సామల ‘యాది’ఎంతో ఇష్టం
సెల్‌ఫోన్ వాడకం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మొబైల్ వాడకం కన్నా పుస్తకాల వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. నేను ఎక్కువగా పుస్తకాలకే ప్రాధాన్యతనిస్తాను. 25 ఏళ్లుగా గ్రంథాలయానికి వస్తున్నాను. గురజాడ అప్పారావు, సామల సదాశివ రచనలను ఇష్టంగా చదువుతాను. సామల రచించిన యాది నాకు ఎంతో ఇష్టమైన గ్రంథం.ఆయన పుస్తకంలో తెలుగు భాష ఎంతో వినసొంపుగా, మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
– జి.ఆదినారాయణ,
పాఠకుడు, కోలిపురా, ఆదిలాబాద్
పుస్తకాలు చదవడం అలవాటు
పుస్తకాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పుస్తకం చదవడం వల్ల మానసికంగా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. కథలు, కవితలను చదివితే ఆసక్తి ఎంతగానో పెరుగుతుంది. ప్రతీ విషయంపై ఏకాగ్రత కుదురుతుంది. చిన్ననాటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. – రాజేశ్వర్, పాఠకుడు,
నేతాజీ చౌక్, ఆదిలాబాద్
కథల పుస్తకాలు ఆసక్తి
రెండేళ్లుగా లైబ్రరీకి వస్తున్నాను. చిన్ననాటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు. కథలు పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతాను. కథలంటే అమితాసక్తి. ఇంటికి ఈ పుస్తకాలు తీసుకువెళ్తాను.
– శృతి, ఖానాపూర్, ఆదిలాబాద్
సామల ‘యాది’ఎంతో ఇష్టం
సామల ‘యాది’ఎంతో ఇష్టం
Comments
Please login to add a commentAdd a comment