మమ్మల్ని ఆదుకోండి
మేమంతా ఏళ్లుగా కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం. గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్‌కు చెందిన ఓ గిరిజన రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేయడంలో భాగంగా చేలో ఉన్న బండరాళ్లను తొలగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. సదరు రైతు అనుమతితోనే వాటిని తొలగించి లారీలో లోడ్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు వచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. మైనింగ్ అధికారులకు అప్పగించారు. బండరాళ్లను కొడితే తప్ప ఉపాధి పొందలేని పరిస్థితి మాది. బండరాళ్లతో ఉన్న లారీని విడిపించి మమ్మల్ని ఆదుకోవాలి.
– ఒడ్డెర కులస్తులు, పిట్టలవాడ, ఆదిలాబాద్
నాకు ఇచ్చోడ ఎస్‌బీఐలో ఖాతా ఉంది. పంట సాగు కోసం ఆ బ్యాంకు నుంచి రూ.1,50,696లను రుణంగా తీసుకున్నాను. అయితే నా బ్యాంకు ఖాతా నంబర్‌కు నా భార్య ఆధార్ నంబర్‌ను కూడా ఆఫీసర్లు మ్యాపింగ్ చేశారు. ఇలా ఒకే బ్యాంకు ఖాతాకు రెండు ఆధార్‌నంబర్లు మ్యాపింగ్ కావడంతో నాకు రావాల్సిన రుణమాఫీ అందలేదు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదంతో నష్టపోయిన నాకు న్యాయం చేయాలని కోరుతున్నా.
– అందెరి చంద్రకాంత్, జున్ని, ఇచ్చోడ
రుణమాఫీ కాలేదు
మమ్మల్ని ఆదుకోండి
Comments
Please login to add a commentAdd a comment