దాసరి నర్సయ్య, గుండా మల్లేశ్, పాటి సుభద్ర, అమురాజుల శ్రీదేవి
సాక్షి, ఆదిలాబాద్: 'ఉమ్మడి ఆసిఫాబాద్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బెల్లంపల్లికి చెందిన నలుగురు రాజకీయ నాయకులు వరుసగా 33ఏళ్లు ఏలారు. నలుగురూ కలిసి మొత్తంగా ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిచి సత్తా చాటారు. బెల్లంపల్లి ప్రాంత వాస్తవ్యులైన దాసరి నర్సయ్య (కాంగ్రెస్), గుండా మల్లేశ్ (సీపీఐ), పాటి సుభద్ర, అమురాజుల శ్రీదేవి (టీడీపీ)కి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టి ఆదరించారు.'
1952 జనరల్ ఎన్నికలతో పాత ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, తిర్యాణి, తాండూర్, భీమిని మండలాలతో పాటు పారిశ్రామిక క్షేత్రం బెల్లంపల్లి ప్రధాన పట్టణంగా ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో బెల్లంపల్లి కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి వరకు ఉమ్మడి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగాయి.
ఇందులో 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ (కాంగ్రెస్), 1957లో జరిగిన మలి విడత ఎన్నికల్లో జి.నారాయణరెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించారు. ఆ తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని ఎస్టీలకు రిజర్వు చేశారు. ఆ తదుపరి 1967, 1972 ఎన్నికల వరకు ఎస్టీ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం దక్కింది. వరుసగా ఆ మూడు ఎన్నికల్లోనూ గిరిజన నాయకుడు కొట్నాక భీంరావు (కాంగ్రెస్) ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
1978లో ఎస్సీ రిజర్వుడ్..
ఉమ్మడి ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని 1978లో ఎస్సీలకు రిజర్వు చేశారు. అంతకు ముందు వర కు ఆసిఫాబాద్ ప్రాంత నాయకులు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా బెల్లంపల్లి ప్రాంత నాయకులకు ఆ భాగ్యం కలుగలేదు. ఎస్సీలకు రిజర్వు చేసినప్పటి నుంచి బెల్లంపల్లి రాజకీయ నాయకుల దశ మా రింది. వరుసగా 1978, 1983, 1985 (ఉప ఎన్నికలు), 1989, 1994, 1999, 2004లో జరిగిన సా ధారణ ఎన్నికల్లో బెల్లంపల్లి వాస్తవ్యులైన కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా విజ యం సాధించి ఆసిఫాబాద్‌పై పట్టు బిగించారు.
హ్యాట్రిక్ సాధించిన గుండా మల్లేశ్..
ఎస్సీలకు రిజర్వు చేసిన తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గంపై బెల్లంపల్లి ప్రాంత రాజకీయ నాయకులకు ఎదురులేకుండా పోయింది. 1978 ఎన్నికల నుంచి 2004 ఎన్నికల వరకు బెల్లంపల్లి నేతలే వరుసగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1978లో జరిగిన ఎన్నికల్లో దాసరి నర్సయ్య (కాంగ్రెస్), 1983లో జరిగిన ఎన్నికల్లో గుండా మల్లేశ్ (సీపీఐ), 1985లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ గుండా మల్లేశ్ ఘన విజయం సాధించారు.
989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండోసారి దాసరి నర్సయ్య, 1994లో జరిగిన ఎన్నికల్లో గుండా మల్లేశ్ మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పాటి సుభద్ర (టీడీపీ) విజయ బావుటా ఎగురవేసి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఖ్యాతి గడించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అమురాజుల శ్రీదేవి (టీడీపీ) విజయం సాధించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి గుండా మల్లేశ్ రికార్డు సృష్టించారు.
రెండుసార్లు దాసరి నర్సయ్య, పాటి సుభద్ర, అమురాజుల శ్రీదేవి ఒక్కోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో ఏర్పడిన బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గుండా మల్లేశ్ విజయం సాధించి తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మొత్తంగా నాలుగు సార్లు గుండా మల్లేశ్ విజయం సాధించారు.
ఎమ్మెల్యేలుగా ఎన్నికై న బెల్లంపల్లి నేతల వివరాలు..
1978 దాసరి నర్సయ్య కాంగ్రెస్
1983 గుండా మల్లేశ్ సీపీఐ
1985 గుండా మల్లేశ్ సీపీఐ
1989 దాసరి నర్సయ్య కాంగ్రెస్
1994 గుండా మల్లేశ్ సీపీఐ
1999 పాటి సుభద్ర టీడీపీ
2004 అమురాజులశ్రీదేవి టీడీపీ
Comments
Please login to add a commentAdd a comment