Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Tiruvuru Counselors Meet YS Jagan1
తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్‌ జగన్‌కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్‌ జగన్‌.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.

Operation Kagar: Who Is The Next Target Of The Security Forces2
ఆపరేషన్‌ కగార్‌.. భద్రత బలగాల నెక్ట్స్ టార్గెట్ అతడేనా?

ఛత్తీస్‌గఢ్‌: భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందడంతో భద్రత బలగాలు మరింత దూకుడు పెంచాయి. పార్టీలో కీలక నేతగా ఉన్న మడావి హిడ్మా టార్గెట్‌గా కేంద్ర హోంశాఖ ఆపరేషన్ మొదలుపెట్టింది.అంబుజ్‌మడ్ దండకారణ్యంలో హిడ్మా కోసం రెండు వేల మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐఏ హిట్ లిస్టులో హిడ్మా ఉండగా, మావోయిస్టు పార్టీలో 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించినట్లు సమాచారం.రాబోయే 10 నెలలు కీలక నేతలు టార్గెట్‌గా ఆపరేషన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఎక్కడెక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నారన్నదానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది. మరో వైపు నంబాల కేశవరావు మృతిపై మావోయిస్ట్‌ పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కేశవరావు మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. తాజా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అత్యవసర సమావేశమైంది.

Transfer Manager After Kannada Language Row In Bangalore SBI Bank3
నీ భాషలో మాట్లాడ.. ఏం చేసుకుంటావో చేస్కో పో!

సాక్షి,బెంగళూరు: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో (sbi) ప్రాంతీయ (language row) భాష చిచ్చు పెట్టింది. ఎస్‌బీఐ మేనేజర్‌ తమ మాతృ భాషలో మాట్లాడడం లేదంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో ప్లకార్డ్‌లతో నిరసన చేపట్టారు. ఈ అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఇతర నేతలు సైత్యం జోక్యం చేసుకోవడం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు సదరు మేనేజర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ఎస్‌బీఐ చర్యలకు ఉపక్రమించింది.ఇంతకీ ఏం జరిగిందంటే? కర్ణాటక రాజధాని బెంగళూరు సూర్యా నగర్‌ ఎస్‌బీఐ (SBI Surya Nagar branch Bangalore) బ్రాంచ్‌లో కస్టమర్‌కు, మహిళా బ్యాంక్‌ మేనేజర్‌ మధ్య వివాదం జరిగింది.అందుకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆ వీడియోల్లో బ్యాంక్‌ మేనేజర్‌ను పదేపదే కన్నడలో (kannada language row) మాట్లాడమని కస్టమర్‌ సూచించడం, అందుకు బ్యాంక్‌ మేనేజర్‌ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటారో ఏం చేసుకోండి’ అంటూ కస్టమర్‌, బ్రాంచ్‌ మేనేజర్‌ మధ్య సంభాషణ జరిగింది. 🚨 Karnataka's divisive language war!SBI manager in Chandapura unfairly targeted for not speaking Kannada.India’s diversity means we can’t force one language—Hindi & English are official too.Let’s respect all tongues & unite, not vilify!🇮🇳#sbimanager #Kannada #Karnataka… pic.twitter.com/nv0Rd5W6Yr— Rahul Kumar (@RealRavani) May 21, 2025 అలా అని రాసుందా?ఒకానొక సమయంలో ‘మేమేం చేయాలో మీరు చెప్పడం కాదని బ్యాంక్‌ మేనేజర్‌..కస్టమర్‌తో అనడం. భాష విషయంలో మళ్లీ జోక్యం చేసుకున్న కస్టమర్‌ మీరు హిందీలో కాకుండా కన్నడలో మాట్లాడమని బ్యాంక్‌ మేనేజర్‌కు సూచించడం.. అందుకు మేనేజర్‌ బదులిస్తూ..అలా అని ఎక్కడైనా రాసుందా? అని ప్రశ్నించడంతో మరింత వివాదం రాజుకుంది.ఇది కర్ణాటక.. కాదు ఇండియాకస్టమర్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తీరును ప్రశ్నిస్తూ.. ఇది ఆర్‌బీఐ నిర్ణయం. మీరు ముందు అది తెలుసుకోండి. ఇది కర్ణాటక ఇక్కడ కన్నడే మాట్లాడాలి అని అనడంతో.. ఇది ఇండియా అని బ్యాంక్‌ మేనేజర్‌ జవాబు ఇవ్వడం వీడియోల్లో కనిపిస్తోంది.ఎస్‌బీఐ సూర్యానగర్‌ బ్రాంచ్‌లో జరిగిన వివాదంపై ఎస్‌బీఐ స్పందించింది. బెంగళూరులోని సూర్యనగర్ బ్రాంచ్‌లో జరిగిన ఘటనపై మేం తీవ్రంగా విచారిస్తున్నాము. ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తున్నాం. ఎస్‌బీఐ తన కస్టమర్ల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రవర్తనకు సంబంధించి జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తుందని స్పష్టం చేసింది. అలాగే, ఎస్‌బీఐ మేనేజర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు సమాచారం. మరింత వివాదం ఎస్‌బీఐ బ్యాంక్‌లో బ్యాంక్‌ మేనేజర్‌,క స్టమర్‌ మధ్య చోటు చేసుకున్న వివాదం రాష్ట్రంలో పలు చోట్ల కన్నడ మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. ప్రో-కన్నడ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. ఎస్‌బీఐ సూర్యాపురం బ్రాంచ్‌ సిబ్బంది కన్నడ కస్టమర్లను అవమానిస్తోందని, స్థానిక భాషలో ప్రాథమిక సేవల్ని అందించడంలో విఫలమవుతున్నారని కేఆర్‌వీ ప్రతినిధులు ఆరోపించారు.A severe protest erupted today by the #KaRaVe members against the arrogant manager at the #SBIBank in #Chandapur, #Bengaluru!#ServeInMyLanguage #StopHindiImposition #KannadaInKarnataka https://t.co/K9HNZlsiYr pic.twitter.com/2WiFLdTiBD— Safa 🇮🇳 (@safaspeaks) May 21, 2025మరోవైపు, ఎస్‌బీఐ బ్యాంక్‌లో జరిగిన వివాదంపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌ వేదికగా సంప్రదించారు. బ్రాంచ్‌ మేనేజర్‌ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. Many bank customers, especially in rural Karnataka, face extreme difficulty when banking staff - those that have a public interface - don’t communicate in local language. This is an issue faced by millions of customers in many states. After we raised this issue at multiple… https://t.co/msr6azNuFf pic.twitter.com/juFQyNq8uj— Tejasvi Surya (@Tejasvi_Surya) May 21, 2025The behaviour of the SBI Branch Manager in Surya Nagara, Anekal Taluk refusing to speak in Kannada & English and showing disregard to citizens, is strongly condemnable.We appreciate SBI’s swift action in transferring the official. The matter may now be treated as closed.…— Siddaramaiah (@siddaramaiah) May 21, 2025

Supreme Court Grants Bail To Former Ias Trainee Pooja Khedkar4
పూజా ఖేడ్కర్‌ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌కు బెయిల్‌ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రత, వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఇప్పుడు పూజ అన్నీ కోల్పోయింది.. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదన్న ధర్మాసనం.. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించింది. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌కు ఎంపికైన పూజ ఖేడ్కర్‌ను శిక్షణ నుంచి యూపీఎస్సీ తొలగించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్‌ రూల్స్‌ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.పుణెలో ఐఏఎస్‌ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్‌ సమయంలో అధికారిక ఐఏఎస్‌ నెంబర్‌ ప్లేట్‌ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో గత ఏడాది ఆమెపై పుణె కలెక్టర్‌ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది.అంతేగాక నిబంధనలకు మించి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.‌

Operation Chhattisgarh: Nambala Death Offcially Declared By HM Shah5
మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి: అమిత్‌ షా అధికారిక ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. నంబాల మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ వివరాలను ఆయన తెలియజేశారు. నారాయణపూర్‌లో ఇప్పటిదాకా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందారు. ఇందులో సీపీఐ మావోయిస్ట్‌ జనరల్‌ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్‌ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి’’ అని ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారాయన. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ తర్వాత 54 మందిని అరెస్ట్‌ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’’ అని షా ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు అలియాస్‌ గంగన్నగా ఆయన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు ఈయన ప్రధాన సూత్రధారి. కేంద్ర కమిటీ సభ్యుడైన నంబాలపై కోటిన్నర రివార్డు ఉంది.కాల్పులు ఇలా.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్‌ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇంజనీరింగ్‌ చదివి.. నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. నంబాల వరంగల్‌(తెలంగాణ) ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్‌ చదివారు. 1984లో ఎంటెక్‌ చదువుతూ పీపుల్స్‌ వార్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు కొనసాగుతూ వచ్చారు.

Ireland Cricketer Paul Stirling Creates History Vs West Indies6
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్‌ క్రికెటర్‌ పాల్‌ స్టిర్లింగ్‌

ఐర్లాండ్‌ వెటరన్‌ క్రికెటర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకున్న తొలి ఐరిష్‌ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఐరిష్‌ క్రికెట్‌కు మూలస్థంభంగా ఉన్న స్టిర్లింగ్‌.. ఆ దేశం తరఫున 8 టెస్ట్‌లు, 167 వన్డేలు, 150 టీ20లు ఆడి 10000 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 57 అర్ద సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన 97వ ఆటగాడిగానూ స్టిర్లింగ్‌ రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టిర్లింగ్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. స్టిర్లింగ్‌ తర్వాత ఆండ్రూ బల్బిర్నీ అత్యధికంగా 6055 పరుగులు చేశాడు. ఆతర్వాత కెవిన్‌ ఓబ్రెయిన్‌ 5850, విలియమ్‌ పోర్టర​్‌ఫీల్డ్‌ 5480, హ్యారీ టెక్టార్‌ 3732 పరుగులు చేశారు. 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్టిర్లింగ్‌.. ఆ మరుసటి ఏడాది టీ20లు, 2018లో టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌ విషయానికొస్తే.. 3 వన్డేలు, 3 మ్యాచ్‌ టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (మే 21) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఐర్లాండ్‌ 35 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పాల్‌ స్టిర్లింగ్‌ (54), కార్మిచెల్‌ (16) ఔట్‌ కాగా.. బల్బిర్నీ (87), హ్యారీ టెక్టార్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద స్టిర్లింగ్‌ 10000 పరుగుల మైలరాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టిర్లింగ్‌ సాధించిన హాఫ్‌ సెంచరీ వన్డేల్లో అతనికి 57వది.

KSR Comments On CBN And Yellow Media7
లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు!

పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్‌ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్‌బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్‌ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్‌ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్‌ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్‌ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్‌బుక్‌ కారణంగా జిందాల్‌ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్‌కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్‌ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లు ఎందుకు చెప్పారు?. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.అంతేకాదు.. ఎన్‌టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్‌ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్‌ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్‌ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Jyoti Malhotra to Hasan, Get Me Married in Pakistan8
‘నన్ను పెళ్లి చేసుకోవా’.. పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ (Pakistan) ఐఎస్‌ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ ఐఏస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్‌ చాటింగ్‌ను గుర్తించారు. ఆ చాటింగ్‌లో ఐఏస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌ తనని పాకిస్తాన్‌లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్‌ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.దుబాయ్‌ నుంచి డబ్బులువాట్సప్‌ చాట్‌తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్‌ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురుభారత్‌-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్‌కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని తేలింది.

Telangana Weather: Hyderabad Rain Updates May 21 20259
హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు బిగ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌, సాక్షి: ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్‌ అలర్ట్‌’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్‌పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్‌ హోల్స్‌, కరెంట్‌ పోల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు

Sukumar Gives Big Update About Ram Charan Movie10
రామ్‌ చరణ్‌తో సినిమా.. ‘రంగస్థలం’ మించిపోతుంది: సుకుమార్‌

మలికిపురం: తన తదుపరి చిత్రం ‘గ్లోబల్‌ స్టార్‌’ రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకు­డు సుకుమార్‌ చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో స్వగ్రామమైన మట్టపర్రుకు కుటుంబ సమేతంగా మంగళవారం ఆయన విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... హీరో రామ్‌చరణ్‌తో సినిమా తీసేందు­కు కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తామిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని, ఆ తరువాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా స్థాయికి రామ్‌చరణ్‌ ఎదిగారన్నారు. ఆయనతో తాను చేయబోయే చిత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్‌తో తీసిన ‘పుష్ప’ జా­తీ­య స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. పుష్ప–1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూ­సి రెండో భాగాన్ని మరింత ఫోకస్‌ పెట్టి తీశామన్నారు. స్వగ్రామం మట్టపర్రులోని తన ఇంట్లో చిన్నారితో ముచ్చటిస్తున్న దర్శకుడు సుకుమార్‌ ప్రేక్షకుల అభిరుచి ఏం మారలేదు సినిమాపై ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని సుకుమార్‌ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రేక్షకుల్లో కొంత భాగం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. టాలెంట్‌ ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు సుకుమార్‌ రైటింగ్స్‌ వంటి సంస్థల్ని స్థాపించానన్నారు. ఈ సంస్థల ద్వారా చాలామందికి ప్రోత్సాహం, టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఆ దిశగానే ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమేరెండేళ్లకు పైగా చాలా బిజీ షెడ్యూల్స్‌లో ఇరుక్కుపోయానని, షూటింగ్స్‌ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల స్వగ్రామానికి రాలేకపోయానని సుకుమార్‌ చెప్పారు. లేదంటే ఏటా సంక్రాంతి పండుగను ఇక్కడే చేసుకునే వాళ్లమన్నారు. ఇకపైనా ఏటా ఇదే సంప్రదాయం కొనసాగిస్తానన్నారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే అన్నారు. కోనసీమలో గోదారి గట్లూ.. కాలువ చెంత, పొలాల మధ్య స్నేహితులతో తిరిగిన క్షణాలు, కాలేజీ రోజులు చాలా బాగుంటాయన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement