
33వ రోజుకు సీపీఐ దీక్షలు
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ నియోజకవర్గపరిధిలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారంతో 33వ రోజుకు చే రాయి. ఈ సందర్భంగా ఆయా కాలనీవా సులు శిబిరంలో కూర్చొని సర్కారు తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కుంటాల రాములు మాట్లాడుతూ, ఉన్నతాధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.