ఎనిమిది కాళ్లతో గొర్రెపిల్ల జననం
కుభీర్: మండల కేంద్రంలో బాలకిషన్‌కు చెందిన గొర్రె శనివారం ఎనిమిది కాళ్లతో గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. గొర్రెపిల్ల కడుపులో చనిపోయింది. జన్యుపరమైన లోపంతోనే జరిగిందని పశువైద్యాధికారి విశ్వజిత్ తెలిపారు.
పీడీఎస్ బియ్యం
బహిరంగ వేలం
భైంసాటౌన్: ధర్మాబాద్ నుంచి తరలిస్తుండగా పట్టణంలో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యాన్ని అధికారులు శనివారం వేలం నిర్వహించారు. తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో బహిరంగ వేలం నిర్వహించగా, ధర్మాబాద్‌కు చెందిన మహబూబ్ ఆలం 360 క్వింటాళ్ల బియ్యాన్ని కిలో రూ.31 చొప్పున దక్కించుకున్నాడు. దీంతో ప్రభుత్వానికి రూ.11.16 లక్షల ఆదాయం చేకూరింది. పట్టణ ఎస్సై శ్రీనివాస్‌యాదవ్, డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకాశ్, ఆర్‌ఐ జయరావు, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి బాపురావు, తదితరులున్నారు.
వేలాల జాతర ఏర్పాట్ల పరిశీలన
జైపూర్: మండలంలోని వేలాలలో ఈ నెల 26నుంచి మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించే జాతర ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ శనివారం పరిశీలించారు. గుట్టౖ పెన తొలి రోజున జరిగే జతరకు వచ్చే భక్తులు, కల్పించిన సౌకర్యాలు, రెండో రోజు గుట్ట కింద ఆలయం వద్ద భక్తులకు కల్పించే సౌకర్యాలను పరిశీలించారు. వాహనాల పార్కింగ్, గోదావరి నది ఒడ్డున భక్తుల పుణ్యస్నానాలు ఆచరించడానికి ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీధర్, వేలాల ప్రత్యేక అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ విద్యసాగర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment