ఢిల్లీలో తరుణ్‌చుగ్, డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్న గొడం నగేశ్
బీజేపీలోకి ‘గొడం’
ఢిల్లీలో కాషాయం కండువా కప్పుకున్న నగేశ్
అందరూ చేరినట్టే ఆయన చేరారంటున్న ఎంపీ ‘సోయం’
మారుతున్న రాజకీయ సమీకరణాలు
సాక్షి, ఆదిలాబాద్: మాజీ ఎంపీ గొడం నగేశ్ బీజేపీలో చేరారు. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత కేసీ ఆర్‌కు లేఖను పంపించారు. కొద్ది రోజులుగా ఆయ న కాషాయ పార్టీలో చేరుతారని జరిగిన ప్రచారం నిజమైంది. మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఇందులో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మోదీ నాయకత్వంలో పని చేసేందుకు..
బీజేపీలో చేరిన అనంతరం గొడం నగేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని వివరించారు. ఈ మేరకు ఆయన నాయకత్వంలో పనిచేయాలని ఉందని, అందుకోసమే బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు.
అందరు చేరినట్లే ఆయన చేరారు..
గొడం నగేశ్ బీజేపీలో చేరిక విషయంపై ఎంపీ సోయం బాపూరావును సాక్షి ఫోన్‌లో సంప్రదించగా అందరు చేరినట్లే ఆయన కూడా చేరారన్నారు. ఇదివరకు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మె ల్యే రాథోడ్ బాపూరావు, జెడ్పీచైర్మన్ రాథోడ్ జనా ర్దన్ కూడా చేరారన్నారు. పార్టీ సర్వే చేసి టికెట్ ఇస్తుందని పేర్కొన్నారు. నా కంటే బెటర్‌గా ఉంటే ఆయనకే వస్తుందన్నారు. ఎంపీ సోయం ఈ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నగేశ్ బీజే పీ టికెట్ కన్ఫామ్‌తోనే పార్టీలో చేరారా..? లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఈ విషయంలో ఆయనను ఫోన్‌లో సంప్రదించగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
రెండో జాబితాలో ప్రకటించేనా..
బీజేపీ రెండో జాబితా సోమవారం వెలువడొచ్చనే పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఆదిలా బాద్ అభ్యర్థిని ప్రకటిస్తారా.. లేని పక్షంలో మూడో జాబితా వరకు వేచి చూడాల్సి వస్తుందా అనేది కొద్ది గంటల్లో తేలనుంది. ఏదేమైనా బీజేపీలో ఈ సమీకరణాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో కలిసి గొడం చేరడం గమనార్హం.
అక్కడ లంబాడా సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన పక్షంలో ఆది లాబాద్‌లో ఆదివాసీ సామాజికవర్గానికి ఇవ్వచ్చని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా ఆది లాబాద్ సిట్టింగ్ స్థానంలో బీజేపీ పరంగా అభ్యర్థి ఎంపికపై అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజా గా చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాలపై అందరి దృష్టి నెలకొంది. టికెట్ ఎవరికి వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇవి చదవండి: రెండో జాబితాపై కాంగ్రెస్ కసరత్తు.. నేడు కీలక భేటీ
Comments
Please login to add a commentAdd a comment