నాణ్యమైన విద్యుత్ అందించేలా పనిచేయాలి
ఆదిలాబాద్‌టౌన్: వినియోగదారులకు నా ణ్యమైన విద్యుత్ అందించడంలో క్షేత్రస్థా యి ఉద్యోగుల పాత్ర కీలకమని ట్రాన్స్‌కో సీఈ జేఆర్.చౌహాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం లైన్‌మెన్ దినోత్సవం నిర్వహించారు. జూనియర్ లైన్‌మెన్, లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఫోర్‌మెన్‌ను ఆయన శాలు వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ: మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఈ జేఆర్ చౌహాన్ హాజరయ్యారు. ఇందులో డీఈలు హరికృష్ణ, ఎడ్డ న్న, ఏడీఏ లక్ష్మణ్, ఏఈలు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment