సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
ఆదిలాబాద్‌రూరల్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రగతిశీల భవన, ఇతర కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యంరెడ్డికి పలు డిమాండ్లతో కూడి వినతి పత్రం అందజేశారు. ఇందులో భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, నారాయణ, తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ నర్సింగ్, దేవిదాస్, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు సుభాష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తౌఫీక్, అజీమ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment