‘ఇందిరమ్మ’ నిర్మాణాలపై అపోహలు వద్దు
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ వ్యయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా హౌసింగ్ పీడీ బసవేశ్వర్ అన్నారు. రూ.5లక్షల వ్యయంతో నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించుకోవచ్చని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన 14మండలాల్లోని 35 మంది తాపీమేసీ్త్రలకు స్థానిక జిల్లా పరిషత్‌లోని పంచాయతీ వనరుల కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 మండలాల్లోని 17 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్‌లైయాష్ బ్రిక్స్, సిమెంట్ ఇటుకలతో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వారికి శిక్షణ మెటీరియల్‌తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఐదు రోజుల శిక్షణలో భాగంగా ఉచిత భోజనంతో పాటు రోజుకు రూ.300 చొప్పున ఉపకారవేతనం అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, హౌసింగ్ ఏఈ నసీర్, న్యాక్ ఏడీ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment