
ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్‌రూరల్: మావల గ్రామపంచాయతీ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని, పిట్టలవాడలో నిర్మించిన వృద్ధాశ్రమ భవనాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. అలాగే బాలసదనం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతోషం ఎందులో ఉండదన్నారు. కొంత మంది పిల్లలు వారి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వయోవృద్ధ ఆశ్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో ఆదిలా బాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు శంకర్, బొజ్జు, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ, శ్రీకాంత్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క, పక్కన ఎంపీ తదితరులు