ప్రైవేటుకు దీటుగా బోధన
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యాబోధన సా గుతుందని డీఈవో ప్రణీత అన్నారు. సాత్నాల మండలం జామిని ప్రాథమికో న్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల చదువు కోసం గ్రామస్తులు రూ.60వేల విలువైన టీవీని అందించడం అభినందనీ యమని కొనియాడారు. మారుతున్న కా లానికి అనుకూలంగా డిజిటల్ తరగతులు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గంగుల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు శరత్ యాదవ్, ఎస్‌ఎంసీ చైర్మన్ దేవ్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment