Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

AP High Court says Social media posts cannot be equated with cybercrime1
సోషల్‌ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?: హైకోర్టు

సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్‌ఎస్‌ సెక్షన్‌–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్‌ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్‌ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్‌ మీడియా పోస్టులను మెటీరియల్‌ బెనిఫిట్‌ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేం. – పోలీసులను ఉద్దేశించి హైకోర్టు సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తా­య­ని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌–­111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్ర­మ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్‌ నేరా­లు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయో చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్‌ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలంది. ప్రస్తు­త కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూ­ర్చేందుకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్‌సెప్షనల్‌ బెనిఫిట్‌ (అనుభూతి ద్వారా పొందే ప్రయోజనం)గా భావించగలమే తప్ప.. మెటీరియల్‌ బెనిఫిట్‌ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేమంది. సోషల్‌ మీడి­యా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్ధిక, వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తూ న్యా­యమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసు­లు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి కూడా ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్‌ విజయ్‌ బుధవారం విచారించారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లక్ష్మీ­నారాయణ వాదనలు వినిపిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీని­పై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.

Rasi Phalalu: Daily Horoscope On 20-03-2025 In Telugu2
ఈ రాశి వారు కాంట్రాక్టులు పొందుతారు.. వ్యాపారాలలో లాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.షష్ఠి రా.10.35 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: అనూరాధ రా.7.55 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.1.57 నుండి 3.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.07 నుండి 10.55 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: ఉ.8.32 నుండి 10.20 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 6.07. మేషం.... అనుకోని ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు..వృషభం... నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.మిథునం.... కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. నూతన విద్యావకాశాలు.కర్కాటకం... కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవచింతన.సింహం... కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నిరుద్యోగుల యత్నాలలో అవాంతరాలు.కన్య...... కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత. కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.తుల...... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వృశ్చికం.... ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. బంధువుల కలయిక. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు పురస్కారాలు.ధనుస్సు.. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ఖర్చులు. పనులు ముందుకు సాగవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. అనారోగ్యం.మకరం.... బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.కుంభం... పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. పనులు చకచకా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.మీనం.... కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

Trump Will Help Zelensky Get More Air Defence3
ఉక్రెయిన్‌-రష్యా మధ్య ‘మూడు ముక్కలాట’.. మరో కొత్త ట్విస్ట్‌

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా పుతిన్‌ తన ఇష్టానుసారం ఉక్రెయిన్‌పై మరోసారి దాడులకు పాల్పడ్డారు. దీంతో, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు మరిన్ని వైమానిక రక్షణ పరికరాలను అందంచనున్నట్టు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.తాజాగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరించడం లేదు. అందుకే ఉక్రెయిన్‌ సాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్‌కు వైమానిక రక్షణ పరికరాలను యూరప్‌ నుంచి పంపించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్‌ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే దాడులకు దిగింది. రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్‌ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్‌లో మాట్లాడిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. మరోవైపు.. మాస్కోనే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని కీవ్‌ ఆరోపిస్తే, ఉక్రెయినే దాడులు చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడం గమనార్హం.

India rich bjp mla Parag and poor mla Nirmal Kumar4
దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేలు.. ఇద్దరూ బీజేపీవారే..

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే, అత్యంత పేద ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీకి చెందినవారే. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 28 అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తులను వారి అఫిడవిట్ల ఆధారంగా సంస్థ అధ్యయనం చేసింది. వారి మొత్తం ఆస్తులు మూడు చిన్న రాష్ట్రాల వార్షికబడ్జెట్‌ను మించిపోవడం విశేషం.ముంబైలోని ఘట్కోపర్‌ ఈస్ట్‌ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్‌ షా రూ.3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రూ.1,413 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. కర్నాటకలో మొత్తం 223 మంది ఎమ్మెల్యేలకు కలిపి రూ.14,179 కోట్ల ఆస్తులుండగా మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యే లదగ్గర రూ.12,424 కోట్ల సంపద ఉంది. మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ను మించి... 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.73,348 కోట్లు. ఇది 2023–24లో మేఘాలయ (రూ.22,022 కోట్లు), నాగాలాండ్‌ (రూ.23,086 కోట్లు), త్రిపుర (రూ.26,892 కోట్లు) రాష్ట్రాల ఉమ్మడి వార్షిక బడ్జెట్ల కంటే ఎక్కువ. ప్రధాన పార్టీల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు అత్యధిక ఆస్తులున్నాయి. ఆ పార్టీకి చెందిన 1,653 మంది రూ. 26,270 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. 646 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రూ.17,357 కోట్ల సంపద ఉంది. 134 టీడీపీ ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.9,108 కోట్లు. 59 మంది శివసేన ఎమ్మెల్యేల వద్ద రూ.1,758 కోట్లున్నాయి. నిరుపేద ఎమ్మెల్యే నిర్మల్‌ కుమార్‌ పశ్చిమబెంగాల్‌లోని ఇండస్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్‌ కుమార్‌ ధార అత్యంత పేద ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.1,700 మాత్రమే. అత్యల్ప ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేలున్న రాష్ట్రాలుగా త్రిపుర, మణిపూర్, పుదుచ్చేరి నిలిచాయి. 60 మంది త్రిపుర ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు రూ.90 కోట్లు. మణిపూర్‌లోని 59 మంది ఎమ్మెల్యేలకు రూ.222 కోట్లు, పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలకు రూ.297 కోట్ల ఆస్తులున్నాయి.

Lovely Professional University B.Tech student securing job offer of Rs 2.5 cr package5
ఎల్‌పీయూ బీటెక్‌ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్‌లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్‌మెంట్‌లో లీడర్‌గా ఎల్‌పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్‌పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్‌సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్‌పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్‌పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్‌కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్‌పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్‌, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్‌, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌లు పొందిన వివిధ బీటెక్‌ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్‌సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్‌లో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్‌ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్‌మెంట్‌ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్‌ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్‌ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్‌పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్‌మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్‌పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్‌లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్‌మెంట్లు సాధించేందుకు ఎల్‌పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Knight Riders enter the Indian Premier League as defending champions6
కోల్‌'కథ' ఎంతవరకు!

ఏ జట్టయినా విజయవంతమైన కూర్పును కొనసాగించాలనుకుంటుంది... కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రం అందుకు విభిన్నమైన ప్రణాళికలతో అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దకాలం తర్వాత తమ జట్టుకు ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన కెపె్టన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను వేలానికి వదిలేసుకున్న నైట్‌రైడర్స్‌... ఓ మామూలు ఆటగాడి కోసం భారీగా ఖర్చు పెట్టింది. జాతీయ జట్టుకు దూరమైన సీనియర్‌ ప్లేయర్‌ అజింక్య రహానేకు పిలిచి మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే ఎన్ని మార్చినా కోర్‌ గ్రూప్‌ను మాత్రం కదల్చని కోల్‌కతా... డిఫెండింగ్‌ చాంపియన్‌గా టైటిల్‌ నిలబెట్టుకునేందుకు సై అంటోంది! ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు మాత్రమే ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండేళ్లు చాంపియన్‌గా నిలిచాయి. నైట్‌రైడర్స్‌ ఈసారి తమ గెలుపు ‘కథ’ను ఎంతవరకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరం కానుంది! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ చెరో ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకోగా... ఆ తర్వాత అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) మూడుసార్లు విజేతగా నిలిచింది. 2012, 2014, 2024లో కేకేఆర్‌ ట్రోఫీ హస్తగతం చేసుకుంది. గతేడాది ఐపీఎల్‌ వేలంలో ‘కోర్‌ గ్రూప్‌’ను తిరిగి కొనసాగించిన ఫ్రాంచైజీ... జట్టుకు మూడోసారి కప్పు అందించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, ఆ్రస్టేలియా స్టార్‌ పేసర్‌ స్టార్క్‌ను మాత్రం వదిలేసుకుంది. పేస్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ కోసం ఏకంగా రూ. 23 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచిన యాజమాన్యం... కోటిన్నర ప్రాథమిక ధరతో కొనుగోలు చేసుకున్న సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానేకు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా... కేకేఆర్‌ 21 మందినే తీసుకుంది. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు రూ. 13 కోట్లు... ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి, వెస్టిండీస్‌ టి20 స్పెషలిస్ట్‌లు రసెల్, నరైన్‌లకు రూ. 12 కోట్లు చొప్పున అందించి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... హర్షిత్‌ రాణా, రమణ్‌దీప్‌లను రూ. 4 కోట్లతో కొనసాగించింది. ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంటే దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంది. నరైన్‌పై భారీ అంచనాలు... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్‌ పండిత్‌ కేకేఆర్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... గతేడాది జట్టుకు మెంటార్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ ... టైటిల్‌ గెలిచిన అనంతరం టీమిండియా హెడ్‌ కోచ్‌గా వెళ్లిపోయాడు. ఇప్పుడతడి స్థానంలో విండీస్‌ మాజీ ఆటగాడు డ్వేన్‌ బ్రావో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై, చెన్నై జట్లు మాత్రమే వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచాయి. ఇప్పుడు కోల్‌కతా ముందు అలాంటి అరుదైన అవకాశం మూడోసారి ఉంది. వెస్టిండీస్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ నరైన్‌ను ఓపెనర్‌గా దింపి మెరుగైన ఫలితాలు రాబట్టిన కేకేఆర్‌ ఈసారి కూడా అదే ప్లాన్‌ అనుసరిస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన నరైన్‌... కేకేఆర్‌ తరఫున అటు స్పిన్నర్‌గా ఇటు ఓపెనర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్‌లో 488పరుగులు, 17 వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. గుర్బాజ్, నరైన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించడం ఖాయమే కాగా... అజింక్య రహానే, వెంకటేశ్‌ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్‌ సింగ్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నారు. బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి, నరైన్, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా కీలకం కానున్నారు. రహానే రాణించేనా? డిఫెండింగ్‌ చాంపియన్‌గా మరింత బాధ్యతగా ఉండాల్సిన కేకేఆర్‌... తన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. కప్పు అందించిన కెపె్టన్‌ను వదిలేసుకోవడం... తుదిజట్టులో ఉంటాడో లేదో నమ్మకంగా చెప్పలేని ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడం... వెరసి సీజన్‌ ఆరంభానికి ముందే వార్తల్లో నిలిచింది. ఫామ్‌లేమికి తోడు వయసు మీదపడుతున్న కారణంగా భారత జట్టుకు దూరమైన రహానే మరి కేకేఆర్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి. వెంకటేశ్‌ అయ్యర్‌ వైస్‌ కెప్టెన్ గా వ్యవహరించనుండగా... ఆస్థాన ఆటగాళ్లు రసెల్, నరైన్‌ కేకేఆర్‌కు ప్రధాన బలంకానున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఈ ఇద్దరు జట్టుకు చేకూర్చే విలువ మాటల్లో చెప్పలేనిది. ఇటీవల చాంపియన్స్‌ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన వరుణ్‌ చక్రవర్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. నోర్జే, స్పెన్సర్‌ జాన్సన్, హర్షిత్‌ రాణా, రావ్‌మన్‌ పావెల్, వైభవ్‌ అరోరాతో పేస్‌ విభాగం బలంగానే ఉన్నా... వీరు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. విదేశీ ఆటగాళ్ల కోటాలో నరైన్, రసెల్, గుర్బాజ్‌ తుది జట్టులో ఉండటం పక్కా కాగా... నాలుగో ప్లేయర్‌గా నోర్జే, మొయిన్‌ అలీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు: రహానే (కెప్టెన్‌), రింకూ సింగ్, డికాక్, గుర్బాజ్, రఘువంశీ, పావెల్, మనీశ్‌ పాండే, లవ్‌నిత్‌ సిసోడియా, వెంకటేశ్‌ అయ్యర్, అనుకూల్‌ రాయ్, మొయిన్‌ అలీ, రమణ్‌దీప్, రసెల్, నోర్జే, వైభవ్, మయాంక్‌ మార్కండే, స్పెన్సర్‌ జాన్సన్, హర్షిత్‌ రాణా, నరైన్, వరుణ్, చేతన్‌ సకారియా. అంచనా: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కేకేఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్న కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టం కాదు. రహానే జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం.

Suspense over the selection of BJP national president7
వచ్చే నెలలోనే కొత్త సారథి..!

సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వచ్చే నెలలో కొలిక్కి రానుంది. పార్లమెంట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో వచ్చే నెల రెండో వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాంతం, అనుభవం, విధేయతల అనుగుణంగా పలువురు సీనియర్‌ నేతల పేర్లపై చర్చ జరుగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భిన్న ప్రాతిపదికలు.. జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ప్రధానంగా నాలుగు అంశాల ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం తెరపైకి వచి్చంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడి రేసులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 45 ఏళ్లుగా పార్టీలో ఉన్న అనుభవం, యువమోర్చా నుంచి పార్టీలో పనిచేసిన అనుభవం ఆయనకు అనుకూలంగా మారుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటివరకు పార్టీ మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇందులో తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్‌ పేరు ముందు వరుసలో ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మహిళల మద్దతు కూడగట్టేందుకు ఈమె ఎంపిక కలిసొస్తుందన్నది పార్టీ అంచనా. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను ఎంపిక చేసింది. అదే వరుసలో మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. విధేయత, పార్టీలో పనిచేసిన అనుభవం ఆధారంగా చూస్తే భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు సన్నిహితులు. పైగా యూపీ, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యూహాలు రచించడంలో దిట్టలైన వీరిద్దరిలో ఒకరి ఎంపిక జరిగితే అది కచ్చితంగా మోదీ, షాల సూచన మేరకే జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతున్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులైన మనోహర్‌లాల్‌ ఖట్టర్, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి పూర్తిగా మద్దతున్నా, కేంద్రంలో వీరికున్న ప్రాధాన్యం దృష్ట్యా అధ్యక్ష ఎంపికలో వీరిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? తేలాల్సి ఉంది.

Saptagiri new movie pelli kani prasad8
నవ్వించడానికి చేసిన సినిమా ఇది

‘‘మా కథకి పర్ఫెక్ట్‌ టైటిల్‌ ‘పెళ్లి కాని ప్రసాద్‌’. ఈ పేరు డైరెక్టర్‌ అభిలాష్‌ ఫిక్స్‌ చేశారు. ఆ టైటిల్‌ వెయిట్‌ని కాపాడేలా మా సినిమా ఉంటుంది. వినోదం చాలా అద్భుతంగా కుదిరింది. ప్రమోషన్స్‌కి వెళ్లినప్పుడు ఇప్పటికే కొంతమంది నన్ను ‘పెళ్లి కాని ప్రసాద్‌’ అని పిలుస్తున్నారు. అందరూ అలా పిలిస్తే మా సినిమా ప్రేక్షకులకు బాగా చేరువ అయినట్టే. అంతకంటే ఆనందం ఏముంటుంది’’ అని సప్తగిరి తెలిపారు. అభిలాష్‌ రెడ్డి గోపిడి దర్శకత్వంలో సప్తగిరి, ప్రియాంకా శర్మ జోడీగా నటించిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్‌’. చాగంటి సినిమాటిక్‌ వరల్డ్‌ సమర్పణలో కేవై బాబు, భానుప్రకాశ్‌ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్, వైభవ్‌ రెడ్డి ముత్యాల నిర్మించారు. నిర్మాత ‘దిల్‌’ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రేపు (శుక్రవారం) ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి కెరీర్‌లో ఐకానిక్‌ క్యారెక్టర్‌ పెళ్లి కాని ప్రసాద్‌ (‘మల్లీశ్వరి’ చిత్రంలో). ఆయన పాత్రతో నా పాత్రని ఏ మాత్రంపోల్చుకోను. మా సినిమా ట్రైలర్‌ వెంకటేశ్‌గారు విడుదల చేసి.. ‘కంటెంట్‌ చాలా పాజిటివ్‌గా ఉంది.. సినిమా హిట్‌ సాధించాలి’ అని ఆశీర్వదించారు. మా సినిమాకి సపోర్ట్‌ చేసిన హీరోలు ప్రభాస్, వెంకటేశ్, దర్శకులు మారుతి, అనిల్‌ రావిపూడి, నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ గార్లకు కృతజ్ఞతలు. ఈ మూవీలో ఎలాంటి సందేశం లేదు.. ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన సినిమా. ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూశాక మా నిర్మాతలూ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నారు. శేఖర్‌ చంద్ర మ్యూజిక్, నేపథ్య సంగీతం బాగుంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేస్తున్నాను. హీరోగా కూడా కొన్ని కథలు విన్నాను’’ అని చె΄్పారు.

Special Story On Huge Debts Of Chandrababu Govt9
ఏం అమ్మి తీరస్తారు సామీ.. అప్పులన్నీ..?

సెంద్రబాబునాయుడు ఓ పక్కన కుర్సీ యెక్కిన కాణ్నించీ యెడాపెడా అప్పులు జేస్తానే వుండారు గదా..! అప్పు పుట్టించడాన్ని గూడా ఏదో యెవరెస్టు యెక్కిన మాదిర్తో టముకు యేసుకుంటా.. పోటోలకు పోజులిస్తావుంటారు గదా..! కానీ ‘యేంది సామీ.. రాజదాని కడతండావు సరే.. ఇన్నేసి డబ్బులు గుమ్మరిస్తండావేంది’ అని అడిగినామే అనుకో.. ‘ఓరి పిచ్చోడా యిది సెల్ఫ సస్టయినబుల్ ప్రోజెక్టురా.. అంటా వుంటాడు. అదేందో పలకడానికే నాకు నోరు తిరగడం లేదుగానీ.. ‘అంటే యేందిరా సామీ’ అని యింకో సావాసగాణ్ని అడిగినా. యేం జెప్పినాడో తెలుసునా...‘‘వోరి యెర్రోడా.. మన యెసుట్లోకి మనమే బియ్యం సంపాయించాల.. మన డప్పు మనమే గొట్టుకోవాల.. యిట్టాగానే.. ఆ అమరావతి గూడా దాన్ని కట్టడానికి కావాల్సిన డబ్బులంతా అదే సంపాదించుకుంటాదంట’’ అని జెప్పినాడు.యేడరా సామీ.. యాబయి వేల కోట్ల రూపాయలు ఇప్పుటికే అప్పులు తెస్తిరి.. తీరా జూడబోతే యిప్పుడు కట్టబొయ్యే కతలన్నీ కలిపి నలబై వేల కోట్ల కూడా లేకపాయె.. కొండంత అప్పులు దెచ్చినారు గదా.. యెట్టా తీర్చబోతారు అని కలవరం పుట్టింది నాకు. మా మినిస్టరు నారాయణ మాటలు యింటే మాత్రం సమ్మగా అనిపిస్తండాయి.. కలవరం మొత్తం మాయమైపోతాందంటే నమ్మాల! యింతకీ ఆయనేం అంటండారో తెలుసునా?యీ అప్పులతో ఇప్పునడు మొదులు బెడుతున్న బిల్డింగులు అన్నీ కట్టేయంగా యింకా నాలుగువేల యెకరాలు మిగల్తాయంట.. సిటీ మొత్తం దూందాంగా అయిపోయుంటాది గాబట్టి.. అప్పుడు బూముల రేట్లు ఆకాసెంలో వుంటాయంట. ఆ యేళకి గవుర్మెంటు కాడ నాలుగువేల యెకరాల బూమి వుంటాదంట.. దాన్నంతా అమ్మితే.. ఈ అప్పులు యేపాటివి.. వుఫ్ మని వూది పారేస్తాను గదా.. అంటాండారు. మాట యిన్నప్పుడు సమ్మగానే వుంటంది గానీ.. తలుసుకున్నప్పుడు మాత్రం గుబులు గుబులుగానే వుంటాండాది సామీ.. యిన్నేసి అప్పులు తెచ్చి గుప్పెడు బిల్డింగులు గట్టంగానే అమరావతి సిటీ మొత్తం పూర్తయిపోయినట్టేనా? ఇల్లలికితే పండగ అయిపోతందా? యిదిగూడా అట్నే గదా అని నా బయ్యిం.తీరా ఈ యాబైవేల కోట్లు తగలేసి ఏదో ఓ కాడికి పనులు అయినాయని అనుకున్నాక.. యిప్పుటిదాకా అయిందంతా.. కాయితం మీద గుర్రం బొమ్మ గీసినట్టే.. ఈ బొమ్మ పెకారం మంచి గ్రానైటు రాయిని దెచ్చి బొమ్మని చెక్కాల అని.. బొమ్మను చెక్కినాక, అయ్యో బొమ్మ నల్లగా ఉండాది గదా.. దీనికి బంగారం తాపడం జేయిస్తే బెమ్మాండంగా వుంటాది అనీ.. యిట్టా రకరకాల మాటలు జెప్తా.. అరలచ్చ కోట్లు నగరానికి యింకో లచ్చన్నర కోట్లు తగలెయ్యాల్సిందే.. అని కొత్త పాటలు పాడకుండానే వుంటారా? అనేది అనుమానంగా వుండాది సామీ..!యినుకుంటా వుండారా? ఒక్కో రోడ్డు యెయ్యాలంటే కిలోమీటరుకి యాబై మూడు కోట్ల రూపాయిలా..? నోట్లేమయినా అచ్చేస్తండామా సామీ..! ఈ దేసెంలో ఎంత పెద్ద రాచబాట యేసినా.. సెంట్రలు గవుర్మెంటోల్లు కిలోమీటరుకి 20 కోట్ల దుడ్లు పెడితే చానా జాస్తి అంటాండారే.. మనోళ్లేమైనా కొండల్ని పగలదీసి యేస్తండారా.. ఆకాసానికి అద్దాల నిచ్చెనేసి ఆ పైన రోడ్డేస్తండారా.. యేం జేస్తండారని.. కిలోమీటరుకి అన్నేసి కోట్లు తగలేస్తండారో వొక యితరణ వుండాల గదా? యిట్టా తగలేస్తే యింకో అరలచ్చ కోట్లు అప్పులు దెచ్చినా ఆరతి కర్పూరం అయిపోకుండా వుంటాయా అని నాకు బయం సామీ!యెనకటికి ఇద్దరు సావాసగాళ్లు వున్నారంట. వొకడు ‘తిందాం తిందాం’ అంటే.. ‘ఏం చేసి తిందాం’ అని రెండోవాడు అన్నాట్ట. ‘అప్పుజేసి తిందాం’ అంటే.. ‘అప్పెట్ట తీర్చాల’ అన్నాట్ట. ‘అప్పుజేద్దాం.. వూరొదిలి పారిపోదాం’ అన్నాట్ట మొదటి పెద్దమనిషి. ఆ మాదిర్తో జనం గుండెల మీద బండరాయి పడకుండా వుండాలంటే ఈ అప్పులకి యీడ పుల్ స్టాపు పెడతాండాం అని ఓ మాట జెప్పండి సామీ. లేపోతే అయ్యన్నీ తీర్చడానికి అమరావతిలోనూ అడుగు బూమీ మిగలదు.. మా బోటోళ్ల బతుకులన్నింటినీ వుడ్డగా అమ్మేస్తే తప్ప ఆ అప్పు తీరదు. కొంచిం దయపెట్టండి... ఎం.రాజేశ్వరి

India online gaming sector may cross 9 billion dollers by 202910
ఆన్‌లైన్‌ గేమింగ్‌.. జూమింగ్‌ 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌ హద్దే లేదన్నట్టుగా శరవేగంగా విస్తరిస్తోంది. రియల్‌ మనీ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వింజోగేమ్స్, ఐఈఐసీ సంయుక్త అంచనా ప్రకారం.. 2024లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌ విలువ 3.7 బిలియన్‌ డాలర్లుగా ఉంటే (సుమారు రూ.32,000 కోట్లు).. 2029 నాటికి 9.1 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.80,000 కోట్లు) వృద్ధి చెందనుంది. ముఖ్యంగా 86 శాతం వాటాతో రియల్‌ మనీ గేమ్స్‌ (ఆర్‌ఎంజీ) విభాగం ఈ మార్కెట్‌ను శాసించనుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో గేమ్‌ డెవలపర్ల సదస్సులో భాగంగా ఈ సంయుక్త నివేదికను వింజోగేమ్స్, ఐఈఐసీ విడుదల చేశాయి. ‘‘భారత్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ అసాధారణ వృద్ధి పథంలో కొనసాగుతోంది. 2029 నాటికి 9.1 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌తో.. ఇన్వెస్టర్లకు 63 బిలియన్‌ డాలర్ల విలువైన అవకాశాలను అందించనుంది. టెక్నాలజీ పరమైన ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు (ఐపీ), యూజర్లతో అనుసంధానం (ఎంగేజ్‌మెంట్‌) ద్వారా గేమింగ్‌కు భారత్‌ను బలమైన కేంద్రంగా (పవర్‌హౌస్‌) మార్చేందుకు వింజో కట్టుబడి ఉంది’’అని వింజో సహ వ్యవస్థాపకుడు పవన్‌ నంద తెలిపారు. 59 కోట్ల యూజర్లు.. ఈ నివేదికలోని సమాచారం ప్రకారం చూస్తే దేశంలో 59.1 కోట్ల మంది గేమర్స్‌ ఉన్నారు. అంతర్జాతీయంగా ఉన్న గేమర్లలో 20 శాతం ఇక్కడే ఉన్నారు. 11.2 బిలియన్‌ మొబైల్‌ గేమ్‌ యాప్‌ డౌన్‌లు నమోదయ్యాయి. 1,900 గేమింగ్‌ కంపెనీలతో ఈ రంగం సుమారుగా 1.3 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం 3 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం గమనార్హం. ప్రస్తుతం రూ.32 వేల కోట్ల ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్లో రియల్‌ మనీ గేమ్స్‌ (ఆర్‌ఎంజీ) వాటా 85.7 శాతంగా ఉంటే, 2029 నాటికి రూ.80 వేల కోట్ల మార్కెట్‌లోనూ 80 శాతం వాటా కలిగి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. నాన్‌ రియల్‌ మనీ గేమ్స్‌ మార్కెట్‌ వాటా ఇదే కాలంలో 14.3 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దేశంలో ఏకైక లిస్టెడ్‌ గేమింగ్‌ సంస్థ నజారా టెక్నాలజీస్‌ అంతర్జాతీయంగా లిస్టెడ్‌ గేమింగ్‌ కంపెనీల్లో అధిక ప్రీమియం వ్యాల్యుయేషన్‌ను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. ‘‘ప్రస్తుత ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగం మార్కెట్‌కు (32వేల కోట్లు) నజారా మాదిరే విలువను ఆపాదించినట్టయితే.. అప్పుడు ఇతర గేమింగ్‌ కంపెనీల ఐపీవోల రూపంలో ఇన్వెస్టర్లకు 26 బిలియన్‌ డాలర్ల విలువ సమకూరనుంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకుతోడు, బలపడుతున్న గేమ్‌ డెవలపర్‌ ఎకోసిస్టమ్, సానుకూల నియంత్రణ వాతావరణంతో 2034 నాటికి ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌ పరిమాణం 60 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. 20 లక్షల ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుంది’’అని వివరించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేలు.. ఇద్దరూ బీజేపీవారే..

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే, అత్యంత పేద ఎమ్మె

title
రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తా..!

యశవంతపుర: భార్య వేధిస్తోందని ఆత్మహత్య చేసుకున్న భర్తల గురిం

title
శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ ప

title
‘మీరు సమాధుల్లో దాక్కున్నా తవ్వితీస్తాం’

ముంబై: నాగ్ పూర్ లో జరిగిన హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌

title
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కోర్టులో కీలక పరిణామం

సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హ

International View all
title
ఉక్రెయిన్‌-రష్యా మధ్య ‘మూడు ముక్కలాట’.. మరో కొత్త ట్విస్ట్‌

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో

title
విరామం అంటూనే విరుచుకుపడింది

కీవ్‌: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు

title
భారత్‌లో ట్రంప్‌ కంపెనీ.. తొలి ఆఫీస్‌ ఎక్కడంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన వ్యాపార సమ్మేళనం ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట

title
Trump: న్యాయవ్యవస్థను బేఖాతరు చేయబోతున్నారా?

అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార

title
అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం

ఆరేలియో మార్టినెజ్: అమెరికాలోని హోండురాస్‌(

NRI View all
title
సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్‌ రిక్వెస్ట్‌!

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం  కేసులో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

title
తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో

title
ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు

 ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర

title
పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా

title
Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్‌ సంతాపం

అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్

NRI View all
title
Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్‌ కో

అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్‌ అండ్‌ కో

title
నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సిన

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement

వీడియోలు

Advertisement