‘సీసీఐపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి’●
ఆదిలాబాద్‌టౌన్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)పై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు వారి వైఖరి స్పష్టం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016 నుంచి సీసీఐ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని ప్రగల్బాలు పలికిన బీజేపీ నాయకులు ప్రస్తుతం సీసీఐని స్క్రాప్ కింద విక్రయించేందుకు టెండర్లు పిలిచారని తెలి పారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐని తుక్కు కింద విక్రయించే విషయం వీరికి తెలియదా అ ని ప్రశ్నించారు. సీసీఐ పునరుద్ధరణ కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ పరిశ్రమలకు రాయితీ ఇస్తామని, లేక రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుందని కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. రూ.43 కోట్లతో స్క్రాప్ కింద అమ్మేందుకు మార్చి 6 వరకు టెండర్లు పిలిచారని అన్నారు. సమావేశంలో నారా యణ, సాజిదొద్దిన్, రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment