమంత్రి ఒక్కడికే అవకాశం వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ దాని వెనుక ఉన్న రహస్యం రైతులు చేసే వ్యవసాయం పేరుతో అప్పు తెచ్చుకోవడం. ఐక్యరాజ్యసమితిలో సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ, పీఎన్బీ పరిబాస్, యూఎన్ ఎన్విరాన్ మెంటల్ ప్రోగ్రాం, ఎ వరల్డ్ ఆగ్రా పార్స్టీ సెంటర్ అన్నీ కలిపి పెట్టిన ఒక సెమినార్‌కు చంద్రబాబు హాజరై దానిలో వ్యవసాయం గురించి మాట్లాడటం జరిగింది. అసలు చంద్రబాబుకి వ్యవసాయం అంటే తెలుసా? ఎందుకంటే వ్యవసాయం దండగని చెప్పిన బాబు రైతులను తొలి నుంచీ దగాచేస్తూనే వచ్చారు. వ్యవసాయంలో ప్రకృతి, సేంద్రీయ, జీవరసాయన ఎరువుల వ్యవసాయం వంటి పద్ధతులు ఉన్నాయి. కొండకోనలో ఎవరు ఏమీ చేయకపోయినా ఏదో ఒక పండ్లు కానీ ఇతరత్రా పంటలు కానీ పండేది ప్రకృతి వ్యవసాయం. పశువుల ఎరువు, ఇతర వర్మికంపోస్టుల నుంచి తయారు చేసిన ఎరువులతో చేసేది సేంద్రీయ వ్యవసాయం. జీవరసాయన వ్యవసాయం అంటే మనకు దొరికే ఉమ్మెత్త, మారేడు బెల్లం, కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు మొదలైన వాటి నుండి జీవామృతం తయారు చేసి వాటి ద్వారా వ్యవసాయం చేసే ఒక పద్ధతి. దేశంలో హరిత విప్లవం సాధించాలని, రసాయనాలతో అత్యంత దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా దేశానికి అన్నంపెట్టడం సాధ్యమయింది. రసాయన ఎరువు వేసి పండిన పంటల వలన జీవన విధానానికి ముప్పువాటిల్లుతున్న మాట నిజమే కానీ వాటిని బాగా తగ్గించి ప్రతి రైతుకీ అవగాహన కల్పించి, రైతులను ప్రోత్సహించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అలాగని ప్రకృతి, సేంద్రియ, జీవరసాయన వ్యవసాయాలు తప్పు అని చెప్పటం కాదు. చిన్న చిన్న క్షేత్రాలకే పరిమితమైతే వాటి దిగుబడులు కూడా తగ్గడం జరుగుతుంది. బాబు రాజదాని కోసం తీసుకున్న 36 వేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని చెప్పినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే బీడు బారిన ఆ భూములలో పిచ్చి మొక్కలు ఎలాగూ ఉంటాయి కనుక. అదే జీరో బడ్జెట్ వ్యవసాయమని చెప్పినా ఆశ్చర్యంలేదు. 2029కి 100% జీరో బడ్జెట్ ఫైనాన్స్ వ్యవసాయంలో రైతులందరినీ భాగస్వామ్యం చేస్తానని చెప్పటం ఏ మేరకు సాధ్యపడుతుంది? అలాగే రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లకు ఈ విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేస్తానని చెప్పిన మాటలు సత్య దూరం. అసలు అంత సాగు భూమి రాష్ట్రంలో ఉందా? చంద్రబాబుకి తెలియకా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికా? ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇలాంటి చీప్ పబ్లిసిటీ వ్యవహారాలు మానుకొని రైతుల కష్టాలు తెలుసుకొని వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతులను ఆదుకోవాలి. జీరో బడ్జెట్ వ్యవసాయం చేయడం సాధ్యం కాదని దీని వల్ల దిగుబడులు సాధించలేమని ఇప్పటికైనా తెలుసుకొని, ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పులు తీర్చడం రాష్ట్రానికి గుదిబండగా మారినందున, మళ్లీ కొత్త అప్పులు తేవడం మాని, రాష్ట్రంలో ఉన్న అవి నీతికి అడ్డుకట్ట వేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ప్రజలు కోరుచున్నారు. కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 9440204323 -
జీరో బడ్జెట్ సేద్యంతోనే అధికోత్పత్తి సాధ్యం
అమలాపురం : ‘రసాయనిక వ్యవసాయంతో పాటు సేంద్రియ, గోఆధారిత వ్యవసాయ పద్ధతుల వల్ల కూడా అధికోత్పత్తి సాధించడం, రెతుల ఆత్మహత్యలు ఆపడం సాధ్యం కాదు. కేవలం ఒక్క ఆవుతో 30 ఎకరాల్లో చేయగలిగే జీరో బడ్జెట్ (పెట్టుబడి లేని) ప్రకృతి వ్యవసాయం మాత్రమే వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం. సేంద్రియ సాగు అణుబాంబుకంటే ప్రమాదం. రసాయనక ఎరువులతో ఉత్పత్తి చేస్తున్న పంటలపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో విదేశీయులు తీసుకువచ్చి మన మీద రుద్దిన మరో ప్రమాదకర వ్యవసాయ విధానం సేంద్రియ సాగు. ఇది పైకి చెబుతున్నట్టుగా రసాయన విధానం కన్నా తక్కువ పెట్టుబడి అనేది నిజం కాదు.. దీర్ఘకాలికంగా ప్రకృతిని, భూసారాన్ని కూడా దెబ్బతీస్తోంది’ అని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఎనిమిది రోజుల పాటు జరిగే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎనిమిది రోజుల పాటు ప్రకృతి వ్యవసాయం విధానంపై శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఆయన తొలి రోజు ఆదివారం రసాయనిక, సేంద్రియ సాగు వల్ల జరుగుతున్న అనర్థాల గురించి రైతులకు వివరించారు. ఆయన ఏమన్నారంటే.. రసాయనిక వ్యవసాయం హరిత విప్లవం పేరిట తొలుత ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచినప్పటికీ.. రైతుల ఆత్మహత్యలకు, కేన్సర్, ప్రకృతి వనరుల విధ్వంసానికి మూలకారణంగా మారింది. ఇప్పుడది ప్రమాదకరం. రసాయన ఎరువుల వల్ల భూమి నిస్సారమైంది. దిగుబడి క్రమేపీ తగ్గిపోయింది. 2050 నాటికి ఆహారోత్పత్తిని రెట్టింపు చేయడం దీనివల్ల కాదు. పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. రసాయనిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వం వెంటనే మానాలి. లేకపోతే అన్నదాతల ఆత్మహత్యలు ఆగవు. రసాయనిక సేద్యం కన్నా ప్రమాదరకరమైనది, అతి ఖరీదైనది సేంద్రియ సేద్యం. ఈ రెండూ విదేశీ దోపిడీ శక్తుల కుట్రలో భాగమే. విదేశీ సాంకేతికతో కూడిన సేంద్రియ సాగు మన దేశంలో మూడు పద్ధతుల్లో సాగుతోంది. 1. కంపోస్టు, 2. వర్మీకంపోస్టు, 3.బయోడైనమిక్ పద్ధతి. కంపోస్టు సాగును మన దేశంలోకి బ్రిటన్ దేశం ప్రవేశపెట్టగా, వర్మీ కంపోస్టును ఐరోపా దేశాల నుంచి అరువు తెచ్చుకుంది. బయోడైనమిక్ సాగు న్యూజిలాండ్ దేశంలో పుట్టింది. ఇవన్నీ విదేశాల నుంచి తెచ్చుకున్న సాగు పద్ధతులు కాగా, జీరో బడ్జెట్ వ్యవసాయం పూర్తిగా స్వదేశీ విధానం. కంపోస్టు సాగు బ్రిటీష్ పరిపాలనలో మన దేశంలోకి వచ్చింది. అప్పటి వరకు మనది కేవలం ఆవుపేడతోనే వ్యవసాయం జరిగేది. దీనివల్ల పెద్దగా దిగుబడులు లేక దేశంలో ఆహార ఉత్పత్తి లేక కరవు కాటకాల సమయంలో బ్రిటీష్ శాస్త్రవేత్త డాక్టర్ ఆల్బర్ట్ హోవర్ట్ కంపోస్టు సాగును దేశంలో ప్రవేశపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఇదే హోవర్ట్ కంపోస్టు సాగుకన్నా మన దేశీయ విధానంలో సాగు పద్ధతే మేలని తేల్చిచెప్పడం. ఒక విదేశీ శాస్త్రవేత్తే మన దేశీయ సాగు విధానం గురించి గొప్పగా చెబితే, మన విదేశీ సాగు విధానం చేపట్టం విడ్డూరంగా అనిపిస్తోంది. కంపోస్టు సాగులో చాలా ఇబ్బందులున్నాయి. ఒక ఎకరా సాగుకు 18 బండ్ల పెంట అవసరం. ఇంత సేంద్రియ ఎరువును సేకరించి దేశవ్యాప్తంగా సాగు చేయాలంటే 350 కోట్లకు పైగా పశువులు కావాలి. ఇది అసాధ్యం. వర్మీ కంపోస్టు ద్వారా పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్లో భార ఖనిజాలున్నట్టు ఐరోపా దేశాలు గుర్తించాయి. భూసారాన్ని పెంచేందుకు అవసరమైన జీవన ద్ర వ్యం (హ్యూమస్) తయారీని ఐసీనియా ఫోటీడా వానపాములతో తయారయ్యే వర్మీ కంపోస్టు అడ్డుపడుతూ తీరని నష్టం కలిగిస్తోంది. ఇది విదేశీ శక్తుల కుట్ర. ఉష్ణోగ్రత 28 డిగ్రీలు దాటిన తర్వాత వర్మీ కంపోస్టు వల్ల కార్బన్ డయాక్సయిడ్ విడుదలవుతుంది. భూతాపం పెరిగిపోతోంది. బయోడైనమిక్ పద్ధతి కూడా విదేశానిదే. ఒక ఆవు కొమ్ము ద్వారా తయారయ్యే 35 గ్రాముల ‘కల్చర్’ను 20 బళ్ల పశువుల ఎరువులో కలపటం ద్వారా ఎకరం సాగు చేస్తున్నారు. కోట్లాది ఆవు కొమ్ములతో సేద్యం చేయడం అసాధ్యం. పశువుల ఎరువు టన్నుల కొద్దీ వేసి చేసే సంప్రదాయ వ్యవసాయ విధానం దేశీయమైనదే అయినప్పటికీ పూర్వం మాదిరిగా ప్రతి రైతూ వందలాది పశువులను పెంచడం అసాధ్యం. పూర్తిగా శాస్త్రీయమైన, అత్యాధునికమైన జీరో బెడ్జెట్ విధానంలో మాత్రమే ఒక్క ఆవుతో 30 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుంది. ఇప్పటి వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఇదొక్కటే దిక్కు. స్వల్ప ఖర్చుతో దీన్ని చేయొచ్చు. ఈ ఖర్చు అంతర పంటల ద్వారా రైతుకు వస్తుంది. ప్రధాన పంటపై ఆదాయం అంతా రైతుకు లాభమే. 10 శాతం నీరు, 10 శాతం విద్యుత్‌తో తుపాన్లను, కరువును తట్టుకుంటూ.. అధిక దిగుబడులు సాధించడానికి జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం మినహా మరొక పద్ధతి లేదు. ప్రభుత్వాలు ఈ వాస్తవాలు గుర్తించి రసాయనిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వెంటనే మానేయాలి. -
ఆత్మహత్యలను ఆపగలిగేది ‘జీరోబడ్జెట్’ సేద్యమే!
వ్యవసాయ సంక్షోభానికి దారితీస్తున్న మౌలిక సమస్యలను పట్టించుకోకుండా.. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎన్ని ప్యాకేజీలు ప్రకటించినా వృథా ప్రయాసేనని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ అంటున్నారు. సామాజిక కార్యకర్తలు, సినీనటులు ప్రజల నుంచి విరాళాలు సేకరించి.. చనిపోయిన రైతుల కుటుంబాల్లో కొందరికి రూ. 10-15 వేల వరకు ఇస్తుండడాన్ని ప్రస్తావిస్తూ.. వ్యవసాయ సంక్షోభం మూల కారణాల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పాలేకర్ సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. రసాయనిక సేద్యంలో ఖర్చు అధికమై రైతులపై పెరుగుతున్న రుణభారం.. సాగునీటి వసతి లేకపోవటం.. ప్రకృతి వైపరీత్యాలు.. తప్పుడు మార్కెట్ విధానాల వల్ల రైతు దోపిడీకి గురికావడం.. రైతు వ్యతిరేక, అమానవీయ ప్రభుత్వ విధానాలు.. తప్పనిసరి అవుతున్న వివాహ వేడుకలు, వరకట్న ఖర్చులు.. ఉపాధి కోసం గ్రామీణ యువత పట్టణాలకు వలస వెళ్లటం... వంటి సమస్యల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మూల కారణాలను నియంత్రించటం ద్వారా రైతు ఆత్మహత్యలను నివారించటమే కాక ప్రజలకు విషరహితమైన ఆహారం అందించడం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమని పాలేకర్ అభిప్రాయపడ్డారు. వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జీరోబడ్జెట్ పద్ధతిలో ఆహార, వాణిజ్య పంటలను సాగు చేస్తున్న ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడలేదని ఆయన తెలిపారు. -
జీరో బడ్జెట్!