
ఓపెన్ ‘పది’, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
మంచిర్యాలఅర్బన్: ఈ నెల 20నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంచిర్యాలలో పదో తరగతికి రెండు పరీక్ష కేంద్రాలు, ఇంటర్ పరీక్షలకు మూడు, బెల్లంపల్లిలో పదో తరగతికి ఒకటి, ఇంటర్‌కు రెండు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులు 666, ఇంటర్ విద్యార్థులు 1192 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు స్టడీ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తామని, విద్యార్థులతోపాటు సిబ్బంది పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి పరికరాలు, సెల్‌ఫోన్లు తీసుకు రావద్దని సూచించారు.
న్యాయవాదిపై దాడి దుర్మార్గపు చర్య
మంచిర్యాలక్రైం: న్యాయవాదులపై దాడులు దుర్మార్గపు చర్య అని మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు అన్నారు. ఈ నెల 16న సూర్యపేట జిల్లా న్యాయవాది మాంతపురం కిషోర్‌పై దాడిని ఖండిస్తూ గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా బార్ ఆసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగ్‌రావు, న్యాయవాదులు మాట్లాడుతూ దాడులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుల అంజనేయులు, ధత్తు, గోపతిరవి, శ్రీరాములు, జాడీ తిరుపతి, శ్రీకాంత్ తదిరులు పాల్గొన్నారు.
విధుల బహిష్కరణ
లక్సెట్టిపేట: న్యాయవాది కిషోర్‌పై దాడిని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు విధులు బహిస్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్, ఉపాధ్యక్షులు నళినికాంత్, కోషాధికారి సుమన్ చక్రవర్తి, న్యాయవాదులు భూమరెడ్డి, సురేందర్, అక్కల శ్రీధర్, కిరణ్‌కుమార్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.