Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Karnataka Political Honey Trap Victims Leader Names Complete Details1
Political Honey Trap: 20 ఏళ్లుగా ‘వలపు వల’లో రాజకీయ నేతలు!

బెంగళూరు: కన్నడనాట పొలిటికల్‌ హనీ ట్రాప్‌ వ్యవహారం కలకలం రేగింది. మంత్రులు సహా అనేకమంది నేతలు వలపు వల విసిరారని.. అందులో కొందరు చిక్కుకున్నారని స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఇందులో జాతీయ స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిపిన ప్రభుత్వం.. ఉన్నత న్యాయస్థాయి విచారణ జరిపిస్తామని ప్రకటించుకుంది. తనపై రెండుసార్లు హనీ ట్రాప్‌ ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న.. ఈ వ్యవహారంలో తనకు తెలిసే 48 మంది చిక్కుకుని ఉన్నారని అసెంబ్లీ ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై విచారణ జరిపించాలని అధికార, విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని, తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని, అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు బాధితుల్లో ఉన్నారని, ఇంకా ఎంతో మంది ఉండొచ్చని అభిప్రాయపడ్డారాయన. వాళ్లకు సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్న మంత్రి రాజన్న.. దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీని వెనక ఎవరు(King Ping) ఉన్నారనే విషయం బయటపడుతుందని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న స్పష్టం చేశారు. మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందిస్తూ.. ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్‌ జార్కిహోళీ మాట్లాడుతూ.. మంత్రి రాజన్నపై రెండుసార్లు హనీ ట్రాప్‌ యత్నం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని అన్నారు. ఈ తరహా ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతోంది.బుధవారం రాష్ట్ర శాంతి భద్రతల అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే వీ సునీల్‌ కుమార్‌ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం హనీ ట్రాప్‌ ప్రభుత్వం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. హోం శాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. గత వారం తుమకూరుకు చెందిన ఓ బీజేపీ నేత హనీ ట్రాప్‌ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నప్ప స్వామి అనే నేతకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ.. అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్‌మెయిల్‌ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Rasi Phalalu: Daily Horoscope On 21-03-2025 In Telugu2
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.సప్తమి రా.11.51 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: జ్యేష్ఠ రా.9.44 వరకు, తదుపరి మూల, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.30 నుండి 9.20 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: ప.12.16 నుండి 2.01 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.08, సూర్యాస్తమయం: 6.07. మేషం.... బంధువుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.వృషభం... దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.మిథునం... రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.కర్కాటకం... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. విచిత్రమైన సంఘటనలు. బంధువుల కలయిక. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.సింహం.... నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు ఒత్తిడులు.వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య... మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.తుల..... ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు. పనుల్లో ఆటంకాలు. రాబడికి మించి ఖర్చులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.వృశ్చికం..... శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదోన్నతులు.ధనుస్సు... పనులు మధ్యలో నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.మకరం..... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పండితగోష్ఠులలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కుంభం... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం. ఆలయదర్శనాలు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.మీనం.... ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

Betting apps Case against Rana, Prakash Raj, Vijay Deverakonda3
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్‌ యాప్స్‌ ఉచ్చు

సాక్షి, హైదరాబాద్‌/మియాపూర్‌: ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’పేరుతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న మియాపూర్‌ పోలీసుస్టేషన్‌లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్‌ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్‌ యాప్స్‌ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్‌అప్‌ యాడ్స్‌ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్‌ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్‌ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్‌ జీత్‌విన్‌ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్‌ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై బీఎన్‌ఎస్‌లోని 318 (4), 112 రెడ్‌ విత్‌ 49, గేమింగ్‌ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్‌ కానిస్టేబుల్‌ కిరణ్‌ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్‌ గేమ్‌ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్‌ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్‌ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్‌మెంట్స్‌తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్‌ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు.

Donald Trump says he has good relations with India and flags only problem4
మిత్ర దేశమే..కానీ టారిఫ్‌లే

వాషింగ్టన్‌: ఇండియాతో తమకు చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. కానీ, ఇండియాలో టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉందని, ఆ దేశంతో అదే ఏకైక సమస్య అని పేర్కొన్నారు. విదేశీ ఉత్పత్తులపై ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి టారిఫ్‌లు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్‌ పునరుద్ఘాటించారు.ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల ఉత్పత్తులపైనా తాము అలాంటి చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అమెరికా–ఇండియా సంబంధాలపై చర్చించారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలను క్రమంగా తగ్గిస్తారన్న విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఇండియాతో తనకున్న ఏకైక సమస్య ఆ విధంగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఇండియాలో అమెరికా ఉత్పుత్తులపై ఎలాంటి టారిఫ్‌లు ఉన్నాయో ఏప్రిల్‌ 2 నుంచి ఇండియా ఉత్పత్తులపై తమ దేశంలో అలాంటి టారిఫ్‌లే అమల్లోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరప్‌–ఎకనామిక్‌ కారిడార్‌(ఐమెక్‌)ను సానుకూల చర్యగా అభివర్ణించారు. ఇది అద్భుతమైన దేశాల కూటమి అని చెప్పారు. వ్యాపారం, వాణిజ్యంలో దెబ్బతీయాలని చూస్తున్న ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. తమ శత్రువులను మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. వారికి ఎలాంటి మర్యాద చేయాలో తమకు బాగా తెలుసని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టంచేశారు. మిత్రుల కంటే శత్రువులపైనే ఎక్కువగా దృష్టి పెడతామన్నారు.

Central Election Commission has come fire over the state government 5
మా అధికారాల్లోనే జోక్యం చేసుకుంటారా?

సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బోగస్‌ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం వెనుక ఉన్న నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంది. సిట్‌ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఇచ్చారని, ఇలా చేయడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ హైకోర్టుకు వివరించారు. ఈ వ్యవహారాన్ని తాము ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే.. రేపు ప్రతి రాష్ట్రం ఇలాగే వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చి వివరణ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని తెలిపారు. బేషరతుగా జీవోను ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకు లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సిట్‌ ఏర్పాటు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. సిట్‌ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. మా అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందిఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఎన్నికల నిర్వహణ తదితరాలన్నీ తమ పరిధిలోని వ్యవహారాలని చెప్పారు. వీటిలో ఏవైనా పొరపాట్లు గానీ, లోటుపాట్లు గానీ ఉన్నా వాటిని సరిచేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘంగా తాము మాత్రమేనన్నారు. ఇందులో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. సిట్‌ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తాము ఆరోపణలను నమోదు చేసి, ఆయనకు ఖర్చులు విధించాలని కోర్టును కోరారు. ఇలా తాము కోరినట్లు కూడా రికార్డ్‌ చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్‌ వాదనలు వినిపిస్తూ.. సిట్‌ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకుంటూ ఈ నెల 19న మరో జీవో ఇచ్చినట్టు కోర్టుకు వివరించారు. సిట్‌ ఏర్పాటుపై పిటిషన్‌ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో బోగస్‌ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు (ఫాం 7) దాఖలయ్యాయంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఫాం 7 దాఖలుపై విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 448 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ బాపట్లకు చెందిన గుండపనేని కోటేశ్వరరావు, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ సుబ్బారెడ్డి విచారణ జరిపారు.

Siraj comments on his place in the Indian team6
‘ఎంపిక నా చేతుల్లో లేదు’

బెంగళూరు: పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్‌ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు టీమిండియా విజేతగా నిలిచిన చాంపియన్స్‌ ట్రోఫీ టీమ్‌లోనూ అతనికి స్థానం లభించలేదు. అయితే ఈ హైదరాబాదీ పేసర్‌ జాతీయ జట్టులోకి త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం అంతగా ఆందోళన చెందడం లేదని, ఐపీఎల్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నట్లు అతను చెప్పాడు.ఐపీఎల్‌లో సిరాజ్‌ ఈసారి గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ‘భారత జట్టు ఎంపిక నా చేతుల్లో ఉండదనేది వాస్తవం. నా చేతుల్లో బంతి మాత్రమే ఉంటుంది. దాంతో ఏం చేయగలను అనేదే ముఖ్యం. టీమ్‌ సెలక్షన్‌ గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోను. అలా చేస్తే నా ఆటపై ప్రభావం పడుతుంది. మున్ముందు ఇంగ్లండ్‌ పర్యటన, ఆసియా కప్‌లాంటివి ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి దృష్టంతా ఐపీఎల్‌ పైనే ఉంది’ అని సిరాజ్‌ వ్యాఖ్యానించాడు. టీమిండియా తరఫున ఆడని సమయంలో బౌలింగ్‌ మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు సిరాజ్‌ వెల్లడించాడు. ‘గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను. సాధారణంగా విశ్రాంతి తక్కువగా దొరుకుతుంది. కానీ ఈసారి మంచి విరామం లభించింది. అందుకే బౌలింగ్, ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టా. కొత్త బంతులు, పాత బంతులతో బౌలింగ్‌ చేశాం. స్లో బంతులు, యార్కర్ల విషయంలో ప్రత్యేక సాధన చేశాను. కొత్తగా నేర్చుకున్న అంశాలను ఐపీఎల్‌లో ప్రదర్శిస్తా’ అని అతను చెప్పాడు. శుబ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సిరాజ్‌ వెల్లడించాడు. ‘బెంగళూరు జట్టుకు దూరం కావడం కొంత బాధకు గురి చేసిందనేది వాస్తవం. కోహ్లి అన్ని రకాలుగా అండగా నిలిచాడు. అయితే ఇక్కడా గిల్‌ సారథ్యంలో చాలా మంచి జట్టుంది. గిల్‌ కెపె్టన్సీలో బౌలర్లకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఎప్పుడూ వారించడు. మేమిద్దరం ఒకే టెస్టుతో అరంగేట్రం చేశాం. వ్యక్తిగతంగా కూడా మంచి సాన్నిహిత్యం ఉంది’ అని సిరాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీమ్‌లో రబాడ, రషీద్, ఇషాంత్, కొయెట్జీ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండటం సానుకూల విషయమని, ఇది అందరిపై ఒత్తిడి తగ్గిస్తుందని అతను అభిప్రాయ పడ్డాడు. గత సీజన్‌ వరకు ఇదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్‌ షమీతో తనను పోల్చడంపై స్పందిస్తూ... ‘టైటాన్స్‌ టీమ్‌ తరఫున షమీ భాయ్‌ చాలా బాగా ఆడాడు. కీలక సమయాల్లో స్వింగ్‌తో వికెట్లు తీశాడు. నేను కూడా ఆయనలాగే పెద్ద సంఖ్యలో వికెట్లు తీసి జట్టుకు ఉపయోగపడితే చాలు. మొతెరా మైదానంలో కొత్త బంతితో షమీ వికెట్లు తీయడం నేను చూశాను. అదే తరహాలో పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే నా పని’ అని సిరాజ్‌ చెప్పాడు. టైటాన్స్‌ కోచ్‌గా ఉన్న మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రాతో కలిసి పని చేసేందుకు, ఆయన వద్ద కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు.

Avoid calling customers repeatedly to submit KYC docs: RBI Governor Sanjay Malhotra7
కేవైసీ కోసం కస్టమర్లను వేధించొద్దు

ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బ్యాంక్‌లకు కీలక సూచన చేశారు. నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ/నీ కస్టమర్‌ గురించి తెలుసుకో) డాక్యుమెంట్ల కోసం కస్టమర్లకు అదేపనిగా తరచూ కాల్‌ చేస్తూ వేదించొద్దన్నారు. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. ఏదేనీ ఆర్థిక నియంత్రణ సంస్థ పరిధిలో ఒక కస్టమర్‌ ఒక చోట (బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ తదితర) సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్లను.. ఇతర సంస్థలు సైతం పొందడానికి అవకాశం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.కస్టమర్‌ ఒకసారి ఒక ఆర్థిక సంస్థకు పత్రాలను సమర్పించినట్టయితే, అవే పత్రాలను మళ్లీ, మళ్లీ సమర్పించాలంటూ కోరకుండా చూడాలన్నారు. తరచూ కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంకులు కోరుతుండడం పట్ల సోషల్‌ మీడియాపై చాలా మంది నిరసన వ్యక్తం చేస్తుండడంతో, ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కస్టమర్ల ఫిర్యాదుల సంఖ్యను బ్యాంకులు తగ్గించి చూపించరాదని, అలా చేయడం నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుందని బ్యాంకులను ఆర్‌బీఐ గవర్నర్‌ హెచ్చరించారు. బ్యాంకులు తమ సేవలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి బ్యాంక్‌ మేనేజర్ల నుంచి మేనేజింగ్‌ డైరెక్టర్ల వరకు సమయం కేటాయించాలన్నారు.

Miss World competition begins in Hyderabad on May 10: Telangana8
జగదేక నగరానికి అతిలోక సుందరి

సాక్షి, హైదరాబాద్‌: అప్పుడెప్పుడో ఓ సినిమాలో అంగుళీయకం కోసం అతిలోక సుందరి దివి నుంచి భువికి దిగొచ్చింది. ఇప్పుడు.. అంగుళీయకం పోకున్నా.. అతిలోక సుందరీమణులెందరో అందాల పోటీల కోసం భాగ్యనగరానికి తరలిరానున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అద్భుతమైన వేడుక ‘మిస్‌ వరల్డ్‌ 2025’ నిర్వహణకు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది.మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌలి ఐఎస్బీ, టీ–హబ్, శిల్పకళావేదిక.. ఇలా పలు వేదికల్లో సుందరీమణులు వారి ప్రత్యేకతను చాటుకుని జగజ్జేతగా నిలిచేందుకు పోటీ పడనున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పోటీలు కావడంతో భాగ్యనగర పేరు ప్రఖ్యాతులు కూడా మరింత విశ్వవ్యాప్తం కానున్నాయి.గతంలో రెండుసార్లు.. మన దేశంలో ఇప్పటివరకు రెండు పర్యాయాలు ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. 1996లో తొలిసారి బెంగళూరు ఇందుకు వేదికైంది. ఆ తర్వాత గతేడాదే 71వ ఎడిషన్‌ పోటీలకు ముంబై ఆతిథ్యమిచ్చింది. ఇక వరుసగా రెండోసారి.. 72వ ఎడిషన్‌కు కూడా మన దేశమే వేదిక కానుంది. ఇతర దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఏర్పాట్లు ఘనంగా ఉన్నా, భారీ జనసందోహంలో కార్యక్రమాలు జరిగేవి కాదు. అయితే గతేడాది ముంబైలో జరిగినప్పుడు, ఈ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారు.దీంతో మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులకు ఇది క్రేజీగా కనిపించింది. దీంతో మరోసారి భారత్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. నిర్వాహకులతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు అప్పగించింది. ఆమె నిర్వాహకులను ఒప్పించడంలో సఫలీకృతం కావడంతో హైదరాబాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడే ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది.అప్పటి నుంచే ఆయన నిర్వాహకులతో సంప్రదింపులకు సన్నాహాలు ప్రారంభించారు. కాగా ఈసారి 140 దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఆయా కార్యక్రమాలను కవర్‌ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 3,300 మంది మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. బికినీలకు నో.. ప్రపంచ సుందరి పోటీల్లో పలు అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. వాటిల్లో కొన్నింటిలో బికినీల్లాంటి వ్రస్తాలు ధరించాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో శరీరాన్ని ప్రదర్శించే విధంగా వస్త్రధారణ ఉండొద్దని ప్రభుత్వం నిర్వాహకులకు ముందుగానే షరతు విధించింది. ఆయా దేశాల సంప్రదాయ, కాస్త ఆధునిక వ్రస్తాలు ధరించొచ్చని, ఒక పోటీలో పూర్తిగా భారతీయ సంప్రదాయ వ్రస్తాలే ధరించాలని సూచించింది. దీనికి నిర్వాహకులు అంగీకరించారు. గచ్చిబౌలి స్టేడియం టూ హైటెక్స్‌.. అందాల పోటీల్లో పాల్గొనే సుందరీమణులు మే 6, 7 తేదీల్లో నగరానికి చేరుకుంటారు. 10న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక ఘనంగా జరుగుతుంది. తెలంగాణ జానపద, గిరిజన నృత్యాభినయ ఇతివృత్తంతో ఇది ఉంటుంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం, టీ–హబ్, శిల్పకళావేదిక, ఐఎస్బీ క్యాంపస్, హైటెక్స్‌ వేదికల్లో వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయి. వాటిని మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులే ఎంచుకున్నారు. రాష్ట్రంలో పర్యటనలు ఇలా.. పోటీలు జరిగే సమయంలో సుందరీమణులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ సందర్భంలో వారందరితో పోచంపల్లి చీరలు కట్టించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వారిని తీసుకెళుతుంది. 40 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి, ఒక్కో బృందాన్ని ఒక్కోచోటకు తీసుకెళ్తారు. బుద్ధవనం: 12న ఓ బృందం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం సందర్శిస్తుంది. బౌద్ధం ఇతివృత్తంగా ఇది సాగుతుంది. చార్మినార్‌: 13న సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఓ బృందం చార్మినార్, లాడ్‌బజార్‌లలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తుంది. అక్కడ షాపింగ్‌ చేస్తారు. చౌమొహల్లాలో డిన్నర్‌: 13న చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రత్యక్ష సంగీత విభావరి నడుమ పోటీదారులు విందులో పాల్గొంటారు. కాళోజీ కళాక్షేత్రం: 14న అమెరికా–కరేబియన్‌ ప్రాంతాల పోటీదారులు వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉదయం 11 నుంచి 2 వరకు అక్కడ స్థానికులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. రామప్ప: సాయంత్రం 5 నుంచి 7 వరకు యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పేరిణి నృత్యరీతులతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. యాదగిరిగుట్ట: యూరప్‌నకు చెందిన పోటీదారుల బృందం 15న మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు యాదగిరిగుట్ట దేవాలయాన్ని సందర్శిస్తుంది. పోచంపల్లి: యూరప్‌నకు చెందిన రెండో బృందం 15న సాయంత్రం యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ గుర్తించిన పోచంపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు. మెడికల్‌ టూరిజం: 16న ఆఫ్రికా, మధ్య ప్రాచ్య (మిడిలీస్ట్‌) దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్‌ టూర్‌లలో భాగంగా నగరంలోని అపోలో, ఏఐజీ, యశోదా ఆసుపత్రులను సందర్శిస్తారు. స్పోర్ట్స్‌ ఫైనల్‌: స్పోర్ట్స్‌ ఫైనల్‌ కార్యక్రమం 17న ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు గచి్చబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుంది. కల్చరల్, మ్యూజిక్, డాన్స్, ఫుడ్‌ ఆర్ట్‌ : 17న సాయంత్రం నగర శివారులోని ఎకో టూరిజం పార్కులో జరిగే కల్చరల్, ఫుడ్, ఆర్ట్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. సేఫ్టీ టూరిజం: నగరంలో పోలీసింగ్‌ తీరును పరిశీలించేందుకు 19న పోటీదారులు పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శిస్తారు. సచివాలయం: 19న హుస్సేన్‌సాగర్‌ తీరం, అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయం ప్రాంతాలను సందర్శిస్తారు. టీహబ్‌: 20, 21 తేదీల్లో టీహబ్‌లో మిస్‌ వరల్డ్‌ కరేబియన్, మిస్‌ వరల్డ్‌ ఆఫ్రికా, మిస్‌ వరల్డ్‌ ఏషియా, ఓషియానియాల మధ్య కాంటినెంటల్‌ ఫినాలే ఉంటుంది. శిల్పారామం: 21న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు శిల్పారామంలో ఆర్ట్స్‌ క్రాఫ్టŠస్‌ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. శిల్పకళావేదిక: 22న శిల్పకళావేదికలో టాలెంట్‌ ఫినాలే జరుగుతుంది. ఐఎస్బీ: గచ్చిబౌలిలోని ఐఎస్బీలో 23న హెడ్‌ టూ హెడ్‌ ఛాలెంజ్‌ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్‌: 24న హైటెక్స్‌లో మోడల్‌ అండ్‌ ఫ్యాషన్‌ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్‌లోనే 25న నగలు వజ్రాభరణాల ఫ్యాషన్‌ షో జరుగుతుంది. బ్రిటిష్‌ రెసిడెన్సీ: 26న బ్రిటిష్‌ రెసిడెన్సీ, తాజ్‌ ఫలక్‌నుమాలలో పర్పస్‌ ఈవెంట్‌ గలా డిన్నర్‌ ఉంటుంది. ప్రముఖ కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శన ఉంటుంది. హైటెక్స్‌: మే 31న పోటీల తుది పోరు (గ్రాండ్‌ ఫినాలె). సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది. రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి ఈసారి పరేడ్‌ మైదానంలో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి సందడి చేయనుంది. మే 31న జరిగే తుదిపోరులో ఏ దేశానికి చెందిన సుందరి విజేతగా నిలుస్తుందో ఆమె.. జూన్‌ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ నిర్వాహకులు అంగీకరించారు.మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకున్న సుందరితో పాటు, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మొదటి, రెండో రన్నరప్‌లు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్టు తెలిసింది. పరేడ్‌ మైదానంలో జరిగే ముఖ్య కార్యక్రమాలతో పాటు ఆరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి కూడా వారు హజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ గవర్నర్‌ ఏర్పాటు చేసే హై టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటారు.

Establishment of SIT as an extra constitutional body9
రెడ్‌బుక్‌ తంత్రం.. సిట్‌ కుతంత్రం!

సాక్షి, అమరావతి : పోలీస్‌ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హ­తలు ఉండవు.. ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో చెప్పరు.. కానీ అది పోలీస్‌ స్టేషనే. స్టేష­న్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఎవరో చెప్పరు కానీ అది పోలీ­స్‌ స్టేషనే. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇ­ది రెడ్‌బుక్‌ రాజ్యాంగ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసిన రా­జ్యాంగేతర శక్తి. దీనిపేరు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌). వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మ­ద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు ద­ర్యాప్తు పేరిట ప్రభుత్వం బరితెగిస్తోంది. అందు­కోసమే ఏర్పాటు చేసిన సిట్‌ ద్వారా అరాచకాల­కు తెగబడుతోంది. చట్టంలో పేర్కొన్న నిబంధ­నలను బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ పెద్దలు ప­క్కా పన్నాగంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రలోభపెట్టి, బెదిరించి, వేధించి మరీ అ­బద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసే కుట్ర దాగుంది. చట్ట విరుద్ధంగా సిట్‌ ఏర్పాటు సిట్‌ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోనే ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సిట్‌ను ఏర్పాటు చేశారనేది జీవోనే స్పష్టం చేస్తోంది. చట్టంలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టమవుతోంది. ఏదైనా వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసే సిట్‌ను ఓ పోలీస్‌ స్టేషన్‌గా పరిగణించాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సిట్‌ను ఓ పోలీస్‌ స్టేషన్‌గా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. కానీ అసలు పోలీస్‌ స్టేషన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన నిబంధనలను మాత్రం గాలికి వదిలేయడం గమనార్హం. బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 2 ప్రకారం.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా పోస్టుగానీ, ప్రదేశంగానీ పోలీస్‌ స్టేషన్‌గా పరిగణిస్తారు’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ స్టేషన్‌ కోసం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా ‘స్థానిక ప్రాంతం’ కూడా అయ్యుండాలని చట్టం స్పష్టం చేసింది. అంటే పోలీస్‌ స్టేషన్‌కు స్థానిక ప్రాంతం ఏదన్నది స్పష్టం చేయాలి. కానీ మద్యం విధానంపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘స్థానిక ప్రాంతం’ ఏదన్నది పేర్కొన లేదు. స్థానిక ప్రాంతం అన్నది లేకుండా ఏదైనా పోస్టునుగానీ, ప్రదేశాన్నిగానీ పోలీస్‌ స్టేషన్‌గా గుర్తించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు కచి్చతంగా స్టేషన్‌ హౌస్‌ అధికారిగానీ లేదా ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌ ఆ పోలీస్‌ స్టేషన్‌కు బాధ్యుడిగా ఉండాలి. మరి సిట్‌ను పోలీస్‌ స్టేషన్‌గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇన్‌చార్జ్‌ ఎవరన్నది పేర్కొన లేదు. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిట్‌ను ఏర్పాటు చేసినట్టేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్‌ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందన్నది కూడా ప్రభుత్వం వెల్లడించ లేదు. ఫలితంగా బాధితులెవరైనా సిట్‌పై ఫిర్యాదు ఎవరికి చేయాలన్నది స్పష్టత లేదు. తద్వారా పోలీస్‌ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఏవీ సిట్‌కు లేవని తేల్చి చెబుతున్నారు. అబద్ధపు వాంగ్మూలాలుసిట్‌ అధికారులు ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతరులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేయిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలు అభియోగాలు ఏమిటన్నది చెప్పకుండానే వా­రితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయిస్తుండటమే ఇందుకు నిదర్శనం. బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 2(క్యూ) ‘చేయకూడని పని ఏదైనా చేసినా, చేయాల్సిన పని చేయకుండా ఉన్నా అది నేరం’ అని నిర్వచించింది. అటువంటి నేరం చట్ట ప్రకారం శిక్షార్హం అని కూడా పేర్కొంది. మద్యం విధానంపై నమో­దు చేసిన కేసులో పలువురు అధికారులు, ఇతరులను దర్యాప్తు పేరిట వేధిస్తున్న సిట్‌.. అసలు నేరం ఏమిటన్నది చెప్పకపోవడం గమనార్హం. ఎందుకంటే చేయకూ­డని పని చేసినా, చేయాల్సిన పని చేయకపోయినా ఆ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యు­లు అవుతారు. బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 34 ప్రకారం.. ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రభుత్వ అధికారి సంబంధిత బాధ్యులకు తెలియజేయడంతోపాటు పోలీసులకు ఫిర్యా­దు చేయాలి. ఏ పౌరుడైనా సరే తనకు ఏదైనా నేరానికి సంబంధించిన స­మా­చారం తెలిస్తే పోలీసులకుగానీ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులకుగానీ తెలియజేయా­లని బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 33 పేర్కొంటోంది. మరి ప్రభుత్వ అధికారులకు మరింత బాధ్య­త ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కక్ష సాధింపు కోసమే బరితెగింపు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ సిట్‌ను ఏర్పా­టు చేసింది. సిట్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఓ స్థానిక ప్రాంతాన్ని గుర్తిస్తే.. సిట్‌ కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించాలి. సాక్షులు, నిందితులను ఎ­క్కడ అదుపులోకి తీసుకున్నా సరే ఆ పోలీస్‌స్టేషన్‌­గా గుర్తించిన ఆ ప్రదేశానికి తీసుకెళ్లి విచారించా­లి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభు­త్వం కుట్ర పూరితంగా కేసు నమోదు చేసింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, పూర్వ అధికారులు, ఇతర సాక్షులుగా భావిస్తున్న వారిని దర్యాప్తు పేరుతో ఓ పరిధికి మించి వేధించడం సాధ్యం కాదు. అక్రమంగా నిర్బంధిస్తే బా­ధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకా­శం ఉంది. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం ని­బంధనలకు విరుద్ధంగా సిట్‌ను పోలీస్‌ స్టేషన్‌గా గుర్తించింది. తద్వారా సిట్‌ను ఓ అరాచక శ­క్తు­ల అడ్డాగా, ప్రభుత్వ అధికారిక వేధింపులకు కేంద్రంగా, పోలీసు దాదాగిరీ డెన్‌గా తీర్చిదిద్దింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయ­డమే పనిగా పెట్టుకున్న సిట్‌ అధికారులు దాంతో విచ్చలవిడిగా చెలరేగి పోతున్నారు. దర్యాప్తు పేరిట ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పూర్వ అధికారులు, డిస్టిలరీల ప్రతినిధు­లు, ఇతరులను దర్యాప్తు పేరిట తీవ్రంగా వేధించా­రు. వారిని గుర్తు తెలియని ప్రదేశాల్లో అ­క్ర­మంగా నిర్బంధించి శారీరకంగా మానసికంగా హింసించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేకపో­తే వారిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అక్ర­మ కేసులు నమోదు చేసి వేధిస్తామని బెంబేలెత్తించారు.

Tollywood Actresses Acting in Item Songs10
స్పెషల్‌ సాంగ్స్‌కి సై

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది సామెత. చిత్ర పరిశ్రమలో ఈ సామెత బాగా వర్తిస్తుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో.. క్రేజ్‌ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు పెంచుకోవాలి. ఇందుకు కేవలం హీరోయిన్‌ పాత్రలకే పరిమితం కాకుండా ట్రెండ్‌కి తగ్గట్టుగా కెరీర్‌ని మలచుకుంటూ స్పెషల్‌ సాంగ్స్‌కి కూడా సై అంటున్నారు పలువురు కథానాయికలు.పైగా ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్‌ సాంగ్స్‌లో నర్తించేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్‌ సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.రెట్రోకి హైలైట్‌ ‘ఇష్టం’ (2001) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు శ్రియా శరణ్‌. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్‌ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించి, స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్, స్పెషల్‌ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ. ప్రత్యేక పాటల్లో నర్తించడం ఆమెకు కొత్త కాదు. రామ్‌ని హీరోగా, ఇలియానాని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ వైవీఎస్‌ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ (2006) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటించిన ‘మున్నా’ (2007), వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘తులసి’ (2007), పవన్‌ కల్యాణ్‌ హీరోగా చేసిన ‘పులి’, సందీప్‌ కిషన్, సాయిదుర్గా తేజ్‌ నటించిన ‘నక్షత్రం’ (2017) వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన శ్రియ తాజాగా ‘రెట్రో’ సినిమాలో ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొదుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించారు.సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించిన ఈ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో సూర్యతో కాలు కదిపారు శ్రియ. గోవాలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో సూర్య, శ్రియలపై ఈ పాట చిత్రీకరించారు మేకర్స్‌. సూర్య, జ్యోతిక, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్‌ రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారినాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్‌ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్‌ వంటి హీరోలకి జోడీగా నటించి, తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించారు.రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘రంగస్థలం’ (2018) సినిమాలోని ‘జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి...’ పూజా చేసిన తొలి స్పెషల్‌ సాంగ్‌. ఈ పాటలో రామ్‌చరణ్, పూజా హెగ్డే మాస్‌ డ్యాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘ఎఫ్‌ 3’ (2022) సినిమాలో ‘అధ్యక్షా... లైఫ్‌ అంటే మినిమం ఇట్టా ఉండాలా...’ అనే సాంగ్‌లో రెండోసారి చిందేసిన పూజ ముచ్చటగా మూడోసారి ‘కూలీ’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు.రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొదిన చిత్రం ‘కూలీ’. అనిరు«ధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ మూవీలోని ప్రత్యేక పాట చాలా వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్న్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ‘కూలీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.అది దా సర్‌ప్రైజ్‌అది దా సర్‌ప్రైజ్‌ అంటున్నారు కేతికా శర్మ. ఆకాశ్‌ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్‌’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు కేతిక. 2021 అక్టోబరు 21న విడుదలైన ఈ మూవీలో ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కేతికా శర్మ తొలిసారి ‘రాబిన్‌హుడ్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్‌ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొదిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’.శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో ‘అది దా సర్‌ప్రైజ్‌...’ అంటూ సాగే ప్రత్యేక పాటలో కేతికా శర్మ సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటని నీతి మోహన్, అనురాగ్‌ కులకర్ణి పాడగా, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.నా ముద్దుపేరు స్వాతి రెడ్డి శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవర గమన’ (2023) సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రెబా మోనికా జాన్‌. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవడంతో ఈ బ్యూటీ క్రేజ్‌ ఓ రేంజ్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్‌’ మూవీలో శ్రీవిష్ణుతో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేశారు. సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’.కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, మురళీధర్‌ గౌడ్, డైరెక్టర్‌ కేవీ అనుదీప్‌ కీలక పాత్రలు పోషించారు. ‘మ్యాడ్‌’కి (2023) సీక్వెల్‌గా రూపొదిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’లో రెబా మోనికా జాన్‌ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి... నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి...’ అంటూ సాగే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేశారు రెబా. సురేష్‌ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి, భీమ్స్‌ ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్‌ కానుంది.మొదటి సారి...ఆకాశ్‌ పూరి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ (2018) సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగుకి పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత ‘గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్‌ రంజన్, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వంటి సినిమాల్లో నటించి, మెప్పించారామె. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేశారీ బ్యూటీ. ఈ మూవీలో ఆమె నటన, గ్లామర్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే నేహా శెట్టి తొలిసారి ఓ ప్రత్యేక పాటలో చిందేశారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘సాహో’ మూవీ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఆ పాటలో పవన్‌ కల్యాణ్‌తో కలిసి చిందేశారట నేహా శెట్టి. థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్‌ కానుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.టచ్‌లో ఉండు ఓ రబ్బీ...తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా నటించిన చంద్రికా రవి ఓ స్పెషల్‌ సాంగ్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో ఓ ప్రత్యేక పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (2023) మూవీలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...’ అనే స్పెషల్‌ సాంగ్‌లో తనదైన గ్లామర్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేశారు చంద్రిక.తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారామె. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం నితిన్, భరత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటించారు. యూనిక్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొదిన ఈ మూవీలో ‘టచ్‌లో ఉండు ఓ రబ్బీ... ఓ రబ్బీ...’ అంటూ చిందేశారు చంద్రిక.ఈ పాటకి చంద్రబోస్‌ మాస్‌ లిరిక్స్‌ అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రధన్‌ తనదైన హుషారైన సంగీతం అందించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌పై రూపొదిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఏప్రిల్‌ 11న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఆ పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా చిందేయనున్నారని టాక్‌. ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలో ‘వేర్‌ ఈజ్‌ ద పార్టీ...’ అనే ప్రత్యేక పాటలో చిరంజీవి– ఊర్వశీ రౌతేలా తమదైన స్టెప్పులతో అలరించిన సంగతి తెలిసిందే.ఈ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ‘విశ్వంభర’లోనూ చిరంజీవితో కలిసి స్పెషల్‌ సాంగ్‌లో ఊర్వశి మెరవనున్నారట. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుందని టాక్‌. ఇదిలా ఉంటే... బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్‌’. ఈ మూవీలో రణదీప్‌ హుడా, వినీత్‌ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర కీలక పాత్రధారులు. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఆ పాటలో హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌ మెరవనున్నారని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్‌ 10న రిలీజ్‌ కానుంది. కాగా ‘విశ్వంభర’లో ఊర్వశీ రౌతేలా, ‘జాట్‌’లో నిధీ అగర్వాల్‌ స్పెషల్‌ సాంగ్స్‌ విషయంపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.వీరే కాదు.. మరి కొందరు హీరోయిన్లు కూడా ప్రత్యేక పాటల్లో సందడి చేయనున్నారు. – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement