కోదండరాం వ్యాఖ్యలపై ఖండన
మంచిర్యాలటౌన్: ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇస్తామని ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించడాన్ని మంచిర్యాల జిల్లా మెడికల్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్య వ్యవస్థలో నకిలీలను ప్రోత్సహించే విధంగా కోదండరాం మాటలు ఉండడం శోచనీయమని అన్నారు. ఇప్పటికే కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలు అధిక మోతాదులో స్టెరాయిడ్, యా ంటీబయాటిక్స్, నొప్పి మందులను వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూస్తున్నామని అన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ ప్రాక్టీస్ చేయాలంటే దాదాపు ఐదున్నరేళ్లు కష్టపడాలని, అలాంటి కష్టమైన సబ్జెక్ట్‌ని రెండు మూడు నెలల శిక్షణతో ఎలా చేయగలరని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ, సెక్రెటరీ డాక్టర్ విశ్వేశ్వర్‌రావు, డాక్టర్ చంద్రదత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment