యూరియా కోసం బారులు
లోకేశ్వరం: మండలంలోని మన్మద్‌లో లోకేశ్వరం పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూరియా గోదాం వద్ద శనివారం గ్రామాల రైతులు బారులు తీశారు. మొక్కజొన్న, వరి, నువ్వు పంటలకు యూ రియా అవసరం ఉండడంతో రాజూర, మన్మద్, ఎడ్ధూర్, పోట్‌పల్లి, హవర్గ గ్రామాల రైతులు ఉదయం కౌంటర్ వద్ద క్యూ కట్టారు. గోదాంకు కేవలం 450 యూరియా బస్తాలు రావడంతో సిబ్బంది ఒక పట్టాదారు రైతులకు 5 బస్తాల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి నిరీక్షించిన కొందరికి 5 యూరియా బస్తాలు దొరికాయి. మరికొందరికి దొరకపోవడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారులతో మాట్లాడారు. మళ్లీ యూరియా లోడ్ వస్తుందని చెప్పగానే రైతులు వెనుదిగి వెళ్లిపోయారు.
యూరియా కోసం బారులు
Comments
Please login to add a commentAdd a comment