Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

AP High Court says Social media posts cannot be equated with cybercrime1
సోషల్‌ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?: హైకోర్టు

సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్‌ఎస్‌ సెక్షన్‌–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్‌ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్‌ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్‌ మీడియా పోస్టులను మెటీరియల్‌ బెనిఫిట్‌ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేం. – పోలీసులను ఉద్దేశించి హైకోర్టు సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తా­య­ని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌–­111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్ర­మ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్‌ నేరా­లు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయో చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్‌ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలంది. ప్రస్తు­త కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూ­ర్చేందుకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్‌సెప్షనల్‌ బెనిఫిట్‌ (అనుభూతి ద్వారా పొందే ప్రయోజనం)గా భావించగలమే తప్ప.. మెటీరియల్‌ బెనిఫిట్‌ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేమంది. సోషల్‌ మీడి­యా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్ధిక, వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తూ న్యా­యమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసు­లు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి కూడా ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్‌ విజయ్‌ బుధవారం విచారించారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లక్ష్మీ­నారాయణ వాదనలు వినిపిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీని­పై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.

CM Revanth Reddy says this is a historic public budget2
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. తమ ప్రాథమ్యాలని, ఈ మూడు అంశాలతో కూడిన తమ పాలన నమూనా యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా.. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన పర్యవసానాలను మార్చుకునేందుకు కొంత ఇబ్బంది ఎదురైందని, అయినా ‘చేతి’లో ఉన్న మిగతా కాలంలో పాలనను పరుగుపెట్టిస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రం పురోగమించేందుకు వేస్తున్న అడుగుల్లో మాకు ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ మా పాలన సత్తా చాటుతున్నాం. విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తున్నాం. తెలంగాణ రైజింగ్‌–2050 ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్‌ డాలర్లు అని.. పదేళ్లలో దీనిని వెయ్యి బిలియన్‌ డాలర్‌ (ట్రిలియన్‌ డాలర్‌) వ్యవస్థగా మార్చే దిశలో సాగుతున్నామని తెలిపారు. భట్టి విక్రమార్క బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3,04,965 కోట్ల అంచనాలతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగెత్తించే కార్యాచరణతో ముందుకొచ్చామ ని చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగం భట్టి మాటల్లోనే.. ‘‘ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యాం. ‘భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకుంటున్నా’అని నాడు అంబేడ్కర్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ నైతికతను పదే పదే నొక్కిచెప్పారు. ఆ నైతిక విలువలనే పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నాం. దశాబ్దకాలం వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో ఛిద్రమైన తెలంగాణ పాలనా, ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెడుతూ ముందుకు సాగుతున్నాం. స్వార్థపరుల అబద్ధపు ప్రచారం.. నిజం కూడా ప్రతి రోజూ ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధమే నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ, నిరాధార విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్‌ మీడియాలో, సొంత పత్రికలలో అబద్ధపు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కుట్రను సమర్థంగా తిప్పికొడుతూ, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచడం మా బాధ్యత. ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే.. ఆ స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. కేవలం కేటాయింపులకే పరిమితం కాదు.. మేం బడ్జెట్‌లో ప్రస్తావించిన ప్రణాళికలు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కాదు. అవి సమాన అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ సమ్మిళిత విధానాలతో ప్రగతివైపు అడుగులు వేసేందుకు నిరి్వరామంగా కృషి చేస్తోంది. రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దినసరి కూలీలు, ఐటీ నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరినీ ఈ పథకాలు బలోపేతం చేస్తాయి. సమష్టి కృషితో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జాతీయ సగటు కంటే మన వృద్ధి రేటు ఎక్కువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొంటూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2024–25లో తెలంగాణ జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల ప్రకారం రూ.16,12,579 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 10.1 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.9 శాతంగానే ఉంది. 2024–25లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,79,751, వృద్ధిరేటు 9.6 శాతం అయితే.. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579, వృద్ధి రేటు 8.8 శాతం మాత్రమే. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,74,172 (1.8 రెట్లు) మేర ఎక్కువగా ఉంది. రాష్ట్ర పన్నుల వాటా 50శాతానికి పెంచాలని కోరాం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయమైన భాగం దక్కాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమరి్పంచిన సమగ్ర నివేదికలో కోరింది. కేంద్రం విధిస్తున్న సెస్సులు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతోందని రాష్ట్రం తరఫున వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని కోరాం. తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437 శాతం నిధుల పంపిణీ జరిగితే.. 15వ ఆర్థిక సంఘం కాలంలో 2.102 శాతానికి తగ్గింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయం. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా పన్నుల పంపిణీ విధానాన్ని హేతుబద్ధం చేయాలన్నది మా వాదన. ధరణి కష్టాలకు చెక్‌ పెట్టాం.. భూమి కేవలం స్థిరాస్తి కాదు. ఒక భావోద్వేగం. భూమితో బంధం కన్నతల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. గత ప్రభుత్వ హయాంలో ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల భూసంబంధిత సమస్యలు ప్రజలకు వేదన మిగిల్చాయి. ఆ సమస్యలకు చెక్‌ పెడుతూ మా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చింది. ఇందులో నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా.. భూవివాదాలకు తావులేకుండా, భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి వీలుగా ఉన్నాయి. ఎన్నడూ లేని స్థాయిలో కులగణన అసమానతలను రూపుమాపే లక్ష్యంతో.. గతంలో ఎన్నడూ చేపట్టని విధంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. మొత్తం 1.12 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించింది. సంక్షేమ పథకాలు అర్హులైన లబి్ధదారులకు చేరేందుకు, సమర్థవంతమైన పాలన కోసం ఈ సర్వే కీలక డేటా అందించింది. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, సమగ్ర ఆర్థిక పురోగతి విధానాల రూపకల్పనకు ఇది ఆధారంగా మారనుంది. ‘ఫ్యూచర్‌’లో ఏఐ సిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తాం. అది ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్‌ కంపెనీ ఇక్కడ ఏఐ ఆధారిత యాక్సిలరేటర్‌ సెంటర్‌ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది’’ అని భట్టి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా.. ‘‘గత దశాబ్దంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగుతోంది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. సుసంపన్నత, సమగ్రత, స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తాం. ప్రతి పౌరుడికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతను కలి్పంచే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్లడమే మా లక్ష్యం.’’ ఇంటి దగ్గర గుడిలో పూజలు చేసి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి హోదాలో మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం తమ ఇంటి దగ్గరున్న దేవాలయంలో భట్టి విక్రమార్క దంపతులు పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చిన భట్టికి ఆర్థిక శాఖ అధికారులు, శాసనసభ అధికారులు స్వాగతం పలికారు. తోటి మంత్రులతో కలసి అల్పాహార విందు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బడ్జెట్‌ పుస్తకాలున్న బ్యాగ్‌ను అందచేశారు. తర్వాత మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం కోసం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు బడ్జెట్‌ ప్రతులను అందచేశారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు కూడా బడ్జెట్‌ ప్రతులతో కూడిన బ్యాగును అందించారు. ఈ క్రమంలో మంత్రి మండలి భేటీ అయి బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ సందర్భంగా సహచర మంత్రులంతా భట్టిని అభినందించారు. కాగా.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఏకంగా 14వ సారి బడ్జెట్‌ రూపకల్పనలో పాలు పంచుకోవడం విశేషం. ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బడ్జెట్‌ రూపకల్పనలో భాగమవుతూ వచ్చారు.

Rasi Phalalu: Daily Horoscope On 20-03-2025 In Telugu3
ఈ రాశి వారు కాంట్రాక్టులు పొందుతారు.. వ్యాపారాలలో లాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.షష్ఠి రా.10.35 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: అనూరాధ రా.7.55 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.1.57 నుండి 3.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.07 నుండి 10.55 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: ఉ.8.32 నుండి 10.20 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 6.07. మేషం.... అనుకోని ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు..వృషభం... నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.మిథునం.... కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. నూతన విద్యావకాశాలు.కర్కాటకం... కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవచింతన.సింహం... కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నిరుద్యోగుల యత్నాలలో అవాంతరాలు.కన్య...... కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత. కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.తుల...... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వృశ్చికం.... ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. బంధువుల కలయిక. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు పురస్కారాలు.ధనుస్సు.. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ఖర్చులు. పనులు ముందుకు సాగవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. అనారోగ్యం.మకరం.... బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.కుంభం... పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. పనులు చకచకా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.మీనం.... కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

Climate change affecting mango fruit in Andhra Pradesh4
ఆశలు ఎండ‘మామిడి’

సాక్షి, అమరావతి: చెట్టంతా పూత.. దీంతో ఈ ఏడాది ఇక చింత లేదనుకున్నారు..! పిందె పడడమే ఆలస్యం.. తమ పంట పండినట్లేనని భావించారు..! కానీ, పగబట్టినట్లుగా వాతావరణ మార్పులు.. కొత్త రకం పురుగులు కలిపి దాడి చేశాయి..! ఫలితంగా పూతతో పాటు రైతుల ఆశలూ నేలరాలుతున్నాయి. నాలుగు డబ్బులు మిగులుతాయని భావిస్తే.. ఎర్రటి ఎండల్లో నీటి జాడను భ్రమింపజేసే ఎండమావుల్లా మారింది వారి పరిస్థితి. ‘ఆంధ్రప్రదేశ్‌ మామిడి’ అంటే దేశ విదేశాల్లో గొప్ప పేరు..! అయితే, ప్రస్తుతం చిత్తూరు నుంచి నూజివీడు దాకా ఎటుచూసినా మామిడి రైతులో నిర్వేదమే కనిపిస్తోంది. బంగినపల్లి మొదలు రసాల వరకు పంటను చూస్తే బెంగ పట్టుకుంటోంది. వాస్తవానికి ఏటా డిసెంబరు, జనవరిలో మామిడి పూత వస్తుంది. ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో మొదలైంది. అయితే, శ్రీకాకుళం మొదలు చిత్తూరు వరకు ఏ చెట్టు చూసినా పూత బ్రహ్మాడంగా కాసింది. దీంతో దిగుబడికి దిగులు ఉండదని రైతులు ఆశపడ్డారు. కానీ, పూత పిందె కట్టేలోగా వారి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా వాతావరణ మార్పులకు తోడు ‘మాంగో లూఫర్‌’ అనే కొత్త రకం పురుగు, తెగుళ్లు విజృంభణతో కళ్లెదుటే పూత మాడిపోయి, పిందెలు రాలిపోతున్నాయి. ఇదంతా చూసి రైతులు దిగాలు పడుతున్నారు. దాదాపు 10 లక్షల ఎకరాల్లో.. రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. సువర్ణ రేఖ, నీలం, తోతాపూరి, బంగినపల్లి ప్రధానంగా పండిస్తున్నారు. గత రెండేళ్లలో వరుసగా 49.85 లక్షల టన్నులు, 35.78 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది కనీసం 45 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేశారు. అయితే, పూత పట్టింది మొదలు తెగుళ్లు, వైరస్‌లు విజృంభించాయి. మరోపక్క ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగిపోయాయి. అసలే పూత ఆలస్యంతో ఇబ్బంది పడుతుండగా, ఉష్ణోగ్రతల ప్రభావం ప్రూట్‌ సెట్టింగ్‌ను దెబ్బతీసింది. జనవరి, ఫిబ్రవరిలో 28–29 డిగ్రీల మేర ఉన్న ఉష్ణోగ్రత, ప్రస్తుతం 36–38 డిగ్రీలకు చేరడం మామిడి పంటపై ప్రభావం చూపుతోంది. ⇒ మరోవైపు రాత్రిపూట మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. అనూహ్య వాతావరణ పరిస్థితులతో మగ, ద్విలింగ పుష్పాల నిష్పత్తి (రేషియో) మారిపోయి ఆశించిన స్థాయిలో పిందెలు ఏర్పడడం లేదు. ⇒ మిరపను ఆశిస్తున్న నల్ల తామర పురుగు.. రెండేళ్లుగా మామిడిపైనా దాడి చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని దెబ్బకు మామిడి పూత చాలావరకు మాడిపోయింది. 40 శాతం పైగా పంట మీద నల్ల తామర పురుగు ఉ«ధృతి కనిపిస్తోంది.రాయలసీమలో లిచీ లూఫర్‌ పురుగు దాడి లిచీ పంటలో కనిపించే అరుదైన మ్యాంగో లూఫర్‌ (కొత్త రకం గొంగలి పురుగు) ఏపీలో తొలిసారి మామిడిపై వ్యాపిస్తోంది. రాయలసీమతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. లార్వా దశలోనే పువ్వులు, ఆకులను తినేసే, పిందెల్లోకి చొరబడే ఈ పురుగులు 20–30 శాతం తోటలను దెబ్బతీస్తున్నాయి. వీటికితోడు వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, పెంకు, తేనె మంచు పురుగు, కాండంతొలుచు, కొమ్మ తొలిచే, గూడు పురుగు వంటి ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా పూత మాడిపోతూ పిందెలు రాలిపోతున్నాయి. ⇒ సాధారణంగా హెక్టార్‌కు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ ఏడాది మూడు నుంచి నాలుగు టన్నులకు మించి వచ్చే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. పురుగుమందుల ఖర్చు రెట్టింపు ⇒ విస్తృతంగా పురుగుమందుల వినియోగంతో రైతులకు పెట్టుబడులు తడిసి మోపెడు అవుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.20 వేలు వ్యయం కాగా.. ప్రస్తుతం సగటున రూ.40–50 వేల మధ్య ఖర్చు చేస్తున్నారు.సస్యరక్షణ చర్యలు ఇలా...⇒ అజాడిరక్టివ్‌ 2 మిల్లీ లీటర్‌ ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆ తరువాత బీటీ ఫార్ములేషన్‌ బాసిల్లస్‌ తురింజియోస్పిస్‌ వెరైటీ కుర్‌స్టాకి(డిపెల్‌) 1.5–2 మిల్లీ లీటర్లు ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ⇒ క్లోరోఫైరిఫాస్‌ 50శాతం ఈసీ ఒక మిల్లీ లీటర్‌ ఒక లీటర్‌ నీటిలో లేదా ఇమామోక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రాములు ఒక లీటర్‌ నీటిలో లేదా నోవాల్యురాన్‌ 5.25 శాతం ప్లస్‌ ఇండోక్సా కార్బ్‌ 4.5 శాతం ఒక మిల్లీ లీటర్‌ ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ⇒ పురుగుల ఉధృతిని నియంత్రించేందుకు ఎకరాకు 8 పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి. ⇒ 10 ఏళ్లు పైబడిన మామిడి తోటలకు రోజుకు ఒక చెట్టుకు కనీసం 100 లీటర్ల నీటిని అందించాలి. ⇒ పిందెలు ఎక్కువగా రాలిపోతుంటే నాఫ్తలిన్‌ అసిటిక్‌ యాసిడ్‌ (ప్లానోఫిక్స్‌) 100 ఎంఎల్‌ 500 లీటర్ల నీటిలో (50 చెట్లు) పిచికారీ చేయాలి. ⇒ నీటి వసతి లేని రైతులైతే పొటాíÙయం నైట్రేట్‌ 10 గ్రాములు ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ⇒ తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే డైనోటోప్యూరాన్‌ 0.25 గ్రాములు ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ⇒ నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంటే చెట్టుకొక బ్లూ కలర్‌ జిగురు అట్ట అమర్చుకోవాలి.ఏం చేయాలో పాలుపోవడం లేదునాకు 6 ఎకరాల మామిడి తోట ఉంది. పూత బాగా వచ్చినప్పటికీ ఎండల తీవ్రతతో పాటు నల్లతామర, కొత్త రకం పురుగుల ప్రభావంతో మాడిపోయింది. పిందెలను కాపాడడానికి పురుగుమందులు విపరీతంగా పిచికారీ చేయాల్సి వస్తోంది. ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చు అవుతోంది. ఇంకా పెట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెట్టుబడీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోలా అధికారులు తోటలను పరిశీలించి సలహాలు ఇవ్వడం లేదు. నిరుడు ధర లేక మామిడిని తోటల్లోనే వదిలేశాం. ఈ ఏడాదైనా గట్టెక్కుదాం అనుకుంటే అసలు ఏంచేయాలో పాలుపోవడంలేదు. – ఆకేపాటి రంగారెడ్డి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం తూర్పుపల్లిపెట్టుబడి కూడా వచ్చేలా లేదు 2.5 ఎకరాల్లో 12 ఏళ్ల వయస్సున్న 200 చెట్లు ఉన్నాయి. ఎండల ప్రభావం, బంక తెగులుతో పూత మొత్తం నేలవాలింది. ఒకటీ అరా పిందెలు వచ్చినా కొత్తరకం పురుగులతో రాలిపోతోంది. ఇప్పటికే పురుగు మందుల కోసం రూ.40–50 వేలు ఖర్చు చేశా. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చా. తీరా కాపు కొచ్చేసరికి తెగుళ్లు, ఎండలు మా కడుపు కొడుతున్నాయి. ఈసారి దిగుబడికి అవకాశం లేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. –కె.వెంకటసుబ్బయ్య, అనంతపల్లె, పుల్లంపేట మండలం, అన్నమయ్య జిల్లా70 శాతం పూత దెబ్బ.. నాకు సొంతంగా ఐదెకరాలుండగా, 15 ఎకరాల్లో తోటలు లీజుకు తీసుకున్నా. ప్రారంభంలో మంచి పూతే వచ్చింది. ఇటీవల కురుస్తున్న మంచుకు తోడు పగటి ఉష్ణోగ్రతల ప్రభావానికి పూర్తిగా మాడిపోయింది. తేనె మంచు, రసం పీల్చే పురుగుల ప్రభావంతో రాలిపోయింది. 60–70 శాతం పూత దెబ్బతిన్నది. మిగిలిన పూతలో అక్కడక్కడా పిందెలు కట్టినా నిలుస్తాయో లేదోనని అనుమానంగా ఉంది. ఈ ఏడాది లీజుతో పాటు పురుగుమందులకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. అది కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. –దుంగ వెంకటరమణ, నీలకంఠాపురం, లక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లాఫ్రూట్‌ కవర్స్‌తో కొంత మేర రక్షణ కొత్త రకం గొంగలి పురుగు మ్యాంగో లూఫర్‌తో పాటు నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంది. పూత ఆలస్యమవడంతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో ఫ్రూట్‌ సెట్టింగ్‌ జరగక పిందెకట్టడం తగ్గిపోయింది. ఈసారి దిగుబడులు తగ్గే అవకాశాలు కన్పింస్తున్నాయి. పురుగుల ఉధృతిని ఎదుర్కొనేందుకు సస్యరక్షణ చర్యలు పాటించాలి. పురుగు మందులను సిఫార్సుల మేరకే వాడాలి. పిందెలను కాపాడుకునేందుకు రైతులు ఫ్రూట్‌ కవర్స్‌ కట్టాలి. పిందె నిమ్మకాయ పరిమాణంలోకి వచ్చిన తర్వాత కవర్లు కడితే కాయల సైజుతో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది. –డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి

Suspense over the selection of BJP national president5
వచ్చే నెలలోనే కొత్త సారథి..!

సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వచ్చే నెలలో కొలిక్కి రానుంది. పార్లమెంట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో వచ్చే నెల రెండో వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాంతం, అనుభవం, విధేయతల అనుగుణంగా పలువురు సీనియర్‌ నేతల పేర్లపై చర్చ జరుగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భిన్న ప్రాతిపదికలు.. జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ప్రధానంగా నాలుగు అంశాల ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం తెరపైకి వచి్చంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడి రేసులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 45 ఏళ్లుగా పార్టీలో ఉన్న అనుభవం, యువమోర్చా నుంచి పార్టీలో పనిచేసిన అనుభవం ఆయనకు అనుకూలంగా మారుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటివరకు పార్టీ మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇందులో తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్‌ పేరు ముందు వరుసలో ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మహిళల మద్దతు కూడగట్టేందుకు ఈమె ఎంపిక కలిసొస్తుందన్నది పార్టీ అంచనా. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను ఎంపిక చేసింది. అదే వరుసలో మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. విధేయత, పార్టీలో పనిచేసిన అనుభవం ఆధారంగా చూస్తే భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు సన్నిహితులు. పైగా యూపీ, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యూహాలు రచించడంలో దిట్టలైన వీరిద్దరిలో ఒకరి ఎంపిక జరిగితే అది కచ్చితంగా మోదీ, షాల సూచన మేరకే జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతున్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులైన మనోహర్‌లాల్‌ ఖట్టర్, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి పూర్తిగా మద్దతున్నా, కేంద్రంలో వీరికున్న ప్రాధాన్యం దృష్ట్యా అధ్యక్ష ఎంపికలో వీరిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? తేలాల్సి ఉంది.

Cobra bite a person 103 times6
నిను వీడని ‘నాగు’ను నేను!

పలమనేరు/బైరెడ్డిపల్లె: పిచ్చుగుంట్ల సుబ్ర­హ్మ­ణ్యం.. ఊరు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరకుంట. పదేళ్ల వయసులో ఐదో తరగతి చదువుతున్న అతడిని పశువులు కాస్తున్న సందర్బంలో ఓ నాగుపాము కాటేసింది. ప్రస్తుతం అతడి వయసు 48. ఇప్పటివరకు నాగుపాములు అయన్ని 103సార్లు కాటేశాయి. అయినా.. ఎప్పటికప్పుడు చికిత్స పొందుతూ మృత్యుంజయుడిగా మారాడు. తాజాగా నాలుగు రోజుల క్రితం పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ‘ఇదో మిరాకిల్‌’ అంటూ వైద్యులే షాకవుతున్న ఈ విచిత్రమైన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. సుబ్రహ్మణ్యేశ్వరుడి కృపతో పుట్టారట బైరెడ్డిపల్లె మండలం కుమ్మరకుంటకు చెందిన పిచ్చుగుంట్ల కుప్పయ్య దంపతులకు పెళ్లయిన చాలాకాలం వరకు సంతానం లేదు. దీంతో ఆ దంపతులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి సంతానం కోసం మొక్కుకున్నారట. మొక్కు సాకారమై కొడుకు పుట్టడంతో అతడికి సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారు. సుబ్రహ్మణ్యం ఐదో తరగతి చదువుతూ పొలంలో పశువులను కాస్తుండగా మొదటిసారి నాగుపాము అతన్ని కాటేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎక్కడికెళ్లినా పాములు అతడిని వదలడం లేదు. తొలినాళ్లలో పెద్దగా ఆస్పత్రులు లేకపోవడంతో సుబ్రహ్మణ్యం పాము కాటేసినప్పుడల్లా బైరెడ్డిపల్లిలోనే నాటువైద్యుడు దైవకటాక్షం వద్ద చికిత్సలు పొందేవాడు. ఆ తరువాత బైరెడ్డిపల్లి పీహెచ్‌సీ, కోలార్‌ మెడికల్‌ కాలేజీ, పీఈఎస్‌ కుప్పం, పెద్దపంజాణిలోని క్రిస్టియన్‌ ఆస్పత్రి, జేఎంజే గుట్టూరులో చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడుతున్నాడు. తాజాగా నాలుగు రోజుల క్రితం ఇంటిముందు మంచంపై కూర్చుని ఉండగా.. వెనుకనుంచి వచి్చన పాము కాలిపై కాటేసింది. గుట్టూరులో చికిత్స పొంది మంగళవారం అతడు డిశ్చార్జి అయి ఇంటికి చేరాడు. చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చు 103సార్లు పాముకాట్లకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్సలకు రూ.లక్షలు ఖర్చు పెట్టాడు. తనకున్న మూడెకరాల పొలం కాస్తా ఇప్పుడు రెండెకరాలకు చేరింది. ఆస్తులు విక్రయించి, అప్పులు చేసి ఇలా పాముకాట్ల నుంచి బయటపడుతున్నాడు. సుబ్రహ్మణ్యంను రైతులెవరూ కూలి పనులకు సైతం పిలవడం లేదు. కూలి పనులు చేస్తున్నప్పుడు పాము కాటేస్తే తాము బాధ్యులమవుతామనే భయమే దీనికి కారణం. ఎప్పుడు ఏ పాము కాటేస్తుందోననే ఆందోళనతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. దీనిపై వైద్యులు సైతం ఇదో మిరాకిల్‌ అంటున్నారు. ఇలా ఎవరికీ జరగదని.. ఇతడినే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు. తిరగని గుడుల్లేవుచిన్నప్పటి నుంచి పాము కలలో కనిపించేది. పా­ము­కాట్లు మొదలయ్యాక నాగదోషం ఉందని కాళహస్తి వెళ్లా. తరువాత తిరుత్తణికి జీవిత కావడి మోస్తున్నా. వీరనాగమ్మ మా ఇలవేల్పు కాబట్టి.. ఇంటివద్ద నాగులు రాళ్లకు పూజలు చేస్తున్నా. కొక్కే సుబ్రహ్మణ్యస్వామి, తిరువణ్ణామలై, కురుడమళై కులదేవీ తదితర ఆలయాలకు తిరిగినా పాము కసి వదలిపెట్టలేదు. – సుబ్రహ్మణ్యం, నాగుపాము కాటు బాధితుడు నాగుపాములు పగబట్టవు నాగుపాములు పగబడతా­యనేది నిజం కాదు. పాములకు ఉండేది చిన్నపాటి మెదడు. దీనివల్ల వాటికి జ్ఞాపకశక్తి తక్కువ. ఏవేవో పాములు అతన్ని యాధృచ్చికంగా కాటేస్తుండవచ్చు. పగబట్టి మాత్రం కాదు. ఇలాంటి మూఢనమ్మకాలతో తనకు నాగదోషం ఉందని, పాము పగబట్టిందని భావించడం వట్టి ట్రాష్‌ మాత్రమే. మేం అతడింటికి వెళ్లి అవగాహన కల్పిస్తాం. – యుగంధర్, జన విజ్ఞాన వేదిక నాయకుడు, పలమనేరు

Sakshi Editorial On Sunita Williams return to Earth7
నిరీక్షణ ఫలించిన క్షణం...

మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ‘రాశి చక్రగతులలో/రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో...’ ప్రభ వించిన మానవుడు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కేవలం ఎనిమిది రోజులని భావించింది కాస్తా 286 రోజులపాటు అంతరిక్షంలో ఉండిపోక తప్పని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్, వారిని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళిన మరో ఇద్దరూ నిర్దేశించిన సమయానికల్లా క్షేమంగా, సురక్షితంగా భూమ్మీదకు చేరుకోవడం సంక్లిష్టమైన సవాళ్లపై విజ్ఞాన శాస్త్రం సాధించిన అపూర్వ విజయం. మెక్సికో జలసంధి కెరటాల్లో వారిని తీసుకొచ్చిన స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ కాప్సూ్యల్‌ తేలియాడుతుండగా డాల్ఫిన్ల గుంపు దాని చుట్టూ వలయాకారంలో స్వాగతిస్తున్నట్టు తిరుగాడటం ఆహ్లాదాన్ని పంచింది. మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)ను వీడి దాదాపు 16 గంటలు ప్రయాణించి భారత కాలమానం ప్రకారం తెల్లారు జామున 3.30కి చేరు కున్నారు. అంతరిక్షానికి రాకపోకలు సాగించటం, అక్కడున్నన్నాళ్లూ నిరంతర పరిశోధనల్లో నిమ గ్నులు కావటం ఒక అనుపమానమైన, అసాధారణమైన విన్యాసం. ఎంతో ఏకాగ్రత, మరెంతో ఆత్మ విశ్వాసమూ, ఓరిమి ఉంటే తప్ప ఆ పరిశోధనలు పరిపూర్తి చేయటం కష్టం. ఎంతో ఇరుకైన ఒక చిన్న స్థలాన్ని మిగిలిన వారితో పంచుకోక తప్పక పోవటం సామాన్య విషయం కాదు. నిరుడు జూన్‌ 5న అంతరిక్షయానం ప్రారంభం కాగా, ఆ మరునాడు అక్కడికి చేరుకుని ఐఎస్‌ఎస్‌లో ఈ వ్యోమ గాములు పని ప్రారంభించారు. సునీత ఇప్పటికే మూడుసార్లు అంతరిక్షయానం చేయటంతో పాటు ఒక దఫా ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గానూ వ్యవహరించారు. సునీత, బుచ్‌ అంతరిక్షంలో చిక్కుకుపోయా రనటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగీకరించటం లేదు. వారిని సురక్షితంగా దించేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశామంటున్నది. వారికున్నంత ఆత్మవిశ్వాసం సాధారణ ప్రజలకుండదు. అందుకే సునీత రాక కోసం మానవాళి మొత్తం ఆదుర్దా ప్రదర్శించింది. అంతరిక్షయానం ఎనిమిది రోజులే అనుకుని వెళ్లి తొమ్మిది నెలలు ఉండక తప్పక పోవటమంటే అది వారి మానసిక స్థితిని మాత్రమే కాదు... శారీరక స్థితిగతులనూ ప్రభావితం చేస్తుంది. కేవలం ఎనిమిది రోజులకోసమైతే వారు సాధారణ వ్యాయామంతో సరిపెట్టుకోవచ్చు. అసలు చేయక పోయినా ఫరవాలేదంటారు. కానీ ఇంత సుదీర్ఘకాలం అక్కడ కొనసాగాలంటే మాత్రం శరీ రాన్ని బాగా కష్టపెట్టాలి. సుదీర్ఘ వ్యాయామం తప్పదు. గుండె, రక్తనాళాలూ సక్రమంగా పని చేయ టానికి అవి అవసరం. ఈ వ్యాయామాలు సహజంగానే కష్టంతో కూడుకున్నవి గనుక అందుకు వారిని మానసికంగా సంసిద్ధుల్ని చేయటంతోపాటు వారి దినచర్యలో అవసరమైన మార్పులు చేయాల్సి వస్తుంది. వారికి అందాల్సిన ప్యాకేజ్డ్‌ ఆహారం వివిధ రకాల రుచులతో సిద్ధంగానే ఉన్నా నచ్చింది తినడానికి లేదు. నిర్ణీత కొలతలో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్నిటిని తట్టుకుంటూ, నిర్దిష్టమైన సమయాల్లో వ్యాయామాలు చేస్తూ పరిశోధనలు సాగించటం, అందులో వెల్లడైన అంశా లపై పరస్పరం చర్చించుకుని నిర్ధారణలకు రావటం అంతరిక్ష యాత్రికులకు తప్పనిసరి. ఇంతవరకూ మూడు దఫాలు అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత మొత్తం 62 గంటల 6 నిమి షాలు స్పేస్‌ వాక్‌ చేశారంటే... ఆ రకంగా ఆమె మహిళా అంతరిక్ష యాత్రికుల్లో అగ్రస్థానాన్నీ, మొత్తం వ్యోమగాముల్లో నాలుగో స్థానాన్నీ పొందారంటే... అది సునీత దృఢసంకల్పానికి అద్దం పడుతుంది. ఈ అంతరిక్ష యానంలో భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో 900 గంటలపాటు ఆమె వివిధ రకాలైన 150 పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. ఈ తొమ్మిది నెలల్లో ఆమె పరిశోధనలు సాగించిన ఐఎస్‌ఎస్‌... భూకక్ష్యలో 4,576 సార్లు తిరగ్గా ఆ నిడివి 19 కోట్ల 40 లక్షల కిలోమీటర్లు! అబ్బురపరిచే విషయమిది. అవకాశం లభిస్తే స్త్రీలు అందరినీ మించుతారనడానికి సునీత ప్రతీక.ఈ అంతరిక్ష యాత్రలైనా, అంతరిక్ష నౌకల అన్వేషణలైనా... వాటి అంతిమ సారాంశం ఏక గ్రహజీవిగా ఉన్న మనిషిని బహు గ్రహజీవిగా మార్చటం. అంతరిక్షంలో సాగించే పరిశోధనలు భవి ష్యత్తులో మనుషులందరూ సునాయాసంగా గ్రహాంతర యానాలు చేయటానికి, అక్కడి పరిస్థితు లకు తట్టుకోవటానికీ తోడ్పడతాయి. ఈ యాత్రలు మున్ముందు మనుషుల్ని పోలిన గ్రహాంతర జీవులతో మనల్ని అనుసంధానించవచ్చు. 1906లో హెచ్‌జీ వెల్స్‌ రచించిన ‘వార్‌ ఆఫ్‌ ది వర్ల్‌›్డ్స’ నవల ఊహించినట్టు ఆ గ్రహాంతర జీవులు మనపైకి దండయాత్రకొచ్చే ప్రమాదమూ లేకపోలేదు.విశ్వం గురించిన మన జ్ఞానం పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో సైతం లెక్కలేనన్ని పాలపుంతలున్నాయని, భూమిని పోలిన గ్రహాల ఆచూకీ తెలిసిందని శాస్త్రవేత్తలు చెబుతుంటే ఎంతో విస్మయం కలుగుతుంది. రెక్కలు కట్టుకుని పైపైకి వెళ్లేకొద్దీ మన భూమి సూది మొన మోపినంత పరిమాణంలో కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే మనం కృత్రిమంగా ఏర్పర్చుకున్న సరిహద్దులు, ఆర్థిక సామాజిక తారతమ్యాలు కనబడవు. విషాదమేమంటే... ఎదిగినకొద్దీ విశాలం కావాల్సిన చూపు కాస్తా మూఢ విశ్వాసాల్లో, మూర్ఖత్వపు మలుపుల్లో సంకు చితమవుతోంది. నలుగురు వ్యోమగాములు సగర్వంగా భూమ్మీదకు తిరుగు పయనమైన రోజే 400 మంది అమాయక పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్‌ బాంబుదాడుల్లో కన్నుమూశారంటే అది మనుషుల్లోని రాక్షసత్వాన్ని చాటుతుంది. ఇలాంటి విషాదాలకు తావులేని కాలం ఆగమిస్తే తప్ప ఈ విజయాలు మనకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలగజేయలేవు.

TDP coalition govt demolished several structures in Kashi Nayana Kshetra8
అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం!

కాశినాయన క్షేత్రం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు తొలుత తిరుమల లడ్డూ నాణ్యతపై లేనిపోని విమర్శలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆపై అదే తిరుమలలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో హిందూ వ్యతిరేక చర్యకు నడుం బిగించారు. ఇందుకు కాశీనాయన క్షేత్రం వేదికైంది. దీనులకు దేవాలయం.. అన్నార్తులను ఆదరించి అక్కున చేర్చుకునే అపర అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో కనిపించేదల్లా.. నిత్యాన్నదానం, స్వచ్ఛంద విరాళాల తత్వం, లాభాపేక్షలేని సేవా భావం! పచ్చటి నేలలోని ఆ ప్రశాంత క్షేత్రంలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది. కూటమి సర్కారు వరుసగా కూల్చివేతలు కొనసాగించింది. కాశీనాయన క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాషాయ వ్రస్తాలు ధరించి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తూ పలు ఆలయాలు దర్శించిన, సనాతన ధర్మానికి పరిరక్షకునిగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పరిధిలోని అటవీశాఖ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఆయన మాత్రం దీనిపై నోరుమెదపడంలేదు. ఎన్నో ఏళ్లుగా పేదల కడుపునింపుతున్న ఓ ధార్మీక క్షేత్రంపై కూటమి ప్రభుత్వం ఇలా కత్తిగట్టినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిత్యాన్నదానం, గో సంరక్షణ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసు పల్లి గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మల రెండో సంతానమైన కాశిరెడ్డి యవ్వనంలోనే ఇంటిని వదిలి ఆథ్యాత్మికత వైపు అడుగులు వేశారు. వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ గరుడాద్రి వద్ద తపస్సులో నిమగ్నమయ్యారని, ఆయనకు జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై మార్గ నిర్దేశం చేశారని ప్రతీతి. తన గురువు అతిరాస గురవయ్య ఉపదేశం మేరకు ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. నిత్యాన్నదానం, గో సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 1995 డిసెంబరు ఆరో తేదీ దత్తపౌర్ణమి రోజు మహాసమాధి అయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా 1999లో కలసపాడు, బి.కోడూరు పరిధిలోని పలు పంచాయతీలతో శ్రీ అవధూత కాశినాయన (ఎస్‌ఎకేఎన్‌) మండలం ఏర్పాటైంది. ఎంతో పవిత్రమైన కాశినాయన క్షేత్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూల్చివేతలు మొదలయ్యాయి. గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, మార్చి 7వతేదీన జ్యోతి క్షేత్రంలోని కుమ్మరి అన్నదాన సత్రం, విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం, గోవుల దాణా షెడ్డు, గోశాల షెడ్డు, మరుగుదొడ్లను కూల్చి వేశారు. జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో శివరంగారెడ్డి నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను కూలగొట్టారు. ఓ వర్గానికి చెందిన వారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌ ద్వారా ఈ పని చేయించారనే అనుమానాలు కాశినాయన భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎండలో అలమటిస్తున్న గోవులు వందకు పైగా అన్నదాన సత్రాలురాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కాశిరెడ్డి అవధూత కాశీనాయనగా పూజలు అందుకున్నారు. స్థానిక ప్రజలు ఆయనకు నిత్యం పూజలు నిర్వహిస్తూ 13 హెక్టార్ల పరి«ధిలో గుడి, గోశాల, అన్నదాన సత్రాలు, వసతి గృహాలు నిర్మించారు. పలు నిర్మాణాలు పురోగతిలో ఉన్నా­యి. కాశీనాయన క్షేత్రాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల్లో కాశీనాయన పేరిట వందకు పైగా అన్నదాన సత్రాలు కొనసాగుతున్నాయి. అటవీశాఖకు 50 ఎకరాలు..నల్లమల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా జ్యో­తి­లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆ గుడి వద్ద అన్నదానం ఏర్పాటుకు చేరుకున్న కాశీనాయన అక్కడే శివైక్యం చెందారు. 1997 నుంచి క్షేత్రం దిన­దిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. అటవీ­శాఖ తొలుత అటవీప్రాంతంగా, ఆ తరువాత రిజర్వు ఫారెస్టుగా 2000–2003 నుంచి చెబుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని 50 ఎకరాలను క్షేత్రం నిర్వాహకులు అటవీశాఖకు కేటాయింపజే­శారు. గతంలో రాష్ట్ర, కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరి­గాయి. విష­యం కోర్టు వరకు కూడా వెళ్లింది. దానిపై అటవీ­శాఖ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.అన్నదానసత్రంలో భోజనం చేస్తున్న భక్తులు కొసమెరుపేమిటంటే.. తిరుమల తొక్కిసలాటఘటనపై పవన్‌ కళ్యాణ్‌ హడావిడి చేయగా ఇపుడు కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై నారాలోకేష్‌ తాపీగా రంగంలోకి దిగారు. క్షమాపణలు చెబుతున్నానని, కూల్చిన నిర్మాణాలను పునరి్నర్మీస్తామని చెబుతుండడం ఏదో డ్రామాలా కనిపిస్తున్నదని పలు హిందూ ధార్మీక సంస్థలు విమర్శిస్తున్నాయి.దాతల సహకారం అపూర్వంఎక్కడి నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో మాకే అంతుబట్టదు. దాతల సహకారం మేం ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామంటే పదివేల మందికి సరిపడా సరుకులు స్వచ్ఛందంగా క్షేత్రానికి చేరుతుంటాయి. ఆలయ నిర్మాణానికి కూడా అదేవిధంగా సాయం అందుతోంది. వారి తోడ్పాటుతోనే మహత్తర క్షేత్రం నిర్మిత­మవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భక్త కోటి కోరుకుంటోంది. – బి.చెన్నారెడ్డి, ఆలయ ప్రధాన నిర్వాహకులుధర్మానికి అండగా నిలవండి ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చడం అభ్యంతరకరం. ఇలాంటి వందలాది ఆశ్ర­మాలను, ధార్మికవేత్తలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భక్తుల మనో­భావాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ధర్మ ప్రచారానికి అండగా నిలవాలి.– శ్రీనివాసానందస్వామి, కాశీనాయన క్షేత్రం50 ఎకరాలు ఇచ్చాం..కాశీనాయన క్షేత్రం సుమారు 13 హెక్టార్లలో విస్తరించింది. అభివృద్ధి పనులు కొన్నేళ్లుగా ఆగిపోయా­యి. ఇంకా చేయాల్సి­నవి ఉన్నాయి. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే 50 ఎకరాలను పెనగలూరు మండలంలో ఇచ్చాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నాం.– జీరయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు

High Court again made harsh comments on Hydra behavior9
పెద్దల జోలికి వెళ్లి చెప్పండి!

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నీటి వనరులు, సర్కార్‌ భూముల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. పేద, మధ్యతరగతి ప్రజలను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల జోలికెళ్లడం లేదని, ఒకసారి వారి నిర్మాణాల్లో నిబంధనలు పాటించారో, లేదో పరిశీలించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు హైడ్రా ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తోందా అని నిలదీసింది. పేద, మధ్యతరగతికి చెందిన ఇళ్లను కూల్చి మీడియాలో ఫొటోలు వేయించుకోవడం కాదని.. మియాపూర్, దుర్గం చెరువు సహా పలుచోట్ల సర్కార్‌ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ప్రముఖుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం దక్కినప్పుడే హైడ్రా ప్రజాప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందని తేల్చిచెప్పింది. ‘ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే చెరువులు, సరస్సుల నగరంగా పేరు ఉండేది. 2000కుపైగా చెరువులు ఉండగా, ఇప్పుడు 200 కూడా లేవు. చెరువుల రక్షణకు నాడు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉండేవి. హైడ్రా ఏర్పాటు బాగానే ఉన్నా.. పనితీరు మాత్రం ఆశాజనకంగా లేదు. పేదలతోపాటు పెద్దలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుంది. ఇప్పటి ప్రభుత్వాల కంటే నాడు నిజాం చేపట్టిన చెరువుల పరిరక్షణ చర్యలే పకడ్బందీగా ఉన్నాయి. మీరాలం చెరువు పరిధిలో నిర్మాణాలపై ఉమ్మడి సర్వే చేపట్టి.. ఆక్రమణలు ఉంటే తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది. ప్రభుత్వానిదా? వక్ఫ్‌దా?రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌ సర్వే నంబర్‌ 329/1, 329/2, 329/3లోని ఆరు ఎకరాల భూమిపై తహసీల్దార్‌ జారీచేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ ఫాతిమా, మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశా రు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాద నలు వినిపిస్తూ.. ‘సదరు భూమికి సంబంధించి వక్ఫ్‌ బోర్డు సీఈవో లేఖ మేరకు తహసీల్దార్‌ చర్యలు చేపట్టడం చెల్లదు. ఒకవేళ వక్ఫ్‌భూమి అయినా సీఈవో చర్యలు తీసుకోవచ్చు గానీ, నోటీసులు జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదు. ఆ నోటీసులను రద్దు చేయాలి’అని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఇదే హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్య ం మేరకు మీరాలం చెరువు పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాం. అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మీరా లం చెరువుకు సంబంధించి పిటిషనర్‌ అభ్యంతరాలపై ఉమ్మ డి సర్వే నిర్వహించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ప్రభుత్వానిదే అని తేలితే చర్యలు చేపట్టాలని, వక్ఫ్‌ బోర్డుదని తేలితే చర్యలు తీసుకునే బాధ్యతను బోర్డుకు అప్పగించాలని చెప్పారు. నీటి వనరుల ఆక్రమణపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవచ్చంటూ విచారణ ముగించారు.

India online gaming sector may cross 9 billion dollers by 202910
ఆన్‌లైన్‌ గేమింగ్‌.. జూమింగ్‌ 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌ హద్దే లేదన్నట్టుగా శరవేగంగా విస్తరిస్తోంది. రియల్‌ మనీ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వింజోగేమ్స్, ఐఈఐసీ సంయుక్త అంచనా ప్రకారం.. 2024లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌ విలువ 3.7 బిలియన్‌ డాలర్లుగా ఉంటే (సుమారు రూ.32,000 కోట్లు).. 2029 నాటికి 9.1 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.80,000 కోట్లు) వృద్ధి చెందనుంది. ముఖ్యంగా 86 శాతం వాటాతో రియల్‌ మనీ గేమ్స్‌ (ఆర్‌ఎంజీ) విభాగం ఈ మార్కెట్‌ను శాసించనుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో గేమ్‌ డెవలపర్ల సదస్సులో భాగంగా ఈ సంయుక్త నివేదికను వింజోగేమ్స్, ఐఈఐసీ విడుదల చేశాయి. ‘‘భారత్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ అసాధారణ వృద్ధి పథంలో కొనసాగుతోంది. 2029 నాటికి 9.1 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌తో.. ఇన్వెస్టర్లకు 63 బిలియన్‌ డాలర్ల విలువైన అవకాశాలను అందించనుంది. టెక్నాలజీ పరమైన ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు (ఐపీ), యూజర్లతో అనుసంధానం (ఎంగేజ్‌మెంట్‌) ద్వారా గేమింగ్‌కు భారత్‌ను బలమైన కేంద్రంగా (పవర్‌హౌస్‌) మార్చేందుకు వింజో కట్టుబడి ఉంది’’అని వింజో సహ వ్యవస్థాపకుడు పవన్‌ నంద తెలిపారు. 59 కోట్ల యూజర్లు.. ఈ నివేదికలోని సమాచారం ప్రకారం చూస్తే దేశంలో 59.1 కోట్ల మంది గేమర్స్‌ ఉన్నారు. అంతర్జాతీయంగా ఉన్న గేమర్లలో 20 శాతం ఇక్కడే ఉన్నారు. 11.2 బిలియన్‌ మొబైల్‌ గేమ్‌ యాప్‌ డౌన్‌లు నమోదయ్యాయి. 1,900 గేమింగ్‌ కంపెనీలతో ఈ రంగం సుమారుగా 1.3 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం 3 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం గమనార్హం. ప్రస్తుతం రూ.32 వేల కోట్ల ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్లో రియల్‌ మనీ గేమ్స్‌ (ఆర్‌ఎంజీ) వాటా 85.7 శాతంగా ఉంటే, 2029 నాటికి రూ.80 వేల కోట్ల మార్కెట్‌లోనూ 80 శాతం వాటా కలిగి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. నాన్‌ రియల్‌ మనీ గేమ్స్‌ మార్కెట్‌ వాటా ఇదే కాలంలో 14.3 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దేశంలో ఏకైక లిస్టెడ్‌ గేమింగ్‌ సంస్థ నజారా టెక్నాలజీస్‌ అంతర్జాతీయంగా లిస్టెడ్‌ గేమింగ్‌ కంపెనీల్లో అధిక ప్రీమియం వ్యాల్యుయేషన్‌ను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. ‘‘ప్రస్తుత ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగం మార్కెట్‌కు (32వేల కోట్లు) నజారా మాదిరే విలువను ఆపాదించినట్టయితే.. అప్పుడు ఇతర గేమింగ్‌ కంపెనీల ఐపీవోల రూపంలో ఇన్వెస్టర్లకు 26 బిలియన్‌ డాలర్ల విలువ సమకూరనుంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకుతోడు, బలపడుతున్న గేమ్‌ డెవలపర్‌ ఎకోసిస్టమ్, సానుకూల నియంత్రణ వాతావరణంతో 2034 నాటికి ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌ పరిమాణం 60 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. 20 లక్షల ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుంది’’అని వివరించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
విరామం అంటూనే విరుచుకుపడింది

కీవ్‌: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు

title
భారత్‌లో ట్రంప్‌ కంపెనీ.. తొలి ఆఫీస్‌ ఎక్కడంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన వ్యాపార సమ్మేళనం ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట

title
Trump: న్యాయవ్యవస్థను బేఖాతరు చేయబోతున్నారా?

అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార

title
అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం

ఆరేలియో మార్టినెజ్: అమెరికాలోని హోండురాస్‌(

title
సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్‌ మస్క్‌ సంచలన ఆరోపణలు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ

National View all
title
‘మీరు సమాధుల్లో దాక్కున్నా తవ్వితీస్తాం’

ముంబై: నాగ్ పూర్ లో జరిగిన హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌

title
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కోర్టులో కీలక పరిణామం

సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హ

title
పోలవరం ఎత్తును తగ్గించవద్దు: లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ

ఢిల్లీః  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్ర

title
Central Cabinet Meeting : యూపీఐ లావాదేవీలపై కేంద్రం గుడ్‌ న్యూస్‌!

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

title
ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్‌

ఢిల్లీ:   తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట

NRI View all
title
సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్‌ రిక్వెస్ట్‌!

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం  కేసులో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

title
తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో

title
ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు

 ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర

title
పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా

title
Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్‌ సంతాపం

అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్

NRI View all
title
Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్‌ కో

అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్‌ అండ్‌ కో

title
నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సిన

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement

వీడియోలు

Advertisement