పార్టీ కోసం కష్టపడే వారికే ‘నామినేటెడ్’
కై లాస్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు తప్పకుండా గుర్తింపునిచ్చి, తగిన గౌరవం కల్పిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ కా ర్యాలయాన్ని మంత్రి సోమవారం సందర్శించారు. ఆమెకు పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారికి నామి నేటెడ్ పదవులిచ్చి గౌరవిస్తామన్నారు. మరికొందరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అవకాశం కల్పిస్తామన్నారు. పదవులిస్తేనే పనిచేస్తామనడం సరికాద ని, పనిచేసిన వారికే పదవులందుతాయని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల్లోనూ పార్టీ విజ యానికి కృషి చేయాలన్నారు. ఇందులో పార్లమెంట్ ఇన్‌చార్జి సుగుణ, తదితరులు పాల్గొన్నారు.
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment