పేకాటస్థావరంపై దాడి
ఆసిఫాబాద్‌అర్బన్/లింగాపూర్: జిల్లాలోని సిర్పూర్(యూ)పోలీసుస్టేషన్ పరిధిలోని దేవుడుగూడ శివారులో అందిన సమాచారంతో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం పేకాటస్థావరంపై అకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.10,160 నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు సెల్‌ఫోన్లు, 52 పేకాట ముక్కలను సీజ్ చేశారు. పేకాటస్థావరంపై దాడి చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ డీవీ. శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని వేంపల్లిలో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హాజీపూర్ ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. తాండూర్ గ్రామానికి చెందిన పబ్బని నాగయ్య(49) కొండగట్టుకు వెళ్లి తిరిగివస్తున్నాడు. శుక్రవారం రాత్రి కావడంతో వేంపల్లి గ్రామంలో పెద్ద కుమారుడు రాజశేఖర్ ఇంటికి వచ్చి అక్కడే నిద్రపోయాడు. శనివారం ఉదయం 9:30 గంటలకు ఒక్కసారిగా నాగయ్య నురుగులు కక్కుతూ కిందపడగా కుమారుడు, కుటుంబీకులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి మృతికి కారణాలు తెలియరాలేదు. పెద్ద కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment