షార్ట్‌సర్క్యూట్‌తో ధాన్యం బస్తాలు దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని రాయాపూర్‌కాండ్లీ శివారు ప్రాంతంలోని శ్రీసాయి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో శనివారం షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా గోదాం నుంచి పొగతో కూడిన మంటలు వచ్చాయి. గోదాంలో ఖాళీ గోనె సంచులు, ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. సిబ్బంది వెంటనే భైంసా ఆగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. గోదాంలో రూ.10 లక్షల విలువ చేసే ఖాళీ సంచులు, రూ.5 లక్షల విలువ చేసే ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతైనట్లు యజమాని కోస్లి వెంకట్‌రావు తెలిపారు.
సెక్యూరిటీగార్డుపై దాడి
ఆదిలాబాద్‌రూరల్: మావల శివారు ప్రాంతంలో జాతీయ రహదారి 44కు అనుకుని ఉన్న దాబా వెనుకలో ల్యాండ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌పై గుర్తుతెలియని వ్యక్తులు శనివారం దాడి చేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది కార్తీక్‌సింగ్, విఠల్ అక్కడికి చేరుకుని గాయపడిన విజయ్‌కుమార్‌ను రిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment