
న్యూఢిల్లీ: మైక్రో సాఫ్ట్ ఉద్యోగులకు శుభవార్త. కరోనా నేపథ్యంలో ఇచ్చిన వర్క్ ఫ్రం హోంను ఇకపై శాశ్వతంగా చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ శనివారం ప్రకటించింది. అయితే ఈ అవకాశం కొన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. మహమ్మారి బారిన ఉద్యోగులు పడకకుండా ఉండేందుకు పలు ఐటీ కంపెనీలతో సహా ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. వర్క్ ఫ్రం హోంతో మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర కంపెనీలు లాభపడినప్పటికి కోవిడ్ ప్రభావం తగ్గగానే తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. (చదవండి: ‘పని చేస్తూ నిద్రించేలా ఉన్నారు: సత్యా నాదెళ్ల)
అయితే మైక్రోసాఫ్ట్ తన ప్రకటనలో హర్డ్‌వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాలలో పని చేస్తోన్న ఉద్యోగులు మినహా ఇతర విభాగాల్లో పని చేసే ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. అలా చేయాలనుకుంటున్న ఉద్యోగుల ఆయా విభాగాలకు చెందిన తమ మేనేజర్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వారి నివాస స్థలాల్ని కూడా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఆమెరికాలో పని చేస్తున్న విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లి పని చేసుకోవచ్చని స్ఫష్టం చేసింది. అంతేగాక అమెరికాలోని ఉద్యోగులు కుడా సొంత ప్రదేశాలకు వెళ్లోచ్చిన చెప్పింది. అయితే వేతనాల్లో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయని, ఇందుకోసం మేనేజర్ నుంచి అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. (చదవండి: బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్!)
Comments
Please login to add a commentAdd a comment