సమాజ సుస్థిరతకు యువత తోడ్పడాలి
బాసర: సమాజ సుస్థిరతకు యువత తోడ్పాటు అందించాలని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రాఫెసర్ గోవర్ధన్ తెలిపారు. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీఎస్) కార్యక్రమాన్ని ప్రా రంభించింది. కార్యక్రమాన్ని ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓయస్డీ) ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో రణధీర్ సాగి, ఇతర అధికారుల సమక్షంలో అధికారికంగా ప్రారంభించారు. 17 ఎస్డీజీల ముఖ్య ఉద్దేశం స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం, అందరికీ మెరుగైన భవిష్యత్తును నిర్ధారించడం అని గోవర్ధన్ తెలిపారు. ఆర్జీయూకేటీ వి ద్యార్థులు 17 అంశాల్లో 10 అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. పేదరిక నిర్మూలన, స్థిరమైన వ్యవసాయం, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య సమగ్ర సమాన విద్యను అందించడానికి తగిన ఆలోచనలు చేయాలని సూచించారు. స్థిరమైన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వాతావరణ మార్పు దాని ప్రభావాలను పరిష్కరించడం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. ఆర్జీ యూకేటీ స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి 17 ఎస్డీజీలను సాధించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాకేశ్‌రెడ్డి, ఎన్ ఎస్‌ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ..
ట్రిపుల్ ఐటీలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన
సమాజ సుస్థిరతకు యువత తోడ్పడాలి
Comments
Please login to add a commentAdd a comment