Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Government Revises Stand on Annadata Sukhibhava Scheme1
రైతన్న దగా.. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్‌ యూటర్న్‌

సాక్షి,విజయవాడ : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ రైతన్నను దగా చేసింది. అన్నదాత సుఖీభవపై యూటర్న్‌ తీసుకుంది. ఎన్నికల మెనిఫెస్టోలో మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు రైతులకు ఇచ్చేది రూ.14వేలేనని తేల్చి చెప్పింది. అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలుతో కలిపి రూ.20 వేలు ఇస్తామని, మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాము అంటూ అబద్ధాలు చెప్పారు. అయితే, మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడ కేంద్రం సహాయం ఇస్తేనే అన్నదాత సుఖీభవ ఇస్తామని ప్రస్తావించలేదు. ఇప్పుడు అధికారంలోకి రాగానే రైతులకు ఎగనామం పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.14 వేలే ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Take Back Words If Derogatory M Kharge2
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఈరోజు(మంగళవారం) చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. తాను చేసినవ్యా ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్‌ నారాయణ్‌ సింగ్‌క​ఉ క్షమాప‌ణ‌లు చెప్పారు.జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై తాము చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాని తోసి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అవమానకంగా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారని, అది క్షమించరానిదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిం‍దేనని డిమాండ్ చేశారు అదే సమయంలో ఆయన వాడిన పదాన్ని కూడా రికార్డులనుండి తొలగించాలన్నారు. దాంతో దిగి వచ్చిన ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు తెలియజేశారు. ‘నేను ఇక్కడ సభను ఉద్దేశించో, లేక మిమ్మల్ని( రాజ్యసభ చైర్మన్ చైర్)ను ఉద్దేశించో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే ఆ వ్యాఖ్యలను చేశాను. ఆ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వెనక్కి తీసుకుంటాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్‌ మోషన్ ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తమిళిలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది మా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.

AP High Court Dismissed Avuthu Sridhar Custody Petition3
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ

అమరావతి, సాక్షి: కూటమి సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అవుతు శ్రీధర్‌ రెడ్డి రిమాండ్‌ పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్‌ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్‌ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.

AP Assembly Budget Session 2025: March 11th Updates4
మండలి: మేం అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది: బొత్స

అచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం👉వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు👉వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమేమంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి👉ఆధారాలుంటే రుజువుచేయండి👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండిబుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ👉వైఎస్‌ జగన్‌ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా👉కూటమి సర్కార్‌ సాయం అందించడంలో విఫలమైంది👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాంఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు.

TSPSC announced group 2 mains result on March 10, 20255
TSPSC Group 2 results released : తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌తో పాటు కీ విడుదలైంది. ఓఎంఆర్‌ షీట్‌ను సైతం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పెట్టింది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ కొద్ది సేపటిక్రితమే విడుదల చేసింది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలకాగా, ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్‌ 15,16న జరిగిన ఈ పరీక్షలను సుమారు 2.5లక్షల మంది రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. గ్రూప్-2 ప‌రీక్షల‌ ఇలా..టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. అలాగే డిసెంబరు 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వ‌ర‌కు పేపర్-​3 ప‌రీక్ష‌ను ,మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేప‌ర్‌-4 పరీక్ష నిర్వహించింది.

IPL 2025: KL Rahul Rejects Delhi Capitals Captaincy, New Skipper Finalized Says Reports6
కేఎల్‌ రాహుల్‌ సంచలన నిర్ణయం..!

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు కేఎల్‌ రాహుల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. రాహుల్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించాడని సమాచారం. కెప్టెన్సీ చేపట్టే విషయంలో డీసీ యాజమాన్యం రాహుల్‌ను సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని రాహుల్‌ మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేశాడట. దీంతో డీసీ యాజమాన్యం అక్షర్‌ పటేల్‌ పేరును కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు సమాచారం. ఇవాళో రేపో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ సక్సెస్‌ అనంతరం డీసీ మేనేజ్‌మెంట్‌ అక్షర్‌ విషయంలో చాలా హ్యాపీగా ఉందని తెలుస్తుంది. అక్షర్‌ను డీసీ మేనేజ్‌మెంట్‌ మెగా వేలానికి ముందు రూ. 16.5 కోట్లకు రీటైన్‌ చేసుకుంది. కేఎల్‌ రాహుల్‌ను మెగా వేలంలో రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్‌కు టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో పంజాబ్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండగా.. అక్షర్‌ కెప్టెన్‌గా ఎంపికైతే ఇదే అతనికి ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా తొలి అసైన్‌మెంట్‌ అవుతుంది. అక్షర్‌కు దేశవాలీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో గుజరాత్‌ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది.అక్షర్‌ గత సీజన్‌లో రిషబ్‌ పంత్‌ అందుబాటులో లేనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. అక్షర్‌ 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కొనసాగుతున్నాడు. అక్షర్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 150 మ్యాచ్‌లు ఆడి 1653 పరుగులు, 123 వికెట్లు తీశాడు. అక్షర్‌ బ్యాటింగ్‌ స్ట్రయిక్‌రేట్‌ 130.88గా ఉండగా.. బౌలింగ్‌ ఎకానమీ 7.28గా ఉంది. అక్షర్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా కూడా పని చేశాడు. కాగా, గత సీజన్‌ వరకు కెప్టెన్‌గా ఉన్న రిషబ్‌ పంత్‌ను ఢిల్లీ వదిలేసుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలో పాల్గొన్న పంత్‌ను లక్నో రికార్డు ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది.పలు మ్యాచ్‌లకు దూరం కానున్న రాహుల్‌..?ఐపీఎల్‌ 2025 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభంకానుండగా.. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. వైజాగ్‌లో జరిగే పోరులో ఢిల్లీ..లక్నోతో తలపడనుంది. కాగా, ఈ సీజన్‌లో తొలి రెండు, మూడు మ్యాచ్‌లకు కేఎల్‌ రాహుల్‌ దూరం కానున్నాడని తెలుస్తుంది. రాహుల్‌ భార్య అతియా శెట్టి త్వరలో బిడ్డకు జన్మనివ్వనుందని సమాచారం. ఈ కారణంగానే రాహుల్‌ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌ వద్ద పర్మిషన్‌ తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. రాహుల్‌-అతియాల వివాహాం 2023 జనవరిలో జరిగింది. ఈ జంట గతేడాది నవంబర్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని బహిర్గతం చేసింది.2025 ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్‌ డుప్లెసిస్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, అషుతోష్‌ శర్మ, విప్రాజ్‌ నిగమ్‌, దర్శన్‌ నల్కండే, అజయ్‌ జాదవ్‌ మండల్‌, త్రిపురణ విజయ్‌, అక్షర్‌ పటేల్‌, మన్వంత్‌ కుమార్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అభిషేక్‌ పోరెల్‌, డొనొవన్‌ ఫెరియెరా, కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దుష్మంత చమీరా, మిచెల్‌ స్టార్క్‌, మోహిత్‌ శర్మ, టి నటరాజన్‌, ముకేశ్‌ కుమార్‌

KSR Comment On Venkaiah Naidu Praise Chandrababu7
వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు. ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్‌సిక్స్‌తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్‌గా మూడు పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్‌సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత.

Ranya Rao smuggling case: CID Investigation Orders probe against Her father Role8
నటి రన్యారావు కేసులో కీలక మలుపు

సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో పాటు వీఐపీ ప్రొటోకాల్‌ దుర్వినియోగం.. అందులో ఆమె సవతి తండ్రి ప్రమేయం తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విచారణకు ఆదేశించారు.ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు.. అలాగే తన విదేశీ పర్యటనల టైంలో వాళ్ల చేతుల్లో వేధింపులకు గురయ్యానన్న రన్యారావు ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరపనుంది. వీలైనంత త్వరగా నిజనిర్ధారణలతో నివేదిక సమర్పించాలని దర్యాప్తు ఏజెన్సీని ప్రభుత్వం ఆదేశించింది.ఇక మరోవైపు.. నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమ రవాణా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్‌ దుర్వినియోగం అంశంపైనా ప్రభుత్వం విడిగా మరో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ బాధ్యతలను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, అదనపు సీఎస్‌ గౌరవ్‌ గుప్తా అప్పగించింది. అలాగే.. ఈ అంశంలో ఆమె సవతి తండ్రి, డీజీపీ కె. రామచంద్రరావు పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే ఆయన్ని విచారించాలని కోరింది. ఈ వ్యవహారంలో రామచంద్ర పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చాలని గుప్తాకు వారం గడువు ఇచ్చింది ప్రభుత్వం. మార్చి 3వ తేదీన 14.8 కేజీల అక్రమ బంగారాన్ని దుబాయ్‌ నుంచి తీసుకొస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Michael Vaughan Hails IndiaCT 2025 Win Says Even B Team Post Viral9
CT: ఇండియా-‘బి’ టీమ్‌ కూడా ఫైనల్‌ చేరేది: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

భారత జట్టు ‘బలం’ ముందు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌(Michael Vaughan) తలవంచాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడిన అతడే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలోనే గొప్ప జట్టు అని భారత్‌ను కొనియాడాడు. ‘హోం అడ్వాంటేజ్‌’ అంటూ విమర్శలుచాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో రోహిత్‌ సేనకు ‘హోం అడ్వాంటేజ్‌’ ఉంటుందని విమర్శించిన వాన్‌.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుతోనే టీమిండియా టైటిల్‌ గెలవగలదని కితాబు ఇచ్చాడు.కాగా పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ మొదలు కాగా.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల ఇతర జట్లతో పోలిస్తే భారత్‌కు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని.. అలవాటైన స్టేడియంలో ఆడటం వారికి సానుకూలాంశమని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు విమర్శించారు.అంతేగాక.. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు పాకిస్తాన్‌- దుబాయ్‌(Dubai) మధ్య ప్రయాణాలు చేయడం కూడా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. వేదిక ఏదైనా టీమిండియాకు తిరుగు లేదంటూ సునిల్‌ గావస్కర్‌ వంటి భారత క్రికెట్‌ దిగ్గజాలు ఈ విమర్శలను తిప్పికొట్టారు.ఏదేమైనా గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి టాపర్‌గా సెమీస్‌ చేరిన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది.టీమిండియా-‘బి’ టీమ్‌ కూడా ఫైనల్‌ చేరేదిఈ నేపథ్యంలో మైకేల్‌ వాన్‌ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. అదే విధంగా.. భారత్‌ ‘బెంచ్‌ స్ట్రెంత్‌’ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. ఈ విజయానికి వారు అర్హులు. టీ20 ప్రపంచకప్‌ గెలిచిన వెంటనే.. ఇండియా చాంపియన్స్‌ ట్రోఫీ కూడా గెలిచింది.జైస్వాల్‌, వర్మ, శర్మ, స్కై, పంత్‌, రెడ్డి, సుందర్‌, చహల్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా, బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా ఫైనల్‌కు చేరేది. టైటిల్‌ కూడా గెలిచేది. వైట్‌బాల్‌ క్రికెట్‌లో వారి బెంచ్‌ బలానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు’’ అని మైకేల్‌ వాన్‌ ‘ఎక్స్‌’ పోస్టులో రాసుకొచ్చాడు.అతడు దూరం.. వారు బెంచ్‌కే పరిమితంకాగా భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి కారణంగా చాంపియన్స్‌ ట్రోఫీ మొత్తానికి దూరం కాగా.. యశస్వి జైస్వాల్‌ను ఆఖరి నిమిషంలో తప్పించి వరుణ్‌ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది మేనేజ్‌మెంట్‌. ఇక ఈ జట్టులో రిషభ్‌ పంత్‌కు స్థానం దక్కినా.. వికెట్‌ కీపర్‌ కోటాలో కేఎల్‌ రాహుల్‌ను తుదిజట్టులో ఆడించారు. దీంతో పంత్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లదీ ఇదే పరిస్థితి.ఇక వీరితో పాటు తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు చేరేదంటూ మైకేల్‌ వాన్‌ పేర్కొనడం విశేషం.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు

Director Shankar Gets Relief As Madras High Court From Enthiran Copyright Case10
కాపీరైట్‌ కేసు.. హైకోర్టులో డైరెక్టర్‌ శంకర్‌కి భారీ ఊరట!

కోలీవుడ్‌ డైరెక్టర్‌ శంకర్‌( Shankar )కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మద్రాస్‌ కోర్టు ఊరట కల్పించింది. రోబో సినిమా కథ విషయంలో కాపీరైట్‌(Copyright Case) ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను కొద్దిరోజుల క్రితమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. అయితే, ఈడీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది.తాను ఎలాంటి కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడలేదని మద్రాస్‌ హైకోర్టులో కొద్దిరోజల క్రితమే శంకర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు (మార్చి 11) న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎన్. సెంథిల్‌కుమార్‌ల సెషన్‌లో విచారణకు వచ్చింది. ఆ సమయంలో శంకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్.. రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వారు గతంలోనే శంకర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వారు శంకర్‌ ఆస్తులను జప్తు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.దర్శకుడు శంకర్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు తుది ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాయర్ స్పందిస్తూ.. నేరం రుజువైతే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ చర్యల వల్ల డైరెక్టర్ శంకర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో ఈ కేసును ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. కానీ, ఈడీని కోర్టు తప్పబట్టింది. శంకర్‌ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు.ఏం జరిగిందంటే..?సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సైంటిఫిక్‌ యాక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్‌ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్‌ తమిళనాథన్‌ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాపీరైట్‌ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్‌ కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు

న్యూఢిల్లీ:  ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ

title
రాజధానికి కేంద్రం నిధులపై స్పష్టత లేదు: వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై స్

title
నటి రన్యారావు కేసులో కీలక మలుపు

సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

title
కలికాలంలో.. ఓ తండ్రి విషాదగాథ!

తెలుగులో చంద్రమోహన్‌-జయసుధ నటించిన కలికాలం అనే సినిమా ఒకటుంది. సమాజంలో..

title
Dharmendra Pradhan: కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్‌ మోషన్‌

న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ

NRI View all
title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

title
ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలు కష్టమే

సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్న హెచ్

Advertisement

వీడియోలు

Advertisement