ఐసీడీఎస్ పీడీకి అస్వస్థత
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్ర జావాణి కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సబిత ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా చె మటలు పట్టి నోటిమాట రాకపోవడంతో అధికా రులు, ఉద్యోగులంతా ఆందోళనకు గురయ్యా రు. అక్కడే ఉన్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా ఆమెను పరామర్శించి కుటుంబీకులతో మాట్లాడగా రోజువారి మాత్రలు వేసుకోకపోవడంతో అలా జరిగి ఉంటుందని వివరించారు. అప్పటికే ఆమె తేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ సూచనతో ఆమెను విశ్రాంతి కోసం ఇంటికి పంపించారు.
ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవ ని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజుతో కలిసి ఫ్లెక్సీ షాపు యజమానులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాన కూడళ్లలో ఇష్టానుసారం ఫ్లెక్సీల ఏర్పాటుతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇందులో సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్, ఫణిదర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment